విశాఖలో ఎన్ని ‘కుల’ మీడియా బ్రోకర్లు..!


Ens Balu
238
vizag
2024-04-15 08:05:59

వాళ్లకి సిగ్గూ.. శరం.. చీమూ నెత్తురూ.. పరువు.. మర్యాద ఏమీ ఉండవు.. ఏ ప్రెస్ లోనూ, మీడియాలో లైవ్ లో ఉండరు.. రిపోర్టర్లుగా పనిచేయరు.. కానీ మీడియా మే నేజ్ మెం ట్ పేరుతో ప్రధాన పార్టీల దగ్గర కులం కార్డుతో చేరి.. ప్రధాన మీడియా సంస్థల్లో పనిచేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి ప్యాకేజీలను అడ్డంగా బొక్కుతారు.. మీడియా మేనేజ్ మెంట్ బ్రోకర్లుగా మారి అందర్నీ మేనేజ్ చేస్తుంటారు.. వాస్తవానికి సింగిల్ కాలమ్ వార్త రాయమన్నా.. యాంటీ వార్తలు రాయమన్నా.. పాజిటివ్ వార్తలు రాయమన్నా.. ఈరోజు మంగళవారమండీ(అసలు విషయం ఏంటంటే ఓ చిన్న వార్తరాయలంటే వీడికి ముచ్చెమటలు పడతాయి..రాయడం వస్తేనే కదా) మా ఇంటా వంటా లేదు.. మంగళవారం పూట ఆ తరహా వార్తలు రాయము అని చెబుతారు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల వద్ద..ఇదంతా నిజమే అనుకుంటారు ఆ వెర్రి పుష్ఫరాజులు.. కానీ పక్కోడితో రాయిస్తానని చెబుతారు.. పోనీలే నీకు మంగళవారం కదా.. ఏ బుధవారం గాడితోనైనా రాయించు.. లేదంటే మన కులపోళ్లతోనైనా రాయించు.. అవకాశం ఉంటే టీవీల్లో చూపించు.. దానికి అయితే ఒకే అంటాడు ఈ తేడా మీడియా బ్రోకర్.. నిజానికి రాజకీయపార్టీల నేతలకు కావాల్సింది కూడా అదే వారి కులపోళ్లైతే కాస్త వారి కోసం ఆలోచిస్తారనే గుడ్డి నమ్మకం.. ఈక్రమంలో వీడు ఏం గడ్డితిన్నా పర్లేదు.. మనకి పబ్లిసిటీ రావాలి..? నిజంగా పబ్లిసిటీ ఇచ్చేవాడు బలైపోయినా మనకి అనవసరం అంటారు.. అలా విశాఖలో మీడియా బ్రోకర్లను ప్రధాన రాజకీయపార్టీల నేతలే పెంచి పోషిస్తున్నారు. నిజంగా అభ్యర్ధుల కోసం పనిచేసే, రాసే జర్నలిస్టులను చూసే మనసున్న ప్రజాప్రతినిధులూ ఉన్న ఉమ్మడి విశాఖజిల్లాలోని ఎన్నికుల మీడియాపై ఈరోజు ప్రత్యేక కథనం..!

ఒక రాజకీయనేత కంటిలో పడాలంటే ఈరోజుల్లో ఏ మీడియా సంస్థలోనూ యాక్టివ్ గా పనిచేయాల్సిన పనిలేదు. ప్రధాన పత్రికలు, టివి ఛానళ్లు, లోకల్ కేబుల్ టీవలు, రాజకీయపార్టీ మీడియాలో పనిచేస్తున్నట్టు ఐడి కార్డు ఉంటే చాలు. అవే ప్రధాన రాజకీయపార్టీల నేతలకు ఐడెంటీ నువ్వు పలానా ఛానల్ కదా.. నువ్వు ఆ మీడియా కదా.. మీరు ఈ పేపర్ కదా అని వాళ్లే సంబోధిస్తారు. ఇక అవతలి మీడియా ప్రతినిధి వారి కులపోడే అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. ఎక్కడ పడితే అక్కడ తెగ నాకేసీ..గీకేసీ..గోకేసి..తోమేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే రాజకీయనేలందరూ ఈ తేడా మీడియాగాళ్లను గుర్తించాలంటే సరిగ్గా ఎన్నికలకు ఓ రెండు నెలల ముందు వీరందరికీ ప్రత్యేకంగా ఆఫీసులు ఓపెన్ చేస్తారు.. ఒక గదిలో టివి ఛానల్ సెటప్, మరో గదిలో పేపర్ పబ్లిసిటీ సెటప్, ఇంకో గదిలో పనిచేసే సిబ్బంది హడావిడి..