ఆ ఉద్యోగిని కోసం జీఓనే పక్కనపెట్టేశారు..!


Ens Balu
286
visakhapatnam
2024-08-30 14:13:23

పంచాయతీరాజ్ జోన్-1 సూపరింటెండెంట్ ఉద్యోగుల బదిలీల్లో జివి.కనకవల్లీ కుమారికి అనకాపల్లి జిల్లా బదిలీ చేయడానికి  పీఆర్ ఎస్ఈలు మ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం)లు ఏకంగా జీఓఎంఎస్-75ని బుట్టదాఖలు చేశారు. ఐదేళ్లు దాటిన వారిని మాత్రమే బదిలీల్లో అన్ని కేటగిరీల్లో కదపాలని జీఓని బేస్ చేసుకొని ట్రాన్స్ ఫర్ గైడ్ లైన్స్ ఇచ్చిన ఈ అధికారులే.. సదరు ఉద్యోగినికి న్యాయం చేసి.. అర్హులైన ఉద్యోగులకు శక్తివంచన లేకుండా అన్యాయం చేయడానికి పూనుకున్నారు.  శ్రీకాకుళం జిల్లాలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సదరు ఉద్యోగిని గత ఏడాది నవంబరు 23 నుంచి వారంలో నాలుగు రోజులు విశాఖ సర్కిల్ లో పనిచేయాలని ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చుకున్నారు. పేరుకి 4 రోజులు అయినా.. సర్వీసు మొత్తం ఇక్కడే చేస్తూ వస్తున్నారు. విశాఖలో ఉంటూ శ్రీకాకుళం రోజూ అప్ అండ్ డౌన్ చేయలేక తెచ్చుకున్న ఉత్తర్వులతో రెండేళ్లు ఉద్యోగం చేసి.. ఆతరువాత కూడా కేవలం ఒక్క గంటలో విశాఖపట్నం-అనకాపల్లి పీఆర్ కార్యాలయానికి  చేసే జర్నీ కోసం మళ్లీ వెసులుబాటు  బదిలీల్లో తెచ్చేసుకున్నారు. 

పాపం ఓడిపై సేవలు అందించిన సదరు ఉద్యోగినికోసం బదిలీలు చేపట్టే పంచాయతీరాజ్ ఎస్ఈలు కూడా ఈమె కోసం ప్రభుత్వం విడుదలచేసిన జీఓనే పక్కనపెట్టేశారు. ఉద్యోగిని కంటే జీఓ ఏం పెద్ద ముఖ్యం.. మేము చేసే అక్రమ బదిలీలు, అడ్డుగోలు వ్యవహారాలను ఎవరు అడుగుతారు.. ఇంకెవరు ప్రశ్నిస్తారులే అనుకున్నారో ఏమో తెలీదుగానీ.. జీఓలో పొందు పరిచిన నిబంధనలపై సూచనలు చేసిన ఈ అధికారులే అమెను అనకాపల్లి బదిలీచేయడానికి సిద్దపడిపోయారు. బదిలీ చేసేశారు. దీనితో అర్హులైన ఇతర విభాగా సూపరింటెండెంట్ లకు ఇబ్బందులు తలెత్తాయి. ఐదేళ్లు, ఏడేళ్లు వివిధ ప్రాంతాల్లో పనిచేసిన మాకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బదిలీ చేయకుండా ఈమెకోసం.. ఈమె కోరిన ప్రదేశానికి ప్రత్యేకంగా బదిలీచేయడం ఏంటని..? స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సిఫారసులేఖలు కూడా ఆమె కోసం పక్కన పెట్టేయడం దారుణమని మండి పడుతున్నారు. తక్షణమే బదిలీల్లో జీఓలో ఉన్న అంశాల వారీగా ఆఫ్ లైన్ పద్దతిలోనే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా జోన్-1లో జరుగుతున్న బదిలీల అక్రమాలను డిప్యూటీ సీఎం, సీఎం కార్యాలయాలకు ఫిర్యాదులు సైతం అందాయి. అవి కాస్త ఈఎన్ఎస్-ఈరోజుకి చేతికి చిక్కాయి. నిబంధనల ప్రకారం సదరు ఉద్యోగినికి ప్రస్తుతం జరుగుతున్న బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాల్సి వుంది.  లేదా.. అర్హులైన ఉద్యోగులు కోరిన చోటుకి బదిలీలు చేపట్టినతరువాత  మాత్రమే ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకోవాలని. కానీ అధికారులు బదిలీకి అర్హత లేకపోయినా పనిగట్టుకొని మరీ అమెను అనకాపల్లి జిల్లాకి బదిలీల చేయడాన్ని అర్హులైన ఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నారు. 

ఈమె విషయంలో బదిలీ చేసే అధికారులు ఎంత అత్యుత్సాహం చూపిస్తున్నారో బదిలీ జీఓని పూర్తిగా పక్కనపెట్టడమే దానికి నిదర్శనం. ఈ విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు సంయుక్తంగా బదిలీ అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టింది. ఎవరెవరికి ఏఏ ప్రాతిపదిన బదిలీలు చేశారు. కావాలనే ఎందకు ఏజెన్సీలో పనిచేసిన వారికి రిటెన్షలు ఇచ్చారు. పక్కా ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఆధారాలన్నీ జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ హరేంధిన ప్రసాద్ ఈ అంశంపై విచారణ చేయిస్తామని బదులిచ్చారు. కాగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ.. విశాఖజిల్లాలో ఓడిపై పనిచేస్తూ.. అడ్డదారిలో రావాలని ప్రయత్నానికి బదిలీచేసే అధికారులు రెడ్ కార్పెట్ వేసి మరీ బదిలీచేయడంపై పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయిని తెలిసింది. అయితే ఈ విషయమై బదిలీ అధికారులని నేరుగా ఈఎన్ఎస్-ఈరోజు ఫోన్ లో సంప్రదించగా ఎవరూ స్పందించలేదు. వాట్సప్ లో వివరణ కోరినా..దానికి కూడా బదిలీలు చేపట్టే జోన్-1 పంచాయతీరాజ్ ఎస్ఈలు బదులు ఇవ్వలేదు. అడ్డగోలుగా జరుగుతున్న ఈ అక్రమ బదిలీల్లో ఒక ఉద్యోగిని కోసం జోన్-1 అధికారులు చూపిస్తున్న అత్యుత్సాహం.. ప్రభుత్వం విడుదల చేసిన జీఓని బుట్టదాఖలు చేయడంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సి వుంది. ప్రక్రియ మొత్తం మొదటి నుంచి చేపట్టి అర్హులైన ఉద్యోగులకు న్యాయం చేయాల్సి వుంది. బదిలీల ప్రక్రియకు వచ్చేనెల 15వరకూ సమయం ఉన్నందున అక్రమార్కులపై జిల్లా కలెక్టర్ ఏవిధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..?!