విశాఖలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలను పరిరక్షించండి


Ens Balu
21
visakhapatnam
2024-08-04 17:51:50

విశాఖలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలను పరిరక్షించాలని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు ప్రభుత్వాన్ని కోరారు. విచక్షణా రహితంగా వందల అడుగుల బోర్లు తవ్వేయడం వలన ముడసర్లోవ లాంటి జలాశయాల్లోని భూమి అడుగుపొరల జలాలు కూడా ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరిలోవ, ముడసర్లోవ లాంటి ప్రాంతాల్లో వందల వేల అడుగుల బోరు బావులు తవ్వేడయం వలన నీటి జలలు ఆరిపోతున్నాయన్నారు. భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోకుండా ఉండేందుకు వీలుగా ఇంకుడు గుంతల ద్వారా భూమి అడుగు పొరలజీవాలన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. జలాశయం లాంటి ప్రాంతాల్లో కూడా నీరు భూమిలోకి ఇంకిపోవడం వలన విశాఖ నగరంలోని కొన్ని సందర్భాల్లో ప్రతీరోజూ కుళాయి నీరు విడుదల చేయలేని పరిస్థితులు కూడా వస్తున్నాయన్నారు. దానికోసం ప్రభుత్వం పరిమితి తాటి తవ్విన బోరుబావులను నియంత్రించాలన్నారు. అదే సమయంలో ఆసుపత్రులు, కమర్షియల్ కాంప్లెక్సులు, ప్రతీ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాలకు మళ్లీ తిరిగి జీవం వస్తుందన్నారు. మురగునీరు పారే డ్రైనేజీలు కూడా కాంక్రీట్ ప్లాస్టింగ్ చేయడం వలన మురుగు నీరు సైతం భూమిలోకి ఇంకే పరిస్థితి లేదని.. నేరుగా సముద్రంలోనే కలిసి సముద్ర జలాలు కూడా కలుషితం అవుతున్నాయన్నారు. జలాశయాల ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు చెట్టుకు కూడా పెద్ద సంఖ్యలో నాటాల్సిన అత్యవసర పరిస్థితి విశాఖలో వచ్చిందన్నారు. దానికోసం జీవిఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టుద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోతున్న పరిస్థితిపై ప్రజల్లో చైతన్యంతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ముడసర్లోవ జలశయానికి పూర్వ వైభవం తీసుకురావాలని, కుదించుకోపోయిన జలాశయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నిత్యం నీటితో కలకళలాడేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అందులో పేరుకు పోయిన పూడికను తొలగించాలన్నారు. అక్కడ పార్కులను అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మొక్కలను నాటి తద్వారా శివారు ప్రాంతాలను కాలష్యం నుంచి కాపాలడాలని కోరారు.

-పరిమితికి మించి తవ్విన బోర్లను నియంత్రించాలి
విశాఖమహానగరానికి నీరు ద్వారా అతి పెద్ద నష్టం ఏర్పడబోతుందని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో చాలా చోట్ల పరిమితికి మించిన లోతుగా బోరుబావులు తవ్వేయడం వలన భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోతున్నాయన్నారు. ప్రభుత్వం, జివిఎంసీ ముందు వాటిని నియంత్రించాలన్నారు. ఇంకుడు గుంతలు ప్రతీ ఇంటి దగ్గర, అపార్ట్ మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్, పెద్ద పెద్ద భవనాల వద్ద ఖచ్చితంగా ఏర్పాటు చేయడం ద్వారా భూమి అడుగు భాగంలో ఉన్న జల ఇంకిపోకుండా జీవంతో వుంటుందన్నారు. విశాఖలో గనుక పూర్తిగా భూగర్భ జాలాలు ఇంకిపోతే అతి పెద్ద నష్టం, నీటికోసం పెను కష్టం వస్తాయన్నారు. అలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


-అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి
రాష్ట్రప్రభుత్వం అగ్రిగోల్డు బాధితులను తక్షణమే ఆదుకోవాలని డా.కంచర్ల అచ్యుతరావు ప్రభుత్వాన్ని కోరారు. కొంత మందికి మాత్రమే నష్టపరిహారం, వారు కట్టిన మొత్తాలు వచ్చాయని.. ఇంకా చాలా మంది వరకూ డబ్బులు కట్టిన వారు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రీగోల్డులో డబ్బులు కట్టిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితులకు అండగా తాము నిలబడతామని.. బాధితుల నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. విశాఖ తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ ఇంకా చాలా మంది అగ్రీగోల్డు బాధితులు ఉన్నారని..వారందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన కోరారు. అగ్రీగోల్డు బాధితు పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకూ తోడుంటామని చెప్పారు.

-జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.10 లక్షలు
సమాజంలో మీడియా లేకపోతే బాహ్యప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని.. అలాంటి మీడియాకు ఉపకార్ ఛారిటుబుల్ ట్రస్టు ద్వారా రూ.10లక్షలు సంక్షేమ నిధికి కేటాయిస్తున్నట్టు  ట్రస్టు చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు ప్రకటించారు. తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దానిని ప్రకటించి వినియోగంలోకి తీసుకు వస్తామని చెప్పారు. ప్రతీ జర్నలిస్టుకి ఆరోగ్య పరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ ట్రస్టు ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటుందన్నారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా మరిన్ని సేవాకార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు ఆయన ప్రకటించారు. తమ ట్రస్టు ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండానే తమ సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్టు ఆయన వివరించారు.

-విశాఖలో సిని పరిశ్రమ అభివృద్ది తమవంతు సహకారం
సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఉపకార్ ఛారిటుబుల్ ట్రస్టు చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు చెప్పారు. డబ్బింగ్, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వంటి విభాగాల్లో శిక్షణ లు ఇచ్చే సంస్థలు ఇక్కడి వస్తే పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలో షూటింగులు జరిపే సినిమా నిర్మాతలు కూడా స్థానిక కళాకారులకు అవకాశం కల్పించి వారికి చేయూత నివ్వాలని కోరారు. విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే ఎంతో మందికి ఉపాది అవకాశాలు మెరుగుపడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ట్రస్టు ద్వారా సిని కళాకారులకు కూడా చేయూత అందిస్తున్నామని.. దానిని రానున్న రోజుల్లో మరింతగా పెంచనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సిబ్బంది సుధీర్, నాగు, తదితరులు పాల్గొన్నారు.