సరికొత్త రాజకీయ వ్యూహం..?!


P.Joginaidu
174
anakapalli
2024-03-09 00:41:50

అనకాపల్లిలో అసలైన రాజకీయం మొదలైంది..మాజీ మంత్రులు ఇద్దరూ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయడానికి సిద్దపడ్డారు. వీరి కలయిక ఆంధ్రప్రదేశ్ లోనే హాట్ టాపిక్ అవుతోంది. ఏది ఏమైనా జిల్లాను హస్తగతం చేసుకోవాలంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రధాన నేతలు కలవకపోతే కుదరదనే ఆలోచనకి వచ్చిన వీరు కలిసి పనిచేసి జిల్లా నుంచి తొలిగెలుపు..అదీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్నే టిడిపి-జనసేన కూటమికి ఇవ్వాలని నిర్ణయించారు. వీరి కలయికతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయం వేడెక్కింది వైఎస్సార్సీపి చెక్ పెట్టాలంటే అది దాడి, కొణతా కలయిక వలనే సాధ్యపడుతుందనే కార్యకర్తల అభీష్టాన్నీ ఇరువురు నాయకులు నిజంచేయడానికి ఒక్కటవడం సంచలనం రేపుతోంది..!  తెలుగుదేశం జనసేన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విజయానికి ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. శుక్రవారం గవరపాలెం లోని ఆయన నివాసానికి రామకృష్ణ  విచ్చేశారు. ఈ సందర్భంగా దాడి ఆయన అంతరంగికులందరూ రామకృష్ణ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆత్మీయ పలకరింపు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై ఇరువురి నేతలు చర్చించారు. వారిని కలిసిన విలేకరులతో వీరభద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ విజయం చారిత్రాత్మక అవసరం అన్నారు. రాష్ట్రం అరాచక పాలన వల్ల అధోగతి పాలవుతుందన్నారు భూకబ్జాదారులు సంఘ విద్రోహసక్తులు పెట్రేగిపోతున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ముఖ్య అనుచరుడిగా ఆయన మంత్రివర్గంలో పనిచేసిన రామకృష్ణ సమర్థవంతమైన పాత్ర పోషించార న్నారు .ఆ సమయంలో తాను శాసనమండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని చెప్పారు . కొణతాలకు టికెట్టు పొత్తులో భాగంగా జనసేన నుండి రావటం జరిగిందన్నారు  అందుకు అందరూ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రామకృష్ణ గెలుపుకు సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. అలాగే జనసేన నేత టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ దాడి వీరభద్రరావు తో కాలేజీ నుండి అనుబంధం ఉందన్నారు.

ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఏఎంఎ ఎల్ కాలేజీ లో తాను చదువుకోవడం జరిగిందన్నారు.  మా కుటుంబానికి ఆయన ఆత్మీయులు అన్నారు. అయితే రాజకీయంగా విభేదించాల్సిన పరిస్థితి నెలకొందని తిరిగి మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం  ఏర్పడిందని చెప్పారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం లక్ష్యంగా అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన  సహకారం తనకు ఎంతో అవసరమన్నారు .ముందు ముందు అన్ని విషయాలు చర్చించుకుని ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల సత్యనారాయణ, మల్ల రాజా, దాడి జగన్ ప్రభాకర్, విల్లూరి రాము, కాండ్రేగుల కృష్ణప్పారావు, బొడ్డపాటి రాజారావు , బొడ్డేడ శంకరరావు, కోటిపల్లి జేజి బాబు, పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గవరపాలెం సంతబైల సందడి వాతావరణం నెలకొంది అనకాపల్లి నియోజకవర్గంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

సిఫార్సు