పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోని బదిలీల్లో జోన్-1 సూపరింటెండెంట్ జివి.కనకవల్లీ కుమారి కి మేలు చేయడం కోసం అధికారులు జీఓనెంబరు 75ని బుట్టదాఖలు చేసి మరీ ఏకపక్షంగా వ్యవహించారు. పేరుకి జీఓని నిబంధనలున్నా.. ఇందులోని ఒక్క నిబంధనకూడా బదిలీలు చేపట్టిన అధికారులు అమలు చేయలేదంటే పరిస్థితి ఎంఖ కాస్ట్లీగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. భారీ మొత్తాలు తీసుకునే కావాల్సిన వారికి బదిలీలు చేసినట్టుగా ఆధారాలతో సహా బయట పడ్డాయి. ప్రభుత్వం బదిలీలు చేసే సమయంలో ప్రత్యేకంగా పక్కాగా మార్గదర్శకాలతో జీఓని విడుదల చేసింది. దాని ఆధారంగా మాత్రమే అధికారులు బదిలీలు చేయాల్సివుందని కూడా పేర్కొంది. కానీ పంచాయతీ రాజ్ లో మొదటి నుంచి అన్నీ తేడా వ్యవహారాలే కావడంతో ఈ సారి కూడా బదిలీల్లో అధికారులు కావాల్సిన వారికోసం పక్కగా చేతి వాటాన్ని ప్రదర్శించారు. దీనితో బదిలీల్లో తేడాలు జరిగాయని మీడియా విచారణ చేపడితే పక్కాగా వాస్తవాలు వెలుగుచూశాయి. మరెందుకు బదిలీల విషయంలో అక్రమాలు, వక్రమార్గాలు ఎంచుకున్నారని అధికారులను అడిగితే అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని సెలవిచ్చారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ లో బదిలీల కోసం ప్రత్యేకంగా జీఓఎంఎస్ నెంబరు 75ని విడుదల చేసినా బదిలీలు పర్యవేక్షించిన అధికారులు కనీసం అందులోని ఒక్క అంశాన్నీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. అంతా ఆ ఎస్ఈ కోసం వారికి నచ్చినట్టుగానే చేయడం విశేషం. జోన్-1లోని సూపరింటెండెంట్ ట్రాన్స్ఫర్లు పర్యవేక్షపు ఇంజనీయర్లు ఎమ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం) పర్యవేక్షణలో ఈనెల 27న రాత్రి పదిగంటలకు చాలా చక్కగా అన్నీ తేడాగానే నిర్వహించేశారు. ఏవిధంగా చేసేశారో ఒక్కసారి ఆరా తీస్తే..
బి.శ్రీనివాసరావు సూపరింటెండెంట్, ఈ.ఈ.పి.ఐ.యూ సదరు అధికారి పాడేరులో ఆరేళ్లు పూర్తి అయ్యాయి. ఈ జి. ఓ. ఎమ్.ఎస్.నెం. 75 ప్రకారం ఏజెన్సీ ఏరియాలో రెండేళ్లు పూర్తైన వ్యక్తిని వారి కోరిన చోట బదిలీ చేయమని జి.ఓ.లో ఉన్నది కాని అలా చేయకుండా ఇతనిని పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్ ఇచ్చారు. అది ఏ జీఓ ప్రకారంగా చేశారో పర్యవేక్షక అధికారులు జిల్లా కలెక్టర్ కు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శికి తెలియజేయాల్సి వుంది. ఇక ఆర్.నాగరాజు సూపరింటెండెంటు, డి.పి.ఆర్.ఈ.ఓ ఆఫీస్ అనకాపల్లిలో పనిచేస్తున్న ఇతనని రెండేళ్లు నిండకపోయినా పి.ఆర్.ఐ. డివిజన్ టెక్కలికి బదిలీ చేశారు. ఇతని స్థానంలో సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారిని ఓ ఎమ్మెల్యే ఇచ్చిన శిఫారసు లేఖ ఆధారంగా చూపి అనకాపల్లికి బదిలీచేసేశారు. అంటే ఇక్కడ నిభందనలు ఏమీ పరిగణలోనికి తీసుకోలేదు.. విశేషం ఏంటంటే ఈమె బదిలీ అయిన ప్రదేశం అనకాపల్లి టౌన్ లో ఉన్నది.. ఈమెను బదిలీ చేయడానికి కానీ ఈమెకు అనుకూలంగా సదరు ఎమ్మెల్యే ఎలాంటి సిఫారసు లేఖా ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్టుగా అధికారులను మభ్య పెట్టి అమాయకులైన ఆర్. నాగరాజు ని ఆమె స్థానంలోనికి పంపేశారు. ఇక్కడ పెద్ద మొత్తంలో చేతులు మారిన కారంణంగానే లేని ఎమ్మెల్యే సిఫారసు లేఖను బూచిగా చూపించినట్టు తేటతెల్లం అయ్యింది. ఈయనను కె.ఎస్.కె.