ఆ అధికారి కన్నుపడితే టార్గెట్ చేసిన మహిళా ఉద్యోగిణిని కాటేయాల్సిందే..నయాన్నో..భయాన్నో ఏదోలా శారీరకంగా లొంగ దీసుకోవాలని సామవేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తాడు.. ఏదీ కుదరకపోతే శాఖాపరమైన విధానాలు ఎతుకుతాడు.. దానిని అడ్డం పెట్టుకొని బలవంతంగానైనా అనుభవించాలని చూస్తాడు..సరిగ్గా ఈ కామాంధుడి కంటిలో 27ఏళ్ల జూనియర్ అసిస్టెంట్ బలైపోబోయి తృటిలో తప్పించుకుంది.. ఉన్నతాధికారి లైంగిక వేధింపులు తట్టులేక పోలీసులను ఆశ్రయించి కీచక అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేసింది. ఈ తంతు అంతా జరిగింది త్వరలో పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖజిల్లాలోని మత్స్యశాఖ కార్యాలయంలో..ఆ కీచక అధికారి జాయింట్ డైరెక్టర్ లాల్ మహ్మద్.. ఉన్నతాధికారే తనను కాటేయాలని కక్షగట్టాడని బావించి..చాకచక్యంగా తప్పించుకొని బయపడి మహిళా సంఘాల సహకారంతో పోలీసులకి ఫిర్యాదు చేసి తప్పించుకోగలిగింది. ఈ కీచక ఉన్నతాధికారి లైంగిక వేదింపుల పర్వం ఒక్కసారి తెలుసుకుంటే...
లాల్ మహ్మద్ విశాఖజిల్లాలోని మత్స్యశాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈయన జిల్లాకి వచ్చేనాటికి ఇదే కార్యాలయంలో పనేచేసే 27ఏళ్ల మహిళా ఉద్యోగిణి ఆఫీస్ సబార్డినేట్ గా ఉండేది. సరిగ్గా కామాంధుడి కన్ను ఆ ఉద్యోగిణిపై పడింది..ఎలాగైలా లోబరుచుకోవాలని పథకం వేసి..మెల్లగా ఆమె సీనియారిటీ, పదోన్నతిని వాడుకొని ఆమెకు ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతిలో సహకరించాడు. పాపం ఆ మహిళా ఉద్యోగిణి..ఉన్నతాధికారి మానవతా దృక్పదంతో సహాయం చేశాడనుకొని చెప్పిన పని, చెప్పని పని అన్నీ చేస్తూ తల్లో నాలుకగా ఉండేది. అదే అదునుగా చేసుకున్న జెడి ఆమెను విధినిర్వహణలో ఉండగానే తన గదిలోకి చీటికీ మాటికి పిలిపించుకొని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం మొదలు పెట్టేవాడు. తనకి ఒంట్లో బాగాలేదని చెబితే ఏదీ..జ్వరం ఎంతుందో చూస్తానంటూ స్థనాలపై చేతులు వేయడం, మెడపై చేతులు వేయడం, వీపుకి చేతులు ఆనించడం వంటి రక రకాల చేష్టలు ప్రదర్శించేవాడు. ఒక్కోసారి తాను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని, ప్రమోషన్ డిమోషన్ చేస్తానని కూడా బెదిరంచేవాడు. దీనితో ఎలాగైనా తనను లోబరుచుకుని కాటేసేలా ఉన్నాడనుకుని భావించిన ఆద్యోగిణి ఎలాగోలా చాలా కాలం భరించిన ఆ ఉద్యోగిణి సహనం నశించిపోయి పోలీసులను ఆశ్రయించి.. తనను ఏవిధంగా లొంగదీసుకోవాలని చూస్తున్నాడో లిఖిత పూర్వకంగా సోమవారమే పోలీసుకు ఫిర్యాదు చేసి కార్యాలయానికి రావడం మానేసింది.
చిన్న కేసుతో తప్పించాలని పోలీసుల యత్నం..
విశాఖలో సంచలనంగా మారిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లైంగిక వేధింపుల కేసుని పోలీసులు నిర్వీర్యం చేయాలని చూసినా ఫలితం దక్కలేదు. బెదిరించాలని చూసినా దైర్యంగా నిలబడి మరీ ఉన్నతాధికారి, పోలీసులకు ఎదురెల్లింది ఆ మహిళా ఉద్యోగిణి. ప్రస్తుతం ఆమెకు మహిళా సంఘాల మద్దతు పెరిగింది. తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులు కూడా కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఉన్నతాధికారిగా వున్న తనను బయట పడేయాలని ఎన్ని ప్రయోగాలు చేసినా పాచికలు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఆపలేకపోయాయి. చిన్న సెక్షన్లతో నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని మహిళా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మహళా ఉద్యోగి పట్ల మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అఫీస్ కేబిన్ కు పిలిపించి ఆమెపై అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడితే మరీ చిన్న సెక్షన్లతో అతడిని తప్పించాలనే ప్రయత్నం సరైంది కాదని ఇందులో ఎంతటి వారు వచ్చినా సదరు అధికారికి శిక్ష పడేవరేకూ వదిలిపెట్టేది లేదని తెగేసి చెబుతున్నారు.
పరారీలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్
మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన జాయింట్ డైరెక్టర్ లాల్ మహ్మద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది. లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయినట్టు సమాచారం అందుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని పర్యటనలు చేయాల్సి ఉండగా వాటన్నింటినీ రద్దు చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం లాల్ మహ్మద్ కాకినాడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన పనిచేసే ప్రతీ చోట ఇదే తరహా లైగింక వేధిపులు మహిళా ఉద్యోగులు ఎదుర్కొన్నట్టు సమాచారం అందుతుంది. మత్స్యశాఖలో ఉన్నతాధికారిగా ఉన్న లాల్ మహ్మద్ లైంగిక వేధింపుల ఘటన సదరు మత్స్యశాఖ కమిషనర్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. ఆమె ఆదేశాలతో ఈయన విధులకు లాంగ్ లీవ్ పెట్టినట్టు చెబుతున్నారు. ఈరోజు 2టౌన్ పోలీసు స్టేషన్ లో విచారణ ఎదుర్కొన్న అనంతరం బెయిల్ కోసం వెళ్లిపోయినట్టు వార్తలొస్తున్నాయి. చూడాలి అత్యంత దారుణంగా వ్యవహరించిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ విషయంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది.