ఏపీటిఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా సిహెచ్.కరుణాకరరావు


Ens Balu
74
Visakhapatnam
2024-02-22 10:43:46

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటిఎఫ్) విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా సిహెచ్.కరుణాకరరావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈయన గత20ఏళ్లుగా యూనియన్ లో వివిధ హోదాల్లో పనిచేసి, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు చేశారు. ఇటీవల జరిగిన యూని యన్ ఎన్నికల్లో కరుణాకరరావుని ఉపాధ్యాయులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు, సిపిఎస్ రద్దు, ఇతర అలవెన్సులు, పీఆర్సీ బకాయిలు, అరియర్స్ విడుదల విషయంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. కరుణాకరరావు సేవలను గుర్తించిన ఉపాధ్యాయులు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన ఎంపిక పట్ల జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు, సిపిఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్ లు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.