రూ.3.15 కోట్లతో PMGSY పనులకు శంఖుస్థాపన


Ens Balu
3
ఆనందపురం
2020-09-29 18:55:45

విశాఖజిల్లా భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండలం చందక పంచాయితీ జగన్నాధ పురం రోడ్డు పనులకు మంగళవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాసరావు, ఎం.పి ఎం.వి.వి సత్యనారాయణ శంఖుస్థాపన చేశారు.  కేంద్ర నిధులు రూ.3.15 కోట్లతో PMGSY (ప్రధాన మంత్రి గ్రామీణ  సాధక యోజన) నిధులతో నిర్మించనున్న సుమారు 7 కి.మీ తారు రోడ్డు పనులు ఈ పథకం ద్వారా పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, చందక పంచాయితీ లో ఏడాదిల కాలంలో కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి రూ.5.16 కోట్లతో అభివృద్ధి చేసినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివ్రుద్ధికి కట్టుబడి వుందని అన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు వైఎస్సార్ జలకళ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎం.పి ఎం.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గంపా ఒక్కొక్క మండలానికి 100 సోలార్ ఎల్.ఈ.డి బల్బు లు కేటాయించామని చెప్పారు. అలాగే భీమిలి నియోజవర్గం ఎం.పి నిధులతో కేటాయించిన అభివృద్ధి పనులకు తమవంతు సహకారాన్ని ఎప్పుడు అందిస్తామని చెప్పారు.