ఓ మూడు నెలలకు అద్దెకు తెచ్చుకున్న కారు. రాజకీయనేతలు ఈ మీడియా బ్రోకర్ ని గుర్తించడానికి వీడి దగ్గరే ఇద్దరు అసిస్టెంట్లు.. సార్ వస్తున్నారంటూ వేరే లెవల్ బిల్డప్.. ఈ వ్యవహారం అంతా మామూలుగా ఉండుదు. ఇదంతా చూసిన ఆ ఆ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధి ఓహో వీడెవడో చాలా పెద్ద విలేఖరిలా ఉన్నాడు.. వీడిని పట్టుకుంటే ఈ ఎన్నికల్లో మనం పూర్తిస్థాయిలో ప్రచారం చక్కగా చేయించుకోవచ్చు. డబ్బులు పోయినా పర్లేదు. ఇలాంటి నెట్వర్క్, కాస్త గట్టివాడైతే చాలు అని వాళ్లంతట వాళ్లే నిర్ణయానికి వచ్చేసేలా నమ్మిస్తారు ఈ మీడియా బ్రోకర్లు. బొక్కబోర్లా పడి వారికే మీడియా మేనేజ్ మెంట్ అంతా అప్పగిస్తారు. అలా అప్పగించే సమయంలోనే నేతలు కూడా ఎంక్వైరీ చేస్తారు..పలానా రిపోర్టర్ కి ఏ కులపోడు అని..? అడిగేది పోటీలో ఉన్న అభ్యర్ధి కదా..వాడు వెంటనే మనకులపోడే సార్ అంటాడు. దానికి ఈ పొలిటికల్ కేండిడేట్ బుబ్బి తబ్బిబ్బు అయిపోయి...సరే అయితే మన మీడియా మేనేజ్ మెంట్ అంతా నువ్వే చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఉంటుంది అసలైన తేడా వ్యవహారం. వీడొక వాట్సప్ వాడి సొంత వాట్సప్ గ్రూపు పెడతాడు. అందులో వాడికి కావాల్సిన వాళ్లనే చేరుస్తాడు. మూడో కంటికి తెలియకుండా ప్యాకేజీలు మాట్లాడతాడు. అక్కడ కూడా కమిషన్లు తీసుకుంటాడు వాడు ప్రధాన మీడియా అయి ఉంటే చాలు. అందులో పనిచేస్తే చాలు. అంతే నిజంగా వాడు వీడు నియమించిన వాడికి పబ్లిసిటీ ఇస్తున్నాడా...మంచి వార్తలు రాస్తున్నాడా లేదా అనేది చూడు. ఈ క్రమంలోనే ఎవరైనా చక్కగా వార్తలు రాస్తే మాత్రం ఈ వార్త మనం రాసిందే.. నేనే కావాలని ఆ పేపర్ లో పెట్టించానని చెప్పి.  ఆ స్టోరీ క్లిప్పింగ్ సదరు ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిట్ కి చూపించి మరికొంత నొక్కేస్తాడు. ఇక్కడ టార్గెట్ మొత్తం అంతా కూడా 
నొక్కేయడంలోనూ.. మరికొందరైతే ప్రధాన ఛానళ్ల లోగోలు పెట్టించి వీడియోలు క్రియేట్‌ చేయించి మరీ అభ్యర్ధులను అత్యంత దారుణంగా మోసం చేస్తున్నారు. 

మరికొందరు సోషల్‌ మీడియాను కూడా అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో టార్గెట్‌ పెట్టుకున్న మొత్తాన్ని చక్కగా నొక్కేస్తున్నారు. వాస్తవానికి ప్రధాన ఛానళ్లలో వార్తలు ఈ మధ్య కాలంలో రావడం లేదు. కానీ వచ్చినట్టుగా నమ్మించేస్తున్నారీ తేడా మీడియా కేటుగాళ్లు. కాకపోతే ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో టార్గెట్‌ పెట్టుకున్న కూడా నొక్కేయడంలోనూ.. బొక్కేయడంలోనూ మాత్రమే చూపిస్తున్నారు. బొక్కేయడంలోనూ మాత్రమే వుంటుంది. వాస్తవానికి డబ్బులు పోతున్నా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు మాత్రం పబ్లిసిటీ రాదు. చివారఖురు.. మనం దెబ్బైపోయాం. మన కులపోడని పెట్టుకుంటే వాడు మనకి గొంతుకు వరకూ వచ్చేలే తోసేశాడని బాధపడతారు ప్రజాప్రతినిధులు. ఇక్కడ అప్పుడప్పుడూ వచ్చిన మంచి వార్తలు, పబ్లిసిటీ వార్తలు ఎవరివిరా అంటే చిన్న, మధ్య తరహా మీడియాలో వచ్చిన కథనాలు. వాటిని కూడా మేమే రాయించామని..మేమే చేయించామని చెప్పి మొత్తం ప్యాకేజీలను మడతెట్టేస్తారు ఈ తేడా మీడియా కేటుగాళ్లు. కానీ తమ అభ్యర్ధులు వచ్చినపుడు మాత్రం ప్రధాన మీడియాలో పనిచేసే వారందనికీ పనిగట్టుకొని మరీ పిలుస్తారు. అది మందు సిట్టింగలకు కావొచ్చు.. లంచ్ డిన్నర్ కి కావొచ్చు.. మనీ ప్యాకేజీలు ఇవ్వడానికి కావొచ్చు. ఇదే క్రమంలో మంచి వార్తలు రాసిన వారి పేర్లూ ఉంటాయి. కాకపోతే వారి పేరతో ఈ బ్రోకర్ గాడే మొత్తంగ మి(దె)ంగేస్తాడు. కాకపోతే ఎన్నికల సమయంలో ఇలా మీడియా బ్రోకరేజీ చేసేవారు నిజమైన జర్నలిస్టులా.. కాదా అనేది మాత్రం ఏ ప్రజాప్రతినిదీ చూడరు. వారికి కావాల్సింది పోటీలో విజయం, పతాక శీర్షిక పబ్లిసిటీ. కానీ ఏనాడూ ఈ తేడా మీడియా బ్రోకర్లని మాత్రం నిజమైన మీడియావారికి అన్యాయం చేయొద్దు..మోసం చేయొద్దు.. మనకోసం పనిచేసినవారిని మరిచిపోవద్దు అనే మాట మాత్రం మాట్లాడరు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇలాంటి పనులన్నీ చేసేది ప్రధాన మీడియాలో పనిచేసేవారు.. మరికొందరు ఆ ప్రధాన మీడియాలో పనిచేసి మానేసిన వారు.. మరికొందరు వాటి పేరు చెప్పుకొని వారి కుల నేతల వద్ద బతికేసేవారు. అయితే ఇక్కడ నిజమైన ప్రజాప్రతినిధి అయితే ఒక్కప్రశ్న వేయాలి..నువ్వు ఆ టివి ఛానల్ లో పనిచేస్తు న్నావు..? నీ ఉద్యోగం కాకుండా ఈ బ్రోకరేజీ చేయగలవా..? అందరికీ (అ)న్యాయం చేయగలవా అని అడగాలి. కానీ రాజకీయనేతలు గుడ్డిగా చూసేది వాడేమీడియాలో పనిచేస్తున్నాడు.. మనకులపోడా కాదా..? వాడికి మిగిలిన మీడియాతో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అని.. కుక్కతోక వంకర పోదు.. రాజకీయనేతల ఆలోచనల్లో మార్పు రాదు.. తేడా మీడియాగాళ్లు ఒకడ్ని కొట్టి వారే బొక్కేయడమూ మానరు. కాకపోతే ఇలా జరుగుతుందనే విషయం ఒకరో ఇద్దరో మంచిగా ఆలోచించే ప్రజాప్రతి నిధుల వద్దకైనా వెళుతుందనే ఈ చిన్న ప్రత్యేక కథనం ఉద్దేశ్యం. ఈ వార్త మొత్తం చదివిన తరువాత..వార్నీ ఈ బాలు గాడు ఇండరైక్టుగా నాకోసమే రాశాడని.. తెగఫీలపైపోయి. ఫూలైపోయి.. గుక్కెట్టి ఏడ్చేసినా ఈ దేశానికి వచ్చిన నష్టం లేదే. ఇలాంటి తేడాగాళ్లను మీడియా బ్రోకర్లుగా పెట్టుకున్న వారికీ పోయేదీ ఏమీ ఉండదు. కాకపోతే నిజమైన జర్నలిస్టులు, మీడియాపై ఆధారపడి బ్రతికే చిన్న, స్థానిక, మద్యతరహా పత్రికల నిర్వాహకులు అధికారులు, ప్రజలు అర్ధం చేసుకుంటే అదే చాలు.. వాస్త వానికి ఈ వార్తలు రాసే సమయానికి తేడా మీడియా బ్రోకర్లు, వారి సంస్థలు, సదరు ప్రజాప్రతినిధు పేర్లూ పెట్టొచ్చు..ఎవడో ఏదో గడ్డి తిన్నాడని ఈ స్టోరీ రాసే నేనూ అలోచించడంలో అర్ధం లేదు.. మీడియాని బ్రతికించాలంటే నిజమైన మనసున్న ప్రజాప్రతినిధుల వల్లనే అవుతుంది. నిజంగా మీకోసం ప్రచారం చేసేవారికి, మీకోసం పనిచేసేవారికి న్యాయం చేయండి. అందరిపేరుతో ఒక్కడే బొక్కేసే తేడా మీడియా బ్రోకర్ గాళ్లను నమ్మకండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నిజంగా పనిచేసే జర్నలిస్టు మాత్రమే మీకోసం రాస్తాడు..మిగిలినవాళ్లంతా మీ దగ్గర మేస్తారు..ఈ అక్షరాలన్నీ ప్రజా ప్రతినిధులను ఆలోచింపజేయడానికే..వాస్తం వర్ధిల్లాలి..నిజమైన జర్నలిస్టుకి గుర్తింపు రావాలి..అక్షరం జర్నలిస్టుకి అన్నం పెట్టాలి..జై జర్నలిజం..జై జై జర్నలిం..!