అన్నవరంలో సత్యదేవుడికే శఠగోపం..!


Ens Balu
292
annavaram
2024-08-10 19:21:39

అన్నవరంలో వాళ్లు ఎంత చెబితే అంత..ఎలాంటి వారికైనా.. ఎంత ఎక్కువ రద్దీ ఉన్నా ఇట్టే సత్యదేవుని  అంతరాలయ దర్శనం చేయిం చేస్తారు.. ఆ సమయంలో దేవస్థాన సిబ్బందిగానీ, సెక్యూరిటీ గానీ వీరిని అడ్డుకోరు.. చూడటానికి సాక్షాత్తూ దేవస్థాన ఉద్యోగులు మాదిరిగానే చక్కటి తెలుపు రంగు దుస్తుల్లోనే కనిపిస్తూ..సత్యదేవుడికే శఠగోపం పెట్టేస్తున్నారు. రత్నగిరి వాసుడి ఆదాయానికి రూ.లక్షల్లో గండి కొట్టడానికి పీఆర్వో కార్యాలయం సాక్షిగా అడ్డగోలుగా అనధికార విధులు నిర్వహిస్తున్న గైడ్లు వచ్చిన దానిలో ఈఓ కార్యాలయానికే సింహా భాగం ఇచ్చే స్తారు. ఒక్క దర్శనాలే కాదండోయ రూములు కావాలన్నా.. ప్రసాదాలు కావాలన్నా.. ఇంకేమైనా వీరే అక్కడి సిబ్బందికి రాయబారులు. ఇలా దర్శనాలు చేయించేందుకు వీఐపీలు ఇచ్చే మొత్తం ఎంతో తెలిస్తే.. ఈ వార్త చదువుతున్నవారికి కూడా కళ్లు బైర్లు కమ్ముతాయి..అక్షరాలా ఒక్కో సార్టీ నుంచి రూ.3500 నుంచి రూ.5వేల వరకూ. ఇక అంతరాలయంలో హుండీలో కాకుండా అర్చకులతో చేసుకున్న ఒప్పందం మేరకే ప్లేటు దక్షిణల రూ.500 నుంచి ఆపై ఎంతిస్తారో లెక్కేలేదు. ఈ విషయం రత్నగిరిపై వార్తలను కవర్ చేసే ఓ వర్గం బాకా మీడియా కూడా వారి పనులు చేయించుకోవడానికి విషయాన్ని బయట పెట్టడానికి ముందుకి రావడం లేదు. 

అన్నవరం శ్రీ సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో అనధికార గైడ్లు ప్రతీరోజూ అడ్డదారిలో సంపాదించి అక్కడి అధికారులను మేపే విధానం స్వామిరి భక్తులకు సైతం ఆగ్రహం తెప్పిస్తున్నది. అదేంటి అంటే వీళ్లు ప్రత్యేక టిక్కెట్టుపై వస్తున్నారని సిబ్బందే ఒంటికాలపై లేస్తారు. ఎందుకంటే ఆ గైడ్లు జోబులో ఆ విధంగా టిక్కెట్లు కూడా ఉంటాయి. రోజుకి, రెండు మూడు టిక్కెట్లు తీసుకొని..వాటిపైనే ఎంత మంది వచ్చినా అంతమంది విఐపీ(అనధికార)లను అడ్డదారిలో లోనికి తీసుకెళ్లి ఇట్టే దర్శనాలు, వేద ఆశీర్వచనాలు చేయించి తీసుకొచ్చేస్తారు. వాస్తవానికి అంతరాలయ దర్శనాలకు తీసుకునే టిక్కెట్టును అక్కడ సిబ్బంది దర్శనం అయిన వెంటనే చించి పారేయాలి. కానీ అనధకార గైడ్లు సౌలభ్యం కోసం వాటిని ఏమీ చేయకుండా వారి వద్దనే ఉంచేస్తారు. అలా ఉంచేయడం వలన ఎప్పుడైనా ఉన్నతాధికారులు యాక్టింగ్ చేయడానికి తనిఖీలకు వచ్చినా స్వామివారి దర్శనానికి తామూ వచ్చామని.. ఇవిగో అంతరాలయ దర్శన టిక్కెట్లని భక్తుల ముందు అధికారులను కూడా బూరిడీ కొట్టిస్తారు. అనధికార విఐపీ వాహనాలను రాచమార్గంలో కొండపైకి ఎక్కించేందుకు ఒక బ్యాచ్, అక్కడ వాహనాలు సిఆర్వో కార్యాలయ సమీపంలో పార్క్ చేయించేందుకు మరో బ్యాచ్, గదులు ఇప్పించేందుకు ఒక బ్యాచ్, స్వామివారి ఆలయంలో దర్శనాలు చేయించేందుకు ఒక బృందం ఇలా విడిపోయి వారి విధులు.. కాదు కాదు.. అనధికార వసూళ్లు చక్కగా చేసుకుంటున్నారని రత్నగిరి కోడైకూస్తున్నది. 

