ఆమెకి అడ్డదారిలో ఆర్డర్ ఇద్దామా వద్దా..?!


Ens Balu
156
Visakhapatnam
2024-09-02 09:50:32

జోన్-1 పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ల బదిలీల్లో అర్హత లేకపోయినా ఆ.. ఉద్యోగిని అడ్డగోలుగా తానుకోరుకున్న చోటుకి బదిలీ చేయించుకోవడానికి అన్ని దారులూ వెతుకుతోంది. ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నామని ఇప్పటికే జిఓ నెంబరు 75ని అపహాస్యం చేశారు  పీఆర్ ఎస్ఈ  మ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం)లు. విశాఖ జిల్లా కలెక్టర్ జిఓఎంఎస్75ని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ బదిలీలో అధికారులే బుట్టదాఖలు చేసిన విషయంపై విచారణ చేపట్టడంతో సదరు ఉద్యోగినికి ఆమె కోరుకున్న చోటుకి అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అనకాపల్లికి బదిలీ చేసేయాలా..? వద్దా..  అనే  దొడ్డిదారి వ్యవహారం రసకందాయంలో పడింది. అయితే ఇక్కడి తేడా బదిలీల విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు బట్టబయలు చేయడంతో విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పందించారు. జరుగుతున్న అడ్డగోలు వ్యవహారంపై విచారణ చేపట్టారు. 

అంతేకాకుండా ఇద్దరు ఎస్ఈలకు తక్షణమే కలెక్టరేట్ కి రావాలని కబురు కూడా పంపించి పూర్తిస్థాయిలో తేడా బదిలీల విషయంలో తలంటేసినట్టు సమాచారం అందుతున్నది..  దీనితో మరింత ప్రెస్టేషన్ పెంచుకొని బదిలీ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు సదరు ఉద్యోగిని. అసలు బదిలీలకి అర్హతే లేని ఆమె కోసం ఎందుకు జీఓని, నియమ నిబంధనలను పక్కన పెట్టాల్సి వచ్చిందని మీడియా ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు బదీలు చేపట్టే అధికారులు.  ప్రస్తుతం ఆమెకు ఆర్డర్ ఇచ్చే విషయంలో ఎస్ఈలు డైలమాలో పడ్డారు. అయినా తాను కోరుకున్న చోటుకి బదిలీచేస్తే ఎలాంటి ఒత్తిడిలనైనా తాను తిప్పికొడతాననే ధీమాతోనే ఉన్నారు. అంతేకాదు సహచర ఉద్యోగుల వద్ద  తన బదిలీ ఆరు నూరైనా ఆగదని మంగమ్మ శపధం కూడా చేసినట్టు చెబుతున్నారు. ఆమె బదిలీ కోసం ఏకంగా రూ.5 లక్షలకు పై చిలుకు చేతులు మారిన కారణంగానే అధికారులు కూడా ఆమె బదిలీ కోసం జీఓలోని నిబంధనలనే ప్రక్కన పెట్టినట్టు ప్రచారం జరుతుతుంది.

అలా కాకపోతే.. ఎంత దైర్యంతో అర్హతే లేకుండా కోరిన చోటుకి ఏ విధంగా బదిలీకి దరఖాస్తు చేస్తారు..? దానిని బదిలీలు నిర్వహించే అధికారులు ఆమోదించి ఆమెకోసం ప్రత్యేకంగా పనిచేస్తారో అధికారులే జిల్లా కలెక్టర్ కి వివరించాల్సి వుంది. మొన్నటి రాత్రి జిల్లా పరిషత్ లో రాత్రి 10.30 వరకూ సదరు ఉద్యోగిని ఆర్డర్ తీసేసుకోవడానికి జిల్లా పరిషత్ పెద్ద హైడ్రామానే నడిపారట. అయితే అప్పటికే అక్రమ బదిలీల విషయంలో ఈఎన్ఎస్-ఈరోజు కథనాలు మూడు జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖలో తీవ్ర ప్రకంపనలు సృష్టించడంతో కాస్త వెనక్కి తగ్గారు అధికారులు. అయినప్పటికీ సదరు ఉద్యోగిని మాత్రం తనకి ఏ విధంగానైనా ఆర్డర్ ఇవ్వాలని.. ఆమె స్వయంగా ఆర్డర్ టైప్ చేసుకొని సదరు బదిలీలు చేసే అధికారుల వద్దకు తెచ్చేసుకున్నారట. కానీ అడ్డగోలు బదిలీల విషయం మీడియాలో బయట పడటం.. ఇంకా బదిలీలకు ఈనెల 15 వరకూ గడవు ఉంటడంతో విషయం సద్దు మనిగితే అపుడు చూద్దామని అధికారులు ఆ ఫైలు పక్కన పెట్టినట్టు తెలిసింది. 

