విశ్వవిఖ్యాత నగరంగా రూపాంతరం చెందుతున్న విశాఖ మహానగరంపై పనిగట్టుకొని విషం కక్కుతున్నారు.. ప్రశాతం వాతావరణాన్ని భయం గుప్పెట్లోకి నెట్టేస్తున్నారు.. చక్కటి సంస్క్రుతికి సున్నం రాసేస్తున్నారు.. ప్రైవేటు యూనివర్శిటీల వ్యాపారం కోసం ప్రభుత్వ యూనివర్శిటీల మనుగడ ప్రశ్నార్ధకమయ్యేలా దెయ్యం రంగు అంటగడు తున్నారు.. పథకం ప్రకారం పదవుల కోసం రాజకీయ రౌడీ ఇజం చేస్తున్నారు.. అభివృద్ధికి కలిసిరాని స్థానికేతరులు చిరస్థాయిగా విశాఖను ఏలడానికి అన్ని విధాలా ఖబ్జా చేస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ వీరిని ఏమీ చేయలేకపోతున్నాయి.. దేశంలోనే సిటీ ఆఫ డెస్టినీగా పేరొందిన విశాఖను నేడు అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకి కేంద్ర బిందువుని చేసేశారు.. ఉంటే విశాఖలోనే ఉండాలనుకునే ఆశలకు శాస్వత సమాధి కట్టేస్తున్నారు..ఇక విశాఖను తాకనిది ఒక్క టెర్రరిస్టులు మాత్రమే.. విశాల విశాఖను విచ్చిన్నం చేసేందుకు జరుగుతున్న భారీ కుట్ర ఇపుడు అన్ని రంగాల వారిని ఉలిక్కి పడేలా చేస్తున్న వైనంపై ఈరోజు ప్రత్యేక కథనం..!
విశాఖ సిటీ అంటే ఒకప్పుడు అందాలకు, చక్కటి వాతావరణానికి పెట్టింది పేరు. కానీ నేడు ఆ పేరు పోయి మర్డర్ సిటీ, రౌడీ సిటీ, డ్రగ్ సిటీ, పొలిటికల్ సిటీ అనే స్థాయికి వచ్చేసింది. దేశంలోనే ప్రముఖంగా వినిపించే విశాఖను పూర్తిగా కబ్జా చేసేందుకు స్థానికేతరులు విశాఖ తీరంలో లంగరేసుకు పాతుకుపోతున్నారు. వీరి వలన ఎన్నాళ్ల నుంచో కష్టపడుతున్న రాజకీయనాయకులకు పదువులు పోతుంటే..స్థానికులకు ఎప్పుడు ఎక్కడ ఏ మర్ఢర్ జరుగుతోందోననే భయం పట్టుకుంది. రాజకీయం కోసం రౌడీయిజం చేసి..చదువుల కిల్లా విశాఖజిల్లాలోని ప్రభుత్వ యూనివర్శిటీలకు సైతం దెయ్యం దెయ్యాల రంగు పులిమే వరకూ వచ్చింది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం పనిగట్టుకొని చేస్తున్న అరాచక మాఫియా వ్యాపారానికి విశాఖ మహానగరాన్ని కేరాఫ్ అడ్రస్ గా మార్చేలా చేసింది. వారి ప్రైవేటు యూనివర్శిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వ యూనివర్శిటీలపై బురద చల్లుతూ.. వారి రాజకీయ పదవుల కోసం స్థానికులను డబ్బుకట్టలతో పార్టీలను ప్రశన్నం చేసుకొని ఇక్కడే పాతుకు పోతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయ పదవులను వీరొచ్చిన తరువాత అది బహుళ వ్యాపారానికి లైసెన్స్ గా మార్చేశారు. కిడ్నాప్ లు, చోరీలు, గంజాయి, నేడు చివరకి డ్రగ్స్ దిగమతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. వీరి కబ్జా చర్యలతో విశాఖపై విషయం కక్కుతు వారు మాత్రం పక్కాగా పాతుకుపోతున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి తేడాగాళ్లకే రాజకీయపార్టీలు కూడా కొమ్ము కాస్తూ పిలిచి మరీ వారి పార్టీలో సీట్లిచ్చి పదవులు కట్టబెడుతున్నాయి. అధికార మదంతో, డబ్బు దర్పంతో, కుల అండతో విశాఖ కీర్తిని కకావికలం చేస్తున్నారు. వీరి ఆగడాలను అడ్డుకునే నాధుడే కరువయ్యాడు. అధికారం కోసం రాజకీయపార్టీలు ఆడుకున్న రాజకీయ క్రీడలో విశాఖను విచ్చిన్నం చేయడానికి తండోప తండాలు తరలి వచ్చేస్తున్న స్థానికేతరులు పదవులను అడ్డం పెట్టుకొని సువిశాల విశాఖను కకావికలం చేస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ కేంద్రంగా నగరాన్ని మార్చేయడానికి పన్నాగం వేసి అడ్డంగా దొరికిపోయారంటే ఏ స్థాయిలో నగరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఎత్తుగడ వేశారో ఒక్కసారి ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సి వుంది.
