అక్టోబర్ 12న పోస్టల్ కన్జూమర్ అదాలత్..


Ens Balu
3
Srikakulam
2020-09-29 18:47:55

శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు అక్టోబర్ 12న తపాలా అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పర్యవేక్షకులు వై.యస్.నర్సింగరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. తపాలా వినియోగదారులు యొక్క వ్యక్తిగత ఫిర్యాదులు మరియు సమస్యల  పరిష్కారానికై అక్టోబర్ 12న ఉదయం 11.00గం.లకు సూపరింటెండెంట్ వారి కార్యాలయం, ఓల్డ్  నవత బిల్డింగ్ పైన, న్యూకాలనీ, శ్రీకాకుళం  - 532001 నందు తపాలా అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. కావున శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని  తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులను అక్టోబర్ 5లోగా ‘’ తపాలా  అదాలత్ ’’ అను  శీర్షికతో  ‘’ వై.ఎస్.నరసింగరావు,  సూపరింటెండెంట్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ ,  శ్రీకాకుళం – 532001” చిరునామాకు  పంపవలసినదిగా కోరారు. గడువుతేదీ ముగిసిన పిదప వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని, ఫిర్యాదుదారులు వ్యక్తిగతముగా కూడా అదాలత్ నకు హాజరుకావచ్చనని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.