స్వచ్చ సర్వేక్షణ్ పై దృష్టి పెట్టండి..


Ens Balu
4
జివిఎంసి మెయిన్ ఆఫీస్
2020-09-29 19:05:24

జివిఎంసి పరిధిలో  అన్ని వార్డులలో స్వచ్చ సర్వేక్షణ్ పై ప్రజారోగ్య సిబ్బంది దృష్టి సారించాలని అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆదేశించారు. మంగళవారం జివిఎం సి సమావేశం మందిరంలో సి.ఎం.ఓ.హెచ్., ఏ.ఎం.ఓ.హెచ్. లు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, 2021 నాటికి స్వచ్చ సర్వేక్షణ్ లక్ష్యంగా ఇప్పటి నుండే పనిచేయాలన్నారు. సచివాలయాలలో పెండింగు ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటరీ సెక్రటరీల సమన్వయంతో ప్రతీ వీధిని శుభ్రంగా ఉండేట్లు పని చేయించాలన్నారు. ప్రతీ ఇంటి నుండి తడి-పొడి చెత్త సేకరణతో పాటు తరలింపు ప్రక్రియపై శ్రద్ద చూపాలన్నారు. డస్ట్ బిన్ లు శుబ్రంగా ఉంచాలని, కొన్ని చోట్లు డస్ట్ బిన్ లు రిపేర్ అయినందున వాటిని వెంటనే గుర్తించి రిపేరు చేయించాలని ప్లాస్టిక్ డస్ట్ బిన్ లు మార్చాలని సంబందిత ఇంజినీరు అధికారులను ఆదేశించారు. కమర్షియల్, అపార్ట్మెంట్లలలో యూజర్ చార్జీలు వసూలు చేయాలన్నారు. కాలువలలో చెత్త పేరుకుపోకుండా చూడాలని పెద్ద కాలువలు ఉన్నచోటు ఇంజినీరింగ్ అధికారులతో కలసి పనిచేయాలని ఆదేశించారు. స్వచ్చ సర్వేక్షణ్ భాగంగా ఆన్ సైట్ కంపోస్టింగ్  10% లక్ష్యంగా ఉండేలా పనిచేయాలని ఆదేశించారు. నైట్ స్వీపింగ్ సరిగా జరగలేదని ప్రతీ రోజూ ఒక అధికారి పర్యవేక్షణలో నైట్ స్వీపింగ్ జరిగేటట్లు ఉండాలన్నారు. సెంటర్ డివైడర్లో మట్టి ఎక్కువుగా ఉన్నందున, వీటిని రోడ్డు స్వీపింగు మిషన్ తో క్లీనింగ్ చేయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా చూడాలని, నగరంలో ఉన్న దుఖాణాల నుండి ట్రేడ్ లైసెన్సు ఫీజులను నూరుకు నూరు శాతం   వసూలు చేయాలని కొత్త దుఖాణాలను పరిశీలించి ట్రేడ్ లైసెన్సులు తప్పని సరిగా విధించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఏ.ఎం.ఓ.హెచ్. లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు  తదితరులు పాల్గొన్నారు.