శోభా రాణి స్థానంలో బదిలీ చేసి యున్నారు. ఈమె పై ఎ.సి.బి. కేసుతోపాటు శాఖాపరమైన కేసులు కూడా ఉండటం విశేషం. బదిలీ అయిన స్థానానికి వెళ్లకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామని కూడా సదరు అధికారిని బెదిరించడం కొసమెరుపు. ఎస్.రమేష్ ఈయన జూనియర్ అసిస్టెంట్ పాడేరు డివిజన్ లో ఏడేళ్లు సర్వీసు పూర్తిచేసుకొని బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే.. జీఓ ప్రకారం కోరిన ప్రదేశానికి బదిలీ చేయాల్సి ఉండగా ఇతనని కూడా పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్ చేసేశారు. ప్రభుత్వం బదిలీల జీఓ ఒక్క శాతం కూడా పరిగణలోనికి తీసుకోకుండా అంతా మా ఇష్టం అన్నరీతిలోనే బదిలీలను చేయి తడుపు వ్యవహారంలో చక్కబెట్టేశారు.
మరో విశేషం ఏంటంటే సదరు సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారి శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉండగా..విశాఖపట్నంలో కూడా ఓ.డి బేసిస్ మీద గత రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడే ఓడీలో పనిచేస్తున్న అధికారి బదిలీల్లో ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సి ఉంది. లేదా జీఓ ప్రకారం కోరుకున్న అధికారుల బదిలీలు జరగగా ఖాళీ ఉన్న ప్రదేశాల్లోకి బదిలీపై వెళ్లాలి. కానీ ఇక్కడకి దగ్గర్లోని అనకాపల్లికి చాలా చాకచక్యంగా బదిలీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం జీఓ ఈ అధికారిణి బదిలీ విషయంలో చేతి వ్యవహారం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. చక్రం తిప్పే నేర్పు ఉంటే ఏ విధంగా నైనా బదిలీలు చేయించుకోవచ్చునని.. దానికోసం బదిలీలు చేసే అధికారులు కూడా వారికి అనుకూలంగానే పనిచేస్తార విషయం పంచాయతీరాజ్ శాఖలోని బదిలీల్లో చాలా క్లియర్ గా కనిపించింది. జి.గంగారామ్ సూపరింటెండెంట్ మూడు నెలల సర్వీసు చేసిన వ్యక్తిని అడ్డగోలుగా విజయనగరానికి బదిలీచేసేశారు. ఇలా ఒకటి కాదు రెండు ఇష్టానుసారం బదిలీలు చేశారు అధికారులు. వీటన్నింటికీ బదిలీల ఉత్తర్వులే సాక్షిగా నిలుస్తున్నాయి. ఈ విషయాలను బయటకు రానీయకుండా ఉండేందుకుందు, ఒక వేళ తమపై మీడియాలో కథనాలు వచ్చినా వెనుక నుంచి రక్షించేందుకు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని.. ఎవరేం చేసుకున్నా పర్లేదంటూ హుకుం కూడా జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది.
భారీఎత్తున అక్రమాలు, ప్రభుత్వ జీఓను ఉల్లంఘించి మరీ జరిపిన ఈ బదిలీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని బాధిత అధికారులు కోరులున్నారు. అలా జరగకపోతే అక్రమార్గంలో బదిలీలపై వచ్చిన వారు ఇక్కడే మరో పదేళ్లు తిష్టవేసుకొని ఉండిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వాపోతున్నారు. అలా కాకపోయినా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా జరిపిన బదిలీలపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, మూడు జిల్లాల కలెక్టర్లు దృష్టిసారిస్తే ఎవరి విషయంలో ఏ తరహా మోసాలు, అక్రమాలు జరిగాయో బయటపడే అవకాశం వుంది. అక్రమంగా జరిగిన బదిలీలపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారిస్తారా.. లేదంటే జిఓలను సైతం బుట్టదాఖలు చేసిన అధికారుల తేడా బదిలీలకే ఒకే చెబుతారా అనేది. కాగా పంచాయతీరాజ్ లో జరిగిన అక్రమాలపై డిప్యూటీ సీఎం, కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది.