అనకాపల్లి జిల్లాలో 604 జంటలకు రూ.3.57 కోట్లు


P.Joginaidu
17
Anakapalle
2024-02-20 12:03:59

అనకాపల్లి జిల్లాలో వై.ఎస్.ఆర్. కళ్యాణమస్తు, షాదీ తోఫా క్రింద 604 జంటలకు రూ.3కోట్ల 57 లక్షల 20 వేలు జమ చేసినట్లు జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి తెలిపారు.  మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్దిదారులకు చెక్కును అందజేశారు.  కలెక్టరు మాట్లాడుతూ కొత్తగా వివాహం చేసుకున్న వారిలో అర్హులైన వారందరూ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొరకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.  జిల్లాలో బిసి-ఎ కు చెందిన 74 జంటలకు రూ.37 లక్షల 50 వేలు, బిసి-బి కి చెందిన 51 జంటలకు రూ.28 లక్షల 75 వేలు, బిసి-డికు చెందిన 406 జంటలకు రూ.2కోట్ల, 14లక్షల 75 వేలు, బి.సి.ఈ కి చెందిన మూడు జంటలకు రూ. 3 లక్షలు, ఓసికి చెందిన ఒక జంటకు రూ.1లక్షా 50 వేలు,  ఎస్.సి.కి చెందిన 63 జంటలకు రూ.64 లక్షల 90 వేలు, ఎస్.టి.కి  చెందిన 6 జంటలకు రూ.6లక్షల 80 వేలు వారి ఖాతాలలో జమచేసినట్టు తెలిపారు.   అనకాపల్లి జెడ్.పి.టి.సి. బి. వరాహ సత్యవతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల పేద ప్రజలకు పెద్ద కొడుకుగా వారి ఆర్ధిక సమస్యలను తీర్చడమే ధ్యేయంగా సుపరిపాలన సాగిస్తున్నారని చెప్పారు.  అమ్మఒడి, పించన్లు, ఆసరా మొదలైన కార్యక్రమాలను ప్రవేశపెట్టి అన్ని కుటుంబాలను ఆదుకుంటున్నారని చెప్పారు.  పేదలైన ఎస్.సి., ఎస్.టి., బి.సి. కుటుంబాలలో ఆడపిల్లల పెళ్ళికి ధన సహాయం చేస్తూ ఆదుకుంటున్నారని ఆమె తెలిపారు.  అంతకు ముందు తాడేపిల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గన్న కార్యక్రమాన్ని అందరూ తిలకిం చారు.  తరువాత జిల్లా కలెక్టరు లబ్దిదారులకు చెక్కును అందజేశారు.  ఈ కార్యక్రమంలో డిఆర్ డిఏ పి.డి. శచీదేవి, ఎపిడి డైజీ, బి.సి. సంక్షేమ శాఖ ఏ.డి.  అజయ్ బాబు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువ జంటలు పాల్గొన్నారు.