అనకాపల్లిలో నేల టిక్కెట్టు రాజకీయాలు మొదలయ్యాయి.. అదీ ఎంతలా అంటే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం మీడియాను కూడా మరీ చులకన చేసి ముష్టివేసి.. అడ్డదారిలో పేరు ప్రతిష్టలు పొందేసి.. ఆపైన గెలిచేసి డైరెక్టుగా అనకాపల్లి నుంచి డైరెక్టుగా ఢిల్లీ పార్లమెంటుకి వెళ్లిపోదామనుకుంటున్నారు నేతలు. ఏంటి ఇదేదో కాస్త తేడా ఉంది కదూ అనుకుంటున్నారా..? ఎస్ పక్కా తేడా..! ఒక పార్టీ నాయకుడు చేసిన చవకబారు పని ఏకంగా ఆ వ్యక్తి పేరునే మార్చేసేలా చేసింది. కాదు కాదు ఆ విధంగా మీడియావాళ్లూ, ఆ పార్టీలోని వారే ఆ నేతకు ఆ పేరు పెట్టేశారు.. నేల టిక్కెట్టుగాడు అని..! అసలు విషయం తెలుసుకుంటే మరీ రంజుగా వుంటుంది. మీరూ చదివేసేయండి మరి..! అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచేయాలని తెగ బిల్డప్పులిచ్చేసిన ఒక రాజకీయపార్టీ నేత అనాకపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. దానికంటే ముందు అసలు జిల్లాలో ఎంతమంది విలేఖరులున్నారు.. ఎన్ని పేపర్లు ఉన్నాయి.. మరెన్ని ఛానళ్లు ఉన్నాయి.. ఇంకెన్ని కేబుల్ టీవి నెట్వర్కులున్నాయి..? ఎన్ని నియోజకవర్గాలున్నాయి..? జిల్లా కేంద్రంలో ఎంతమంది పనిచేస్తున్నారు..? లిస్టులిస్తే వారందరికీ మంచి ప్యాకేజీలిచ్చి ప్రజల్లోకి వెళదామని ముఖ్య కార్యకర్తలు,
మీడియా మేనేజ్ మెంట్ చేసే వారి వద్ద బాహాటం ప్రకటించారు. దానితో కేడర్ మొత్తం ఉబ్బి తబ్బిబై పోయి. మా సార్ అంటే మామూలు వ్యక్తి కాదు.. మేము ముందే అనుకున్నాం. ఎంతమందినైనా సింగిల్ గా మడతెట్టేస్తారని.. ఇక పార్టీకి, నాయకులకూ మంచి రోజులు వచ్చినట్టేనని, మీడియాకే అంత గౌరవం ఇస్తే.. ఇక నాయకులు, కేడర్ గా ఇంత విలువనిస్తారో.. అనుకొని వెంటనే మీడియాకి కబురు పెట్టేశారు. ఏమనీయ అంటే.. అనకాపల్లిలోని మీడియాలో పనిచేసేవా రు, యూని యన్లు, లీడర్లు అందరివి లిస్టులు ఇమ్మన్నారని..వెంటనే పెట్టేస్తే మీటింగ్ కూడా అంతే వేగంగా ఏర్పాటు చేసేస్తామన్నారు మా సారు అన్నాడు మధ్య వర్తి.. దానితో నిజంగానే కనీసం కొద్దో గొప్పో ప్యాకేజీ ఇస్తారు.. మనం కూడా బాగా పబ్లిసిటీ చేయడంతోపాటు, మన కుటుంబాల ఓట్లు కూడా ఆయనకే గుద్దించేద్దామనుకొని పేర్లు, వివరాలతో కూడిన లిస్టులు ఇచ్చేశారు పనిచేసే విలేఖరులు, పనిచేయని విలేఖరులు, ప్రెస్ ఐడెంటిటీ కార్డుతో యాక్టింగ్ చేసేవారూ వగైరాలంతా.. పైగా మీడియా అని చెప్పి తిరిగే వారంతా టిప్పుటాపుగా రెడీ అయి అంతటి ఎండలోనూ సెంటుకొట్టుని మరీ వెళ్లిపోయారు.
తీరా అక్కడికి వెళ్లిన తరువాత..విలేఖరులందరూ వరుసలో రండి..మీ నెంబర్లు పిలుస్తారు వచ్చి తీసుకోండని ముందుగా ప్రకటించారు అక్కడి సమావేశానికి నిర్వాహ కులు. ఎన్నికలంటే మీడియాకి పండగ, అప్పుడే కొద్దో గొప్పో ఆదాయం వస్తుంది. వారు పనిచేసే సంస్థకి ఆదాయం తెచ్చిపెడితే వారికీ గౌరవం దక్కుతుందని తెగ ఆనంద పడిపోయారు. అందరితోనూ పిచ్చాపాటిగా మాట్లాడేసి.. మనోళ్లు ఇస్తారు తీసేసుకోండని చెప్పి ఆ నాయకుడు సమావేశం నుంచి వెళ్లిపోయారు. తరువాత కవర్లలో పెట్టిన ప్యాకేజీలు మొత్తం ఇచ్చేయాలి కదా.. అందరినీ లైన్లో రమ్మన్నారు..ఒక్కొక్కరికీ ఒక్కో కవరు చేతిలో పెట్టారు. తీరా అందులో చూస్తే.. రూ.500 నోటు. అదీ ఆ బడానేత మీడియాకి ఇచ్చిన పబ్లిసిటీ ప్యాకేజీ. సాధారణ ఓటరుకి ఎన్నికల సమయంలో ఇచ్చే డబ్బులకంటే నాలుగోవంతు. అంటే మీడియాని ఎంత చులకన చేశారో అర్ధమైందా. ఆ మాత్రం దానికి ఆ రాజకీయ నాయకుడు జిల్లాకి వచ్చే సమయంలో ఇదే మీడియా, విలేఖరులంతా ఆహా.. ఓహో.. ఆయనొస్తే ఆకాశానికి.. కన్నం.. భూమికి బొక్క పడిపోద్ది.. ఆయనకి ఎవరూ ఎదురెళ్లలేరు. అంటూ తెగ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేశారు. ఏదేదో ఊహించుకుని. కానీ తీరా మీడియా ప్యాకేజీలిస్తామని చెప్పి రూ.500 నోటు చేతిలో పెట్టేసరికి వెళ్లిన వారందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి పోయింది. కాస్తో కూస్తూ విలువలకు కట్టుబడే జర్నలిస్టులు మాత్రం ఆనోటుని తిరస్కరించారు. మిగిలిన వారు పెట్రోలు ఖర్చుల కైనా వస్తాయని చెప్పి మడతెట్టి జేబులోపెట్టుకొని బయటకు వస్తూనే.. సరైన నేల టిక్కెట్టు నాయకుడు అనకాపల్లికి వచ్చారంటూ కామెంట్లు చేయడంతో..సార్ ఏమీ అనుకోవద్దు..మేమూ అలాగే అనుకున్నాం మా తొక్కలో సారు ఇలా ఈ విధంగా ఇంత చండాలంగా.. చవకబారుగా వ్యవహరిస్తారని అనుకోలేదంటూ చోటా నాయకులు కూడా సిగ్గుతో లోనికి వెళ్లిపోయారు.
మీడియా అంటే మీడియానే కదా.. బయటకొచ్చిన వీరంతా అసలైన పబ్లిసిటీ మొదలెట్టారు.. ఇద్దరికే చెప్పడం ప్రారంభించారు.. ఒకటి అడగని వారికి..రెండు అడిగిన వారికి.. అంటే దీనర్ధం ఏంటో మీకు ఈపాటికే తెలిసిపోయే వుంటుంది. జరిగిందా చెబుతూ..సరైన నేలటిక్కెట్టు నేత ప్రెస్ మీట్ కి వెళ్లాం.. వాడిచ్చిన ప్యాకేజీ తీసుకున్న తరువాత ఏం చేసుకోవాలో అర్ధం కాలేదంటూ ప్రచారం మొదలెట్టారు. అది కాస్తా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పాకింది. ఓహో ఆ నేత కోసమేనేంటి మీరంతా ఆహా ఓహో అని తెగ రాసేశారు. ఇప్పుడు తెలిసిందనుకుంటా..మీకు వాడు మీకంటే తేడాగాడని.. సిసలైన నేల టిక్కెట్టుగాడని.. విషయం తెలుసుకున్న వారంతా కామెంట్లు చేయడం ఉమ్మడి విశాఖజిల్లా అంతా దావానంలా పాకుతోంది. అయినా ఏమైనా అంటే ఇలాంటి నేల టిక్కెట్టు నేతలు ఓ.. తెగ ఫీలైపోతారు గానీ.. మీడియాని పిలిచినపుడు ఆర్ధిక పరిస్థితి బాగుంటే ప్యాకేజీలు ఇవ్వాలి.. లేదంటే చక్కగా భోజనం పెట్టి పంపేయాలి.. ఇంకా ఏదైనా గౌరవం చేయాలంటే ఏ బహుతిలాంటిదో ఇవ్వాలి కానీ.. మరీ దారుణంగా కాస్ట్లీ బెగ్గర్ కి ముష్టి వేసినట్టు ఇలా రూ.500 నోటు చేతిలో పెట్టి ఇదే మీ ప్యాకేజీ అని చెప్పి వెళ్లిపోమనడం దేనికి సంకేతమో ఈ వ్యవహారం చదివిన తరువాత ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. వాస్తవానికి ఆ నేత ఎవరో మేము పేరు రాసేయొచ్చు. కానీ నేలటిక్కెట్టు రాజకీయాలు చేసేవారి పేర్లు రాసి మేమూ దిగజార కూడదని మాత్రమే రాయలేదు. మీడియా ఎప్పుడూ ఏ నాయకుడూ చులకనా చూడకూడదు..మీడియా కూడా ఏ నేత దగ్గరరా ఒంగి ఒంగి దండాలు
పెట్టకూడదు..జై జర్నలిజం.. జై జై జర్నలిజం..!