నాటి విశాఖ..నేడు రాష్ట్ర రాజధాని కాబోతుందని అంతా కలలు కని..ఉద్యోగాలపై ఆశలు పెంచుకుంటున్నవేళ..డ్రగ్ మాఫియా అడ్డాగా, గంజాయి, డ్రగ్స్ కేపిటల్ గా చిత్రీకరించి నాగరాభివృద్ధికి శాస్వత అడ్డుకట్ట వేస్తున్నారు. ఒకప్పుడు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చే కంపెనీలు, సంస్థలు నేటి తాజా డ్రగ్స్ మాఫియా చర్యలతో ఇక్కడి నుంచి బిచానా సర్దేసుకోవాలని నిర్ణయాయిని వచ్చాయి. త్వరలోనే ఇక్కడి ఐటి కంపెనీలు, కర్మాగారాలు భారీ స్థాయిలో తరలిపోవడానికి నేటి 25వేల కోట్ల డ్రగ్స్ డీల్ కారణం అయ్యిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో వారికి .. జిల్లా నుంచి రాష్ట్రం..రాష్ట్రం నుంచి దేశం..దేశం నుంచి అంతర్జాతీయంగా ఎంతటి నెట్వర్క్ ఉందో కూడా అర్ధం చేసుకోవచ్చు. డ్రగ్స్ డంప్ ను కనుగొనడంతో ఉలిక్కిపడిన విశాఖ వాసులు రానున్న రోజుల్లో నగరానికి టెర్రరిస్టులు కూడా వచ్చినా రావొచ్చునని భయాం దోళన చెందుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతున్న విశాఖలో నేడు డ్రగ్స్ కూడా అంతకంటే పెద్ద మొత్తంలో దిగుమతి అవుతున్నాయంటే స్థానిక యువత భవిష్యత్తు ఏంటోననే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కోట్లకు పడగలెత్తిన స్థానికేతరులు నగరంలో ఆస్తులను పెంచుకోవడంతోపాటు, వారి వికృత వ్యాపారానికి, యువతను నాశనం చేయడానికి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వ్యాపారానికి తెరలేపారంటేనే పరిస్థి చేదాటి పోయిందని తేలిపోయింది. ఇక విశాఖకు తరలి రావాలనుకుంటున్న కంపెనీల పరిస్థితి ఏంటి..? ఇదే పద్దతి కొనసాగితే స్థానికుల రాజకీయ భవిష్యత్తు ఏంటి..? అసలు విశాఖలో మనస్సాంతిగా జీవించగలమా..? ఉన్నత చదువుల కేంద్రం కాస్త..కరుడు గట్టిన డ్రగ్ డీల్ డెస్టినేషన్ గా మారిపోతే యువత పరిస్థితి ఏంటి..? స్థానికులు ఇక్కడ ఉండాలా..? లేదంటే నగరం విడిచి వెళ్లిపోవాలా..? ప్రస్తుతం సీబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో నేడో రేపో ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ) కూడా రంగ ప్రవేశం చేస్తుందని చెబుతున్నారు.
యువత కలల ఆశల విశాఖ..ప్రస్తుత చర్యలతో డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘ విద్రోహ చర్యలను నియంత్రించాల్సిన ఆవశ్యకత తక్షణం ఏర్పడింది. అంతేకాకుండా స్థానికేతరులకు పదవులు ఇస్తే..స్థానికుల మనుగడ ప్రశ్నార్ధకమవుతుందనే విషయాన్ని కూడా రాజకీయపార్టీలు ఆలోచించాలి. లేదంటే వారి ధనార్జన కోసం వేలమంది విద్యార్ధులను ఉన్నత చదువుల్లో తీర్చి దిద్దుతున్న ప్రభుత్వ యూనివర్శిటీలు మూసేసుకోవాల్సిన అత్యవసర దుస్తితి కూడా రావొచ్చు. ఇప్పటికే పలు ప్రైవేటు యూనివర్శిటీలు కన్ను విశాఖపై పడి ఉన్న ఆంధ్రయూనివర్శిటీ కూడా అంధకారంగా మారిపోయినా మారిపోతుంది..? విశాఖలో జరగుతున్న వికృత చర్యలను, వినాశ ఘట్టాలను, మనుగడ ప్రశ్నార్ధకం చేసే వ్యవహారాలను ఉన్నత విద్యావంతులు మూకుమ్మడిగా తిప్పికొట్టాల్సిన ఆవశ్యక త ఏర్పడింది. స్థానికులు స్థానికేతురలపై తిరగబడకపోతే..ఉన్న గూడు కూడా కబ్జా అయిపోయి, మనల్నే వలస పంపే చర్యలు ప్రారంభమూ కావొచ్చు..విశాఖపై విషం కక్కుతున్న చర్యలను ఉత్తరాంధ్ర ఉక్కుపాదంతో అణగదొక్కాల్సి సమయం ఆశన్నమైంది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్థానికుల బలం ఏంటో చూపించాలి.. లేదంటే మన మనుగడ స్థానికేతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. విశాల విశాఖ బోరున విలపిస్తుంది..తస్మాత్ జాగ్రత్త..!