మీ అందరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతున్నాయి..డేటా మొత్తం ఆన్ లైన్ చేయాలి..దానికి అమరావతి సెక్రటేరియట్ నుంచి అందరు అధికారులకు డబ్బు లు ఇవ్వా లి..ఒక్కో ఉద్యోగి రూ.10వేలు ఇస్తేనే వివరాలు పైకి వెళతాయి లేదంటే మీ ఇష్టం కాంట్రాక్టు ఉద్యోగిగానే ఉండిపోతారు..కట్ చేస్తే 98 మంది పారామెడికల్, ఇతర ఉద్యోగులు వారి సర్వీసులు రెగ్యురల్ చేసుకోవడానికి వారి వారి విభాగాలోని మినిస్టీరియల్ స్టాఫ్ కి అక్షరాలా రూ.10 కట్టారు.. ఇక ఇందులో ప్రధాన పత్రికల వారికిచ్చేది ఇచ్చే యండి..విషయం ఎక్కడా బయటకి పొక్కకూడదు.. సదరు పత్రికల్లో వస్తే ఇరుకున పడతాం.. డబ్బులు ఇచ్చిన విషయం బయటకు చెబితే ఇచ్చిన ఆర్డర్లు కూడా కేన్సిల్ చేస్తామని ముందుగా చెప్పి ఉంచారు..ఏదైనా మీడియాలో వస్తే..సర్వీసులు రెగ్యులర్ అయిన ఉద్యోగులే తిరగబడాలి..మీరే ఖండించాలి..ప్రెస్ మీట్లు పెట్టాలి.. ఈ నిబంధనలకు ఒప్పుకున్నవారే డబ్బులు కట్టాలనే నిబంధనలు కూడా ఉద్యోగులకి వెళ్లాయి. అంతే అనుకున్నట్టుగా జాబితా స్టేట్ సెక్రటేరియట్ కి వెళ్లిపోయాయి. ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. తంతు మొత్తం భారీ మొత్తం కావడంతో పంపకాల్లో తేడాలొచ్చి విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచే విషయం పొక్కేసింది. ఈ విషయం తెలుసుకున్న ‘ఈరోజు’ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జగదీశ్వర్రావు దృష్టికి విషయాన్ని తీసుకెళితే అబ్బే అలాంటిదేమీ లేదండీ అని మొదలు పెట్టి.. ఆర్డర్లు కోసం డబ్బులిచ్చిన వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులిస్తే తప్పా తానేమీ చేయలేనని..తానే స్వయంగా రెండు రోజులు పాటు కార్యాలయంలో రాత్రింబవళ్లు కష్టపడి మరీ ఆర్డర్లు జారీ చేశానని, ఎలాంటి లావాదేవీలు చేతు మారలేదని చెప్పారు..
ఇక్కడ ఒక విషయం రాష్ట్ర తాధికారులు, జిల్లా కలెక్టర్ కూడా గమనించాలి.. చాలా ఏళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతుందన్న ఆనందంతో ఉద్యోగులు ఉన్నారు. ఈ సంతోషంలో జిల్లా ఆరోగ్యశాఖలోని అధికారులు సిబ్బంది పెట్టిన కండిషన్ కి తలొగ్గి అడిగినంతా ఇస్తారా..? లేదంటే మేము డబ్బులివ్వలేమని కాంట్రాక్టు జాబ్ రెగ్యులర్ అవుతున్నా, కాకపోయినా పర్లేదని కాలదన్నుకుంటారా..? సరిగ్గా ఈ వీక్ పాయింట్ నే క్యాష్ చేసుకున్నారు విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖలోని అధికారులు, సిబ్బంది. ప్రభుత్వం నుంచి 98 మంది ఉద్యోగులకు సంబందించి డేటా వచ్చినపుడే షరతులతో కూడిన కలెక్షన్ మొదలు పెట్టారు. ముందుగా పేమెంట్లు చేసిన వారికి ఆర్డర్లు ఇచ్చి..ఇవ్వని వారికి మరో సరికొత్త కండిషన్లు కూడా పెట్టారట. ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందాన’..రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తే దానిని కూడా తమ కలెక్షన్ల కోసం వాడేసుకున్నారు ఇక్కడి అధికారులు. పైగా తాము సత్య హరిశ్చంద్ర వంశానికి చెందిన వారమని..ఉద్యోగులు, సిబ్బంది అంతా చాలా వృత్తి ధర్మరమే పరమావధిగా బావించి, మానవతా దృక్పదంతో సొంతడబ్బులు ఖర్చు చేసీ మరీ ఆర్డర్లు తయారు చేసి ఇచ్చామని వల్లెవేస్తున్నారు ఉమ్మడి విశాఖజిల్లా కార్యాలయ సిబ్బంది.