 ఈ బదిలీల విషయంలో మీడియాలో వ్యతిరేక కథనాలు రాకుండా చూసుకున్నా.. జిల్లా కలెక్టర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోతే తాము మీకు ఆర్ఢర్ ఇవ్వగలమని.. లేదంటే ఇవ్వలేమని సదరు ఉద్యోగినికి బదిలీలు చేసే అధికారులు చెప్పినట్టు తెలిసింది. దానికి అనుగుణంగా బదిలీల వ్యవహారాన్ని మొట్టమొదటి సారిగా బయట పెట్టిన ఈఎన్ఎస్-ఈరోజు మీడియాకి ఎవరెవరి వద్ద నుంచో తీవ్రమైన ఒత్తిడి వస్తోంది.. మీకేం కావాలో చెప్పండి.. కానీ బదిలీ విషయంలో జరుగుతున్న విషయాలపై ఇకపై వార్తలు రాయొద్దు అనేది  ఆ ఒత్తిడి సారాశం. అలా రాయకుండా ఉంటే మీకు కూడా ప్యాకేజీ ఇస్తామని చెప్పటం విశేషం.  కొందరు ప్రైవేటు సిబ్బంది స్వయంగా వచ్చి చర్చలు జరపడం చూస్తుంటే అడ్డదారిలో కోరుకున్న చోటుకి బదిలీ చేయించుకోవడానికి ఏ తరహాలో వ్యూహరచన చేస్తున్నారో అర్ధమవుతుంది. అయితే ప్రస్తుత బదిలీల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై వాస్తవాలు రాయకుండా ఆగే ప్రశక్తి లేదని.. మీరుఇస్తామన్న ప్యాకేజీలు బదిలీలు చేపట్టే  తేడా అధికారులు, మిమ్మల్ని మా దగ్గరకి పంపిన సదరు అక్రమార్గంలో బదిలీలు చేయించుకోవాలనుకున్న ఉద్యోగులకే ఇవ్వాలని ఈఎన్ఎస్-ఈరోజు  తిప్పి పంపేయడంతోపాటు.. ఆ విషయాన్ని కూడా ఈరోజు మరో కథనంగా రాస్తున్నామని వారి ముందే తెగేసి చెప్పాం. తొలుత ఈరోజు-ఈఎన్ఎస్ లో వచ్చినంత మాత్రన ఏం జరుగుతుంది.. 

ఎవరికి చేతనైతే వాళ్లు చేసుకోవాలని సహచర ఉద్యోగుల వద్ద ప్రగల్భాలు పలికి సదరు ఉద్యోగిని, ఆమెకు సహకరించిన వారు ఇపుడు అసలు విషయం బయట పడటం, బదిలీలు చేస్తామన్న అధికారులు కూడా కాస్త వెనుకడుగు వేయడంతో కాళ్బ బేరానికి తన మనిషులను పంపి రాయబారాలు చేయడం ఏమై వుంటుందనేది వార్త చదువున్న మీకు.. బదిలీలు చేసే అధికారులకు తెలియాల్సి వుంది. పంచాయతీ రాజ్ లో జరుగుతున్న బదిలీల విషయంలో వాస్తవాలను మాత్రమే బయటకు తీసుకు రావడానికి ఈఎన్ఎస్-ఈరోజు కట్టుబడి ఉందని. ఈ విషయంలో ఎక్కడా తగ్గేది లేదని.. అంతేకాకుండా ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళుతున్నట్టు రాయబారం నడపడానికి వచ్చిన వారితో చెప్పడంతో వాళ్లు తోకముడిచి వెనుతిరిగారు. రీ-కౌన్సిలింగ్ జరిగి బదిలీలకు అర్హులైన ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ ఈఎన్ఎస్-ఈరోజు తనవంతు భాద్యత నిర్వహిస్తుందని కూడా బల్లగుద్ది మరీ వారికి చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని కూడా ఈఎన్ఎస్-ఈరోజు ప్రతినిధులు ప్రకటించారు.

-రీ-కౌన్సిలింగ్ చేస్తారా..ఆమెనే పక్కన పెడతారా..?
పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ల బదిలీలలో పెద్ద మొత్తంలో చోటు చేసుకున్న అక్రమ వ్యవహారాలన్నీ ఆధారాలతో సహాయ బయటకు రావాలంటే రీ-కౌన్సిలింగ్ చేసి.. ఇప్పటి వరకూ జరిగిన కౌన్సిలింగ్ మొదటి నుంచీ చేపడితేనే బదీలీలు చేపట్టే అధికారులు ప్రభుత్వ జీఓని ఏ విధంగా తొక్కిపెట్టారో తేలిపోతుంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ విచారణ అనంతరం రీ-కౌన్సిలింగ్ చేపడతారా..? లేదంటే సదరు ఉద్యోగిని విషయంలో అంతా బయటకు రావడంతో కేవలం ఆమె అక్రమ బదిలీ ఫైలునే పక్కన పెడతారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.  అంతేకాకుండా అసలు బదిలీకి అవకాశమే లేని ఉద్యోగిని కోసం జోన్-1 బదిలీల్లో ఎస్ఈలు ఎందుకు అంత అత్యుత్సాహం చూపుతున్నారన్న మచ్చ నుంచి కూడా బదిలీలు చేసే అధికారులు బయటపడే అవకాశం కూడా లేకపోలేదు. కాదు కూడదు.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిన తరువాత కావాల్సిన వారికి.. అనుకున్నవారికి ..వారు కోరిన చోటుకి బదిలీలు చేయపోతే ఎలా అనుకుంటే మాత్రం.. కాస్త ఆలస్యమైనా పని జరుగుతుంది. లేదంటే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పక్కగా రీ-కౌన్సిలింగ్ మాత్రమే పంచాయతీరాజ్ అధికారులు చేపట్టాల్సి వుంటుంది. చూడాలి.. ఆమెకోసం అడ్డగోలుగా ఆర్డర్ ఇస్తారా..? లేదంటే రీ-కౌన్సిలింగ్ పెడతారా..? ఆమెను పక్కన పెడతారా..?  అనేది..?!