తెలుగు సీనీ పరిశ్రమను విశాఖ తరలించడమే ప్రధాన లక్ష్యం


Ens Balu
54
visakhapatnam
2024-08-31 16:36:21

తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకు వచ్చి 24క్రాఫ్ట్స్ కార్మికులకు పూర్తిస్థాయిలో జీవనోపాది కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా  భాధ్యతలు స్వీకరించిన ఉపకార్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత  సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. శనివారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు కార్యక్రమంలో అట్టహాసంగా డా.కంచర్ల ఏపీఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ గా  ప్రమాణ స్వీకారారం చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఇంకా తెలుగు చిత్రపరిశ్రమ తెలంగాణకే పరిమితం అయిపోయిందన్నారు. ఫలితంగా సీని పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికే వెళ్లిపోతుందన్నారు. అలాకాకుండా తెలుగు చిత్రపరిశ్రమ తెలంగాణ నుంచి విడిపోయి రాష్ట్రానికి చెందిన వాటాతోపాటు విశాఖ రావాలన్నారు. ఆదిశగా ఫెడరేషన్ తొలి అడుగు వేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని విశాఖలో ఫిల్మ్ చాంబర్ ను ఏర్పాటు చేసి, సెన్సార్ బోర్డుని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలన్నారు.

 విశాఖలోని చాలా ప్రాంతాలు, ఉత్తరంధ్రా రాయలసీమ జిల్లాల్లో సినిమాలకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలున్న కారణంగా చక్కటి లొకేషన్స్ తో సినిమాలు తీసుకోవడానికి ఎంతో అనువుగా వుంటుందని.. ఇక్కడే చాంబర్, సెన్సార్ బోర్డులు ఉండటం వలన అనుతుమలు తీసుకోవడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఇక్కడ స్టూడియోలు,  సినీ విభాగానికి చెందిన ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. 64 కళలు, 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే  ఏ కళాకారుడైతే ఫెడరేష్ లో సభ్యత్వాలు తీసుకుంటారో వారందరికీ తక్షణమే ఈశ్రమ్ కార్డులు నమోదు కూడా చేపట్టాలని.. కార్డు తీసుకున్న వారందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు కళాకారుడికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ కార్మికుడు, కళాకారుడికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలన్నారు. మద్రాస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న దగ్గర నుంచి కళాకారులు, కార్మికులకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణ పథకాలను ఫెడరేషన్ లోని అన్ని విభాగాల్లోని వారికి వర్తింపజేయాలన్నారు. 

 సినీ కళాకారులు, కార్మికుల కోసం ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక కార్యాలయం, వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి అన్ని విషయాలను అందులోనే నమోదు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కి సినిమా నిర్మాణాల వలన వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నదని.. దానిని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ లోనే సాధ్యమైనంత మేరకు సినిమా షూటింగులు జరిగే విధంగా రాష్ట్రాన్ని, ఇక్కడి సినిమా స్పాట్ లను ప్రమోట్ చేస్తూ.. ఫెడరేషన్ ద్వారా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణ సమయంలో కూడా రాష్ట్రంలోని కళాకారులు, సిబ్బందికే ప్రాధాన్యత ఇచ్చేవిధంగా కూడా సినిమా నిర్మాతలు, దర్శకులతో  చర్చలు కూడా జరపుతామని చెప్పారు. త్వరలోనే 24 క్రాఫ్ట్స్ తో పాటు 64 కళలకు సంబంధించిన కళాకారులతో జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని.. 26 జిల్లాలకు చెందిన కళాకారులు, కార్మికులు సదరు జిల్లా కమిటీల పరిధిలోకి వచ్చి పనిచేసేవిధంగా చేయనున్నామన్నారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు జిల్లా కమిటీలన్నీ కార్మికులు, కళాకారులు సంక్షేమాన్ని, ప్రభుత్వ పథకాల అమలును సదరు జిల్లా కమిటీలు చూసుకునేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

 దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్న కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏపీ పిల్మ్ ఛాంబర్ ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా సినిమా రిజిస్ట్రేషన్లతోపాటు, ఇతర అనుమతుల ఆదాయం భారీగా రాష్ట్రప్రభుత్వానికి చెందే అవకాశాలున్నాయని ఫెడరేషన్ కు ప్రభుత్వ మద్దతు కూడా కోరతామన్నారు. అంతేకాకుండా ఈరోజు నుంచి ఫెడరేషన్ సభ్యులకు విద్య, వైద్యం, మౌళిక సదుపాయాల విషయంలో ఫెడరేషన్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని పనిచేస్తుందన్నారు. వారి కష్ట నష్టాల్లోనూ ఫెడరేషన్ తోడుగా వుంటుందని భరోసా ఇచ్చారు. కొత్త కమిటీలు ఏర్పాటు చేసిన తదగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ఫెడరేషన్ దగ్గరుండి సభ్యులు.. వారి కుటుంబాలకు అండగా వుండి వారి సంక్షేమం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. అభిమానులు, ఫెడరేషన్ సభ్యుల కరతాల ధ్వనుల మధ్య చైర్మన్ గా సంతకం చేసిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. సభ్యులంతా కలిసిని గజమాలతో ఘనంగా సత్కరించారు.  

ఈ కార్యక్రమంలో దర్శకులు, ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా, ప్రధాన కార్యదర్శి సలాది గణేశ అచ్చుత రామస్వామి, కోశాధికారి ముళ్లపూడి రాధ, కార్యదర్శి ముద్దన సుభాషిణి, ఎపిమా అధ్యక్షులు ముత్తుకూరు నరసింహులు, ఎపిమా విశాఖ అధ్యక్షులు భయ్యా శ్రీనివాసరావు, ఎపిమా ప్రధాన కార్యదర్శి చవల మురళీకృష్ణ, ఎపి మా కోశాధికారి  పూల శ్రీను,  ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు.. కె.ఇందిరా ప్రియదర్శని, చెన్నుపల్లి పుష్ప, జానపాటి విశ్వేశ్వర రావు, పంపన సత్యనారాయణ, జుజ్జువరపు సరోజిని, బి. శోభారాణి , కసుకుర్తి అరుణశ్రీ, యర్రంశెట్టి దుర్గా భవాని, పోలుదాసు రంగనాయకులు, వీరికి నరసింహారావు, షేక్ అహ్మద్, షేక్ సైదావలి, షేక్ చాన్ భాష, పెద్ద ఎత్తున అభిమానులు, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు సభ్యులు సుధీర్, నాగు, రాజా, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ప్రతినిధులు పలువురు కంచర్ల అభిమానులు ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.