ఆర్డర్ ఇచ్చేయండి ఆ తర్వాత నేను చూసుకుంటా..!?


Ens Balu
250
visakhapatnam
2024-08-31 18:08:10

పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ల బదిలీల్లో దొడ్డిదారి వ్యవహారం రసకందాయంలో పడింది. ఇక్కడ అడ్డగోలుగా జరుగుతున్న బదిలీల వ్యవహారాన్ని ఈఎన్ఎస్-ఈరోజు ఆధారాలతో సహా బయట పెట్డడంతో బదిలీలు చేపట్టే  పంచాయతీరాజ్ ఎస్ఈలు డైలమాలో పడ్డారు. అయినా తాను కోరుకున్న చోటుకి బదిలీచేస్తే ఎలాంటి ఒత్తిడిలనైనా తాను తిప్పికొడతానని.. అందునా ప్రస్తుతం భారీ వర్షాలు పడుతు న్నాయని.. నా బదిలీ కోసం జిల్లా కలెక్టర్ దృ ష్టిపెట్టేంత సీన్ ఉండదని బదిలీ అధికారులకు భరోసా ఇచ్చినట్టు తెలిసింది.  ముందు తనకి ఆర్ఢర్ ఇచ్చేయాలంటూ సదరు ఉద్యోగిని శనివారం రాత్రి జిల్లా పరిషత్ లో రాత్రి 10.30 వరకూ హైడ్రామా నడిపారు. తన బదిలీని ఆపాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని.. ఎంతటి అధికారినైనా తన వెనుక ఉన్న ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తాను తిప్పికొట్టగలనని ధీమా వ్యక్తం చేయడం విశేషం. సూపరింటెండెంట్ లబదిలీల్లో అర్హులైన వారిని బదిలీలు చేయకుండా రిటెన్షన్ చేసి.. అర్హులు కానీ పంచాయ తీరాజ్ జోన్-1 సూపరింటెండెంట్ ఉద్యోగుల బదిలీల్లో జివి.కనకవల్లీ కుమారికి అనకాపల్లి జిల్లా బదిలీ చేయడానికి  పీఆర్ ఎస్ఈలు మ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం)లు ఏకంగా జీఓఎంఎస్-75ని బుట్టదాఖలు చేసి మరీ ఆర్ఢర్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం భగ్నం అయినా.. సదరు ఉద్యోగిని బదిలీ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడాన్ని బట్టి పెద్ద స్థాయిలోనే లాబీయింగ్ జరుగుతున్నట్టుగా స్పష్టం అవుతున్నది.

 కాగా తన బదిలీ విషయంలో ఓ వర్గం మీడియాని వ్యతిరేకంగా వార్తలు రాకుండా కూడా అడ్డుకున్నానని అందుకే ప్రధాన పత్రికల్లో వార్తలేమీ రానీయకుండా చేశానని అధికారులపై ఒత్తిడితి తెచ్చే ఉద్యోగిని చెప్పినట్టుగా బాధిత ఉద్యోగులు గొల్లుమంటున్నారు. మీడియా కూడా అక్రమార్కులకే కొమ్ముకాయడం వలనే బదిలీలు చేసే అధికారులు వాస్తవాలు బయటపడినా.. కూడా కోరుకున్నవారికే బదిలీలు చేయడానికే సముఖత చూపుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం జీఓ ఇచ్చినా ఒక ఉద్యోగిని కోసం బదిలీలు చేసే అధికారులు ఒక్కమాటపై కట్టుబడి ఉండి మరీ కధనడిపించడం చూస్తుంటే భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందని స్పష్టమవుతున్నది. ఆఖరికి ఈ విషయంలో విశాఖప ట్నం జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్ విచారణకు ఆదేశించినా కూడా బదిలీ చేసే ఎస్ఈలు సదరు ఉద్యోగికి మేలు చేయడానికి ఎన్ని దారులు న్నాయో అన్ని దారులూ వెతకడడం చర్చనీయాంశం అవుతుంది.

-రీ-కౌన్సిలింగ్ చేస్తే అక్రమాలన్నీ బయటకు
పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ల బదిలీలో పెద్ద మొత్తంలో చోటు చేసుకున్న అక్రమ వ్యవహారాలన్నీ ఆధారాలతో సహాయ బయటకు రావాలంటే ఇప్పటి వరకూ జరిగిన కౌన్సిలింగ్ మొదటి నుంచీ చేపడితే బదీలీలు చేపట్టే అధికారులు ప్రభుత్వ జీఓని ఏ విధంగా తొక్కిపెట్టారో తేలిపోతుంది.  అంతేకాకుండా అసలు బదిలీకి అవకాశమే లేని ఉద్యోగిని కోసం జోన్-1 బదిలీల్లో ఎస్ఈలు ఎందుకు అంత అత్యుత్సాహం చూపుతున్నారో కూడా ఆధారాలు బయటపడే అవకాశం ఉంది. అంతేకాకుండా బదిలీలకు అవకాశం ఉండి రిటెన్షన్ కు గురైన ఉద్యోగులకు ఖచ్చితంగా ప్రభుత్వ జీఓ ప్రకారం బదిలీ జరడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. అదే జరిగితే బదిలీలు చేసే అధికారులు చేసిన మోసాలు, తొక్కిన అడ్డదారులు, కావాల్సిన వారికోసం ముందుగానే ఆర్డర్లు ఇవ్వడానికి లేని సిఫారసు లేఖలు చూపించిన బూచీ వ్యవహా రాలన్నీ కూడా బయటపడిపోతాయి. ఈ ఒక్క కారణంతోనే సదరు ఉద్యోగిని తనకు అర్జెంట్ గా ఉత్తర్వులు ఇస్తే ఆఘమేఘాలపై శ్రీకాకుళం జిల్లాలో రిలీవ్ అయిపోయి వెంటనే అనకాపల్లి వెళ్లి జాయిన్ అయిపోతానని కూడా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

అయితే ఈమె విషయంలో జరిగిన మోసం బయటకు రావడంతో ముగ్గు ఎస్ఈల్లో ఒక ఎస్ఈ వెనుకడుగు వేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈమె విషయంలో ఈఎన్ఎస్-ఈరోజు వరుస కథనాలు రాస్తున్నది. నిజంగా ఆర్డర్ ఇస్తే నేరుగా తప్పుచేసినట్టు జిల్లా కలెక్టర్ ముందు కూడా దోషు లుగా మిగిలిపోతామని చెప్పినట్టు సమాచారం. అయితే ఎవరూ తన బదిలీని ఆపలేరని, ఎలా తనకు బదిలీ జరగదో చూస్తానని.. కోరుకున్న చోటు తనకు రాకపోతే ఏం చేయాలో కూడా తనకి తెలుసునని కూడా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే విశాఖజిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ లబదిలీల్లో జరిగిన అక్రమాలపై దృష్టిసారించిన నేపథ్యంలో బదిలీలు చేసే ఎస్ఈలు సదరు ఉద్యోగినికి ఉత్తర్వులు ఆమె ఒత్తిడి మేరకు ఇచ్చేస్తారా..? లేదంటే అర్హులైన వారికి ఇస్తారా అనేది తేలాల్సి వుంది.