పంచాయతీరాజ్ లోని సూపరింటెండెంట్ ల అడ్డగోలు బదిలీలకు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అడ్డు కట్ట వేశారు. అర్హత లేకపో యినా కావాల్సిన చోటుకి బదిలీలు చేయడానికి జోన్-1వలోని మూడు జిల్లాల ఎస్ఈలతో కలిసి చక్కబెట్టిన తేడా వ్యవహారానికి కలెక్టర్ ఆదేశా లతో బెడిసికొట్టాయి. పంచాయతీరాజ్ రాజ్ లో జీఓనెంబరు 75కి విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలపై ఈఎన్ఎస్-ఈరోజులు సంయుక్తంగా వరుస కథనాలు ఆధారాలతో సహా ప్రచురించాయి. దీనితో ఆగ్రహం వ్యవక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఇద్దరు ఎస్ఈలని కలెక్టరేట్ కి రప్పించారు. ఏంటి బదిలీల వ్యవహారం.. అసలు సూపరింటెండెంట్ ల బదిలీల్లో ఏం జరుగుతుంది.. రోజూ మీడియాలో దీనికి సంబంధించి ఎందుకు వ్యతిరేక వార్తలు వస్తున్నాయి.. అసలు మీరు బదిలీల్లో ఏం చేశారు.. ఎవరికి అన్యాయం చేస్తున్నారు.. మరెవరికి మేలు చేయడం కోసం ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు.. అసలు జీఓ ప్రకారమే బదిలీలు చేస్తున్నారా.. కావాల్సిన వారికోసం జీఓ నిబంధనలను పక్కన పెట్టేశారా.. ఇప్పటి వరకూ జరిగిన బదిలీలకు సంబంధించిన జీఓ, నిబంధనలపై పూర్తిస్థాయిలో నివేదిక కావాలని ఆదేశించారు. కలెక్టర్ ఆగ్రహంతో అడగటంతో బదిలీ అధికారుల్లో ఒణుకు మొదలైంది. సూపరింటెండెంట్ ల బదిలీల్లో ప్రస్తుతా తాజాపరిస్థితి జోన్-1లో జరుగుతున్న బదిలీల ప్రక్రియపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో.. శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న జివి.కనకవల్లీ కుమారికి అనకాపల్లి జిల్లా బదిలీ చేయడానికి పీఆర్ ఎస్ఈలు మ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం)లు చేసిన కార్యాచరణ మొత్తం ఇపుడు కలెక్టర్ ముందు ఉంచాల్సి వచ్చింది.
బదిలీల్లో ఎస్ఈలు కావాలని చేసిన తేడా వ్యవహారం.. వారికి కావాల్సిన వారికోసం అడ్డగోలుగా చక్కబెట్టిన వైనం ఒక్కసారి తెలుసుకుంటే.. బి.శ్రీనివాసరావు సూపరింటెండెంట్, ఈ.ఈ.పి.ఐ.యూ సదరు అధికారి పాడేరులో ఆరేళ్లు పూర్తి అయ్