‘పిల్లి గుడ్డిదైతే..ఎలుక ఏదో ఎత్తి చూపించిందట’.. చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవడానికి, వసూళ్ల విషయం బయటకు వచ్చిందని దాచిపెట్టడానికి, ప్రధాన మీడియాలో ఈ విషయం వార్తలు రాకుండా మేనేజ్ చేసున్న అధికారులు.. తీరా విషయం బయటకు వచ్చేసరికి వైద్యఆరోగ్యశాఖలోని అక్రమ వసూళ్లపై ప్రశ్నించిన కొందరు మీడియాకి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.జగదీశ్వర్రావు దగ్గర నుంచి సంబంధిత విభాగాల సిబ్బంది కూడా మూకుమ్మడిగా ఒకే రకమైన వివరణ ఇచ్చారు. రెగ్యులర్ ఆర్డర్ల కోసం ఎవరైనా ఉద్యోగులు డబ్బులు ఇచ్చినట్టు నేరుగా తనకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే తాను చర్యలు తీసుకోగలనని, లేదంటే తానేమీ చేయలేనని చెప్పారు. ఉద్యోగులు వారి ఉద్యోగాల మీదకు వచ్చే విషయాన్ని ఎవరు మాత్రం ముందుకొచ్చి బయటపడి ఫిర్యాదులు చేస్తారని ప్రశ్నిస్తే..దానికి మమ్మల్ని ఏం చేయమంటారు అని బదులిచ్చారు. మీ దగ్గరకొచ్చి ఫిర్యాదు చేసిన వారిని ఎందుకు బహిరంగంగా విషయాన్ని బయటపెట్టారని టార్గెట్ చేసి, తరువాత ఇబ్బంది పెడతామని ముందుగానే హెచ్చరించారనే సమాచారం కూడా ఉందని చెప్పగా.. అలా ఎందుకు చేస్తామని..తమపై గిట్టని వారు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాట దాటవేశారు. నేనూ.. మా సిబ్బంది చాలా నీతి మంతులమని..అవసరం అయితే సొంతంగా ఖర్చు చేస్తాం తప్పా మరెవ్వరి వద్దా పైసా కూడా తీసుకొమని కూడా చెప్పుకొచ్చారు. సాధారణంగా ఉద్యోగాలు రెగ్యులర్ అయిన సమయంలో ఇలాంటి ప్రచారాలు బయటకి వస్తాయని..వాటిని మీడియా కూడా లైట్ తీసుకోవాలని సూచించడం కూడా విశేషం.
ప్రధాన పత్రికలు, ఛానళ్లకు రూ.2లక్షలు నజరారా..?!
విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన ఈ అక్రమ వసూళ్ల తంతు బయటకు రాకుండా ఉండేందుకు ప్రధాన పత్రికలు, టివి ఛానళ్ల ప్రతినిధులకు సుమారు రూ.2 లక్షల వరకూ ముట్టజెప్పినట్టు తెలిసింది. నొక్కిన మొత్తంలో కొంతమొత్తమెట్టి కొట్టడంతో డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏమీ జరగనట్టుగా ఉన్నారని సమాచారం. అడ్డగోలుగా వసూళ్లు చేసినా..జిల్లా అధికారి నుంచి సిబ్బంది వరకూ నిస్సుగ్గుగా చెబుతున్న సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదే కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగులైతే ఒక అడుగు ముందుకేసి మేము ఒక్కరమే అంతా తినేస్తున్నామా..మీడియాకిస్తున్నామా..జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఇస్తున్నామా..స్టేట్ సెక్రటేరియట్ పంపిస్తున్నామా..ఇంతా చేస్తే మాకు మిగిలేది ఎంత..? ఆ మాత్రం దానికే మీరు వార్తాలు రాసేస్తారా..ఏం ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖలుంటే ఒక్క జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో చేసిన వసూళ్లే కనిపించాయా..మిగిలిన ఏ డిపార్ట్ కనిపించ లేదా అంటూ తిరగబటం విశేషం. పక్కా ప్లాన్ అండ్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ తో మడతెట్టిన భారీ మామూళ్లుపై యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా అధికారులు కూడా లైట్ తీసుకున్నారు..విశాఖ జిల్లా వైద్యఆరోగ్యశాఖకు ఇదాంతా షరామామూలే..!?