జర్నలిస్టులా వాళ్లెక్కడున్నారు వైజాగ్ లో..!? మహా అయితే ఐదో పదో మంది ఉంటారు.. నిజంగా పనిచేసే జర్నలిస్టులు..? మిగిలిన వారంతా కులపిస్టులే కదా.. అవును మీరు విన్నది..చదువున్న ఈ స్టోరీ కూడా నిజమే.. అధికారపార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీలోని మాజీ మంత్రి దగ్గరకు ఎలక్షన్ ప్యాకేజీ కోసం వెళ్లినపుడు ఈరోజుకి ఎదురైన వింత అనుభం ఇది. మాకూ ఉన్నారండి కులపిస్టులు..ఛీ ఛీ జర్నలిస్టులు.. ఆ పదం వాడి వాడి అలవాటైపోనాది.. అదేంటి ఇదేదో తేడా లేదూ..పక్కా తేడాగానే అనిపిం చింది మాకు కూడా. మా కులపోళ్లే చాలా మంది ఉన్నారండీ..వాళ్లకే ప్యాకేజీలు సరిపెట్టలేకపోతున్నాం.. ఇక బయట జర్నలిస్టులు, మీడియా సంస్థలకు ఏమివ్వగలం.. అందులోనూ మా కులపోళ్ల మీడియా, పార్టీ మీడియా అంటే ఏ సమయంలోనైనా సపోర్టు చేస్తారు.. మిగిలినవారంతా వాళ్లకిష్టం ఉంటేనే చేస్తారు లేదంటే లేదు. అలాంట పుడు మా కులపిస్టులను మేము బాగా చూసుకుంటే..వాళ్లు మమ్మల్ని బాగా చూపిస్తారు.. మాకోసం మరింత బాగా రాస్తారు.. ఏదో మీరంటే మాకు బాగా పరిచియం అని మాత్రమే వాస్తవం మాట్లాడాను.. అలాగని మీకేం అన్యాయం చేయను లేండి..మీరు అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత ఇచ్చే ఏర్పాటు చేస్తాను.. కానీ మీరేమను కున్నా మా కులపోళ్లు మా కులపోళ్లే..అయినా సిటీలో కూడా మా కులపోళ్లే ఎక్కువగా ఉన్నారట కదూ.. అని కట్ చేశారా ఇద్దరు ప్రజాప్రతినిధులు. ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్ధం కాని పరిస్థితి అయిపోయింది. ఆ ఇద్దరి దగ్గరకు వెళ్లినపు కూడా. ఎన్నికల ప్యాకేజీ మాట దేవుడెరుగు.. ఇలాంటి వాళ్ల దగ్గరకెళ్లి ప్యాకేజీలు తీసుకుంటే నన్నూ అలాగే అంటకాగిస్తారని చెప్పి..మీ అభిమానానికి చాలా తేంక్స్ అండీ.. మీ ప్యాకేజీ ముఖ్యం కాదు మీరు మాకు ముఖ్యమని అక్కడి నుంచి బయటకు వచ్చే స్తుంటే.. మొదట రాసిన మాటలు వినిపించాయి..ఐదో పదో మంది జర్నలిస్టులన్నారనే మాట.. అపుడు అనిపించింది నిజంగానే జర్నలిస్టులు కాస్తా కులపిస్టులు అయి పోయారని..?!
అవువు విశాఖలో కులపిస్టులు(పేరుకి జర్నలిస్టులు) రాజ్యమేలుతున్నారు. అందునా చాలా మంది ఇలాంటి వారికి ప్రజాప్రతినిధులు కూడా పక్కగా సపోర్టు చేయడంతో నిజమైన జర్నలిస్టులు, బ్యాలెన్స్ గా ఉన్న మీడియా సంస్థలు మనుగడ సాధించలేకపోతున్నాయి. ఆవిషయం 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాస్తో కూస్తో ఆదాయం వస్తుందనుకొని న్యూస్, యాడ్స్ ప్యాకేజీల కోసం తిరిగినపుడు మాకు చాలా స్పష్టంగా అర్ధమైంది. పలానా ఛానల్ మా కులపోళ్లదే.. ఈ పేపర్ లో మన కులపిస్టే పనిచేస్తు న్నాడు.. అదిగో ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మనకులపోళ్లే కమర్షియల్ గా స్టార్ట్ చేశారు. మనంవాళ్లని చూసుకుంటే చాలు మిగిలిన వారందిరికీ ఏదో సాకు చెప్పి పంపేయవచ్చు అనే దీమా వచ్చేసింది. ప్రజాప్రతినిధులే కాదు వాళ్ల దగ్గర పనిచేసే పీఏలు, మేనేజర్లు కూడా వాళ్ల కులపోళ్లే ఉండటం, జర్నలిస్టులను, జర్నలి స్టులగా కాకుండా కులపిస్టులుగా చూస్తూ వారి స్వరూపాన్నే మార్చేయడం కొత్త పోడకలకు తావిస్తున్నది. వాడు పనిచేసే ఛానల్ ఏ కేబుల్ నెట్వర్క్ లో ప్రశారం అవుతుందో తెలీదు..? వీడు వీడి కులప నాయకుడి దగ్గర తీసుకున్న వాయిస్ బైట్ ఏ అర్ధరాత్రి ప్రసారం అవుతుందో అంతకంటే తెలీదు.. కానీ తెల్లవారేపాటికి సదరు కులపోళ్ల ఛానల్ లోగోతో వీడియో క్లిప్పింగ్ మాత్రం కులప నేతల వాట్సప్ కి వెళుతుంది. అంతే వెంటనే చూశారా మా కులపిస్టు మనకిచ్చిన పబ్లిసిటీ అంటూ ఆ కులప ప్రజాప్రతినిధి తెగ ఫీలపైపోయి ఆకలని కూడా మరిచిపోయినంతగా ఆనంద పడిపోతాడు.
ఇంతకీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే మా కులపిస్టు అనుకున్న జర్నలిస్టు వాడి ఛానల్ లో ప్రసారం కాని వీడియోని బయట ఎడిటింగ్ చేయించి సదరు ప్రజాప్రతినిధి, వాళ్ల కులప నాయకులను బొక్కబోర్లా పడేలా మోసం చేయగలుగుతున్నాడు. అయినా కూడా తినే అన్నం కంటే.. వచ్చిన పేరుకంటే.. ప్రస్తుతం ఉన్న స్థానం కంటే కులాభిమానికే విలువనిచ్చే సదరు ప్రజాప్రతినిధి దీనినే నిజమని నమ్మేస్తున్నాడు. అందరినీ నమ్మిస్తున్నాడు. అలాగనీ అందరు కులపిస్టులు బయట వీడియో ఎడిటింగ్ చేయించనవే ఉండవు లేండి అప్పడప్పుడు సదరు కులప ఛానల్స్ లో వార్తల్లో కూడా వస్తుంటాయి. అందువలన వీరు చేసే మోసాలు వారికి అర్ధం కావం లేదు. ఇదంతా ఎప్పనుంచో నడుస్తుంది కదా.. మళ్లీ ఇప్పుడు మీకెందుకు గుర్తొచ్చింది..మళ్లీ ఎందుకు ఈ స్టోరీ రూపంలో రాస్తున్నారూ..? అంటే.. అదే కులపిస్టులు చేస్తున్న మోసాన్ని అదే కులప నేతలు ఆ ఇద్దరికే చెప్పి..(ఒకటి అడిగిన వారికి..రెండూ అడగని వారికి) గొల్లుమంటున్నారు. అయినా వెధవది కులాభిమానం అడ్డొచ్చి మళ్లీ వీరినే నమ్ము తున్నారు.. గొర్రె కసాయివాడిని నమ్మినట్టుగా.. ఇక్కడ ఏ జర్నలిస్టునూ, కులపిసిస్టునూ, శంఖించడానికో, వాళ్ల తెరవెనుక వ్యాపారాన్ని అడ్డుకోవడానికో, పేరు పెద్ద ఛానల్, పేపర్ అయినా వీరంతా వేసే వేషాలను, ఇతర కులపోళ్లు వీళ్లని చూసి సిగ్గుతెచ్చుకోనందుకో ఈ స్టోరీ రాయడం లేదు..? విషయం అందరికీ తెలుస్తుందని మాత్రమే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం.
జరుగుతున్న, చేస్తున్న, చేపడుతున్న, ఆర్ధిక లాభం పొందుతున్న కులపిస్టుల సంగతి మేమూ ఆ ఇద్దరికే..(ఒకటి అడిగిన వారికి..రెండూ అడగని వారికి) చెప్పాలని చిన్న తాపత్రయం. ఇదంతా ఎపుడో ఉంది మీకు ఇపుడే తెలిసినట్టుంది అనుకున్నవారు లైట్ తీసుకోవచ్చు. కానీ జర్నలిస్టుని జర్నలిస్టుగానే చూడాలని, బ్రోకర్ ను బ్రోకర్ గానే చూడాలని, కులపిస్టుని కులపిస్టుగానే చూడాలని, కానీ ఎవరైనా మీకు పనిచేస్తేనే మీరు విలువ ఇవ్వాలని, మరొకడి పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తే మీ కులపోడైనా పక్కనపెట్టాని తెలియజేయడానికి, ఆ సూచన చేయడానికి మాత్రమే ఈ స్టోరీ మళ్లీ మీ ముందుకి తీసుకు రావాల్సి వచ్చింది. అందరు జర్నలిస్టులు కులపోళ్లు అయి పోరు.. అందరు కులపోళ్లు జర్నలిస్టులు అయిపోరు.. కానీ కులప రాజకీయనేతలు మాత్రం వారి కులపోళ్లనే చూస్తారు.. కనీసం ఇతర కులపోళ్లైనా.. ఈ కులప రాజకీ యాన్ని వంటపట్టించుకుంటే.. అన్ని కులాల్లోని, సామాజికవర్గాల్లోని మీడియా సంస్థలు, కులపిస్టులు బాగు పడటానికి అవకాశం వుంటుందనేది గుర్తెరగాలని మాత్రం ఖచ్చితంగా సూచించాల్సిన సమయం వచ్చిందని చెప్పగలం. జై మన కులపోడు..జై జై మనకులపిస్టులు.. కాదు కాదు నిజమైన జర్నలిస్టుకి జై.. వాస్తవం కాని కుల పిస్టుకి నై జై.. ఈ విషయాన్ని నిజంగా పనిచేసే జర్నలిస్టులు అర్ధం చేసుకుంటే చాలు.. జర్నలిజం వర్ధిల్లాలి.. కులపిజం నశించాలి..!