ఎస్సెస్సీ, ఇంటర్, ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు


P.Joginaidu
18
Anakapalle
2024-02-13 14:29:08

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ విషయాలపై రెవెన్యూ విద్యా పోలీసు తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 18వ తేదీ నుండి 27 వ తేదీ వరకు ఎస్ ఎస్ సి పరీక్షలు ఉదయం గం 9:30 నిల .నుండి మధ్యాహ్నం గం 12 45 ని.ల వరకు జరుగుతాయని   ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉగం 9-00ని. ల నుండి మధ్యాహ్నంగం. 12-00ల వరకు, జరుగుతాయని చెప్పారు. అంతేకాకుండా ఓపెన్ స్కూల్ పరీక్షలు, ఏపీపీఎస్సీ పరీక్షలు కూడా జరుగుతాయన్నారు. వివిధ శాఖల సమన్వయంతో  ఎటువంటి లోటుపాటులు లేకుండా పరీక్షలన్నీ ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యుత్తు తాగునీరు పారిశుధ్యం మొదలైన మౌలిక వసతులన్నీ పూర్తిగా ఉండాలన్నారు. 

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి పనులన్నీ నియమిత కాలంలో ఖచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోనికి వెళ్లే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రికల్ డిజిటల్ స్మార్ట్ పరికరాలు పరీక్ష హాల్లోనికి అనుమతించ రాదన్నారు. సమయపాలన కచ్చితంగా అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రాథమిక చికిత్స ఓ ఆర్ ఎస్ గ్లూకోస్ మొదలైనవి అందుబాటులో ఉంచాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల ప్రాంతంలో ప్రశ్న పత్రాలు ఆన్సర్ పత్రాలను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచాలని పోస్ట్ ద్వారా ఆ రోజే పంపించాలన్నారు. అధికారులు సూచించిన చెక్ లిస్ట్ అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రెవిన్యూ పోలీస్ విద్యాశాఖ అధికారులతో స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు.  డీఈవో వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 108 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో 397 పాఠశాలలకు సంబంధించిన 21, 259 మంది రెగ్యులర్ విద్యార్థులు 2324 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.

 పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లకు కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్ ఐ ఈ ఓ  బి. సుజాత మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 14 పోలీసు స్టేషన్లలో ప్రశ్న పత్రాలు స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 13,323 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో 1074 మంది జనరల్, 2619 మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థులు. రెండవ సంవత్సరం 15,298 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో 1278 మంది జనరల్ ఒకేషనల్ కోర్సు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ ఎస్ సి పరీక్షలు మార్చి 18 నుండి 27 వరకు ఐదు కేంద్రాల్లో జరుగుతాయని 788 మంది హాజరవుతున్నారన్నారు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సం.పరీక్షలు 11 కేంద్రాలలో మార్చి 18 నుండి 26వ తేదీ వరకు జరుగుతాయని 2205 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలు ఐదు కేంద్రాలలో మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 3 తేదీ వరకు జరుగుతాయని 991 మంది హాజరవుతున్నట్లు వివరించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి దయానిధి అనకాపల్లి డి.ఎస్.పి సుబ్బరాజు ఉప విద్యాధికారి రవిబాబు డిఇసి మెంబర్లు డి ఈ సి మెంబర్లు ఎం శ్రీనివాసరావు పి శిరీష రాణి పివిఎన్ మూర్తి జిల్లా బల్క్ మెంబర్ ఎం.మోహన్ రావు పోస్టల్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ పండా ఆర్ టి సి మేనేజర్ కే.ఎస్. నారాయణ ఎస్ టి ఓ పి రాజేష్ టెలిఫోన్స్ జే టి ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.