తూకివాకం పనులు సత్వం పూర్తి చేయాలి..


Ens Balu
2
Tirupati
2020-09-29 20:14:58

స్వచ్ఛ సర్వేక్షన్ కు ఇప్పటి నుంచే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. మంగళవారం తూకివాకం లో జరుగుతున్న పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో కొత్తగా రెండు ప్లాట్ ఫారం లు, రోడ్డులు జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచాలన్నారు. ఇక్కడ త్వరగా పనులు  పూర్తి చేస్తే ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. డిబిఆర్ ఆసుపత్రి నుండి రేణిగుంట హీరో హోండా షోరూం వరకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి  నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు.  కరకంబాడి రోడ్డు లోని హోటల్ గెస్ట్ లైన్ డేస్ నుండి కొత్తపల్లి మీదుగా రేణిగుంట రోడ్డు వేయనున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి 15 రోజుల్లో మట్టి పనులు పూర్తి పూర్తిచేయాలని అదికారులను ఆదేశించారు. కొంతమంది రైతులు వ్యతిరేకించిన పని జరిగే జరుగుతుందని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రజల సౌకర్యార్థం కరకంబాడి మార్గం నుండి రేణిగుంట మార్గం కు అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు వల్ల టిడిఆర్ బాండ్లు తోపాటు మీ భూములు విలువ పెరుగుతుందని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం,డిఈ విజయ్ కుమార్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు గోవర్ధన్, చెంచయ్య, సర్వేయర్లు దేవానంద్, ప్రసాద్, స్మార్ట్ సిటి ఎయికాం బాలాజీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.