ఇదేంటని ఈఓని ప్రశ్నిస్తే.. తాము చాలా పద్దతి గలవారమని.. ఎలాంటి అవినీతిని సహించమని.. దేవస్థానంలో అనధికార సిబ్బంది ఎవరూ లేరని చెప్పుకొస్తారు. తమ పనులు, వ్యాపారాలు, వ్యవహారాల కోసం మీడియా ఐడీ కార్డులతో ఉండే బాకా మీడియా కూడా ఈ విషయాన్ని మాత్రం గట్టిగా పబ్లిసిటీ చేస్తుంది. మరి అంతముందు అనధికార గైడ్లు విషయం ఎందుకు వదిలేసిందనే అనుమానం మీకు రావొచ్చు. కానీ వారి కనపడే.. కనీసం వినపడదే.. అసలు ఇక్కడ గైడ్లు ఎక్కడ ఉన్నారని వీళ్లే తిరగేసి ప్రశ్నలు వేస్తారు. వంతుల వారీగా గైడ్లు చేసే అడ్డగోలు దర్శనాల విధులకు ఒక్కొక్కరికీ అన్ని ఖర్చులు, అధికారులు, సిబ్బందికి ఇచ్చేసే మొత్తం పోనూ రూ.5వేల వరకూ తీసుకెళ్లిపోతారంటే అతిశయోక్తి కాదు.  వాస్తవానికి లఘుదర్శన టిక్కెట్ల ద్వారా ఆదాయం వస్తే సత్యదేవుడి హుండీ, గల్లా పెట్టి నిత్యం గల గలలాడుతుంటుంది. కానీ అనధికార గైడ్లే వచ్చే మొత్తాన్ని కొందరు సిబ్బంది.. అధికారుల సహకారంతో  కొల్లగొడుతుంటే.. మూడవాడిలా సత్యదేవుడు కళ్లప్పగించి చూడటం తప్పా మరేమీ చేయలేకపోతున్నాడని భక్తులు గొల్లుమంటున్నారు.  సాధారణ రోజుల్లో అడ్డదారి దర్శనాలకు రూ.1500 నుంచి రూ.2 వేల వరకూ ఛార్జి చేస్తే ప్రత్యేక రోజుల్లో రూ.3 వేల నుంచి రూ.5వేల వరకూ వసూలు చేస్తున్నారని సమాచారం అందుతుంది. 

ఈ విషయాన్ని చూసీ చూడనట్టు ఉండే మీడియాకి ప్రతీరోజూ దారి ఖర్చుల క్రింద రూ.500 టిప్పు కూడా ఇస్తారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. ఇక్కడకు వచ్చే కొందరు అనధికార విఐపీలు, రాజకీయనాయకులు, మీడియా పిచ్చి ఉన్నవారికి ప్రచారం కావాలంటే మరో రేటు ఉంటుంది. దానికి బాకా మీడియా సిద్దంగా వుంటుంది. వారి దర్శనం, విరాళాలు ఇచ్చిన ఫోటోలు, వీడియోలు ప్రచారం చేస్తే వారికి వచ్చే ఆదాయం వేరే లెవల్ లో వుంటుంది. ఇలా అటు గైడ్లు.. కొందరు తేడా మీడియా సభ్యులు రెండు చేతులా సంపాదిస్తూ సత్యదేవుని ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇపుడు ఈవార్త చదివిన తరువాత కూడా ఇక్కడ అలాంటివేమీ జరగనపుడు ఎందుకు స్పందించాలని మాత్రమే ఇక్కడి సిబ్బంది ఊరుకుండిపోతారు. ఒకరిద్దరు హడావిడి చేసి రెండు మూడు రోజులు మీడియా సభ్యులను దర్శనాలకు అనుమతించరు. అంతకు మించి చేసేది ఏమీ ఉండదని వాళ్లకి, ఈ వార్త చదువుతున్నవారికి అందరీ తెలుసు. సత్యదేవ ఇప్పటికైనా నీ ఆదాయాన్ని గద్దల్లా తన్నుకుపోతున్న వారి నుంచి నిన్ను నువ్వే కాపాడుకోవాలయ్యా.. లేదంటే గైడ్లు అడ్డదారిలో ఆదాయం  కొల్లగొడుతున్నా ఏమీ చేయలేని సత్యదేవుడనే శీర్షికతో మళ్లీ మళ్లీ మేమే వార్తలు రాయలి.. నమో సత్యదేవ నమో నమహ..!