కుష్టువ్యాధి నియంత్రణ అందరి బాధ్యత..


Ens Balu
2
Tirupati
2020-09-29 19:16:40

తిరుపతిలో అక్టోబర్ 1 నుండి 14 వరకు జాతీయా కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా లెప్రసి  కేస్ డిడక్షన్ కాంపైన్ ఇంటింటి సర్వే ఆరోగ్య కార్యకర్తలు చేపట్టను న్నారని  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ. డా. అరుణ సులోచన దేవి అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక రుయా ఆసుపత్రి ఆవరణలో తన చాంబర్ నందు ఎ పి ఎం లు, డిపిఎం లు , వైద్య సిబ్బంది తో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా అరుణ ఆలోచనా దేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  కుష్టు  వ్యాధి లక్షణాలు గల వ్యక్తులను గురించాలని  ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారని తెలిపారు. మైక్రో బాకెటీరియం లెప్రే వలన వ్యాధి సోకే ప్రమాదం ఉందని అందుకే ఈ నెల 1 నుండి 14 వరకు చేపట్టే సర్వేలో వైద్య సిబ్బందికి సహకరించాలని అన్నారు. స్పర్శలేని మఛ్చలు, చర్మం మందం, కనుబొమ్మలు రాలిపోవడం , చేతి వేళ్ళు వంకరకావడం, కనురెప్ప లు మూతపడక పోవడం వంటి లక్షణాలు ఉంటే ఇంటింటి సర్వే లో తెలియజేయాలని, వైద్యులు వ్యాధి నిర్దారణ చేసిన పిదప లక్షణాలు ఉంటే వైద్యసిబ్బంది ప్రతి నెల ఇంటివద్దకే వచ్చి మందులు అందిస్తారని, వైద్య సేవలు, మందులు పూర్తిగా ఉచితం అని తెలిపారు. అనంతరం వ్యాది నిర్దారణ పోస్టర్ లను, కరపత్రాలను విడుదల చేసి ప్రతి ఇంటికి అందేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో డా.పెరోల్ యాదవ్, డా.రవికుమార్, లెప్రసి ఎరాడికేషన్ డి.పి.ఎం.లు, ఎ. పి.ఎం.లు పాల్గొన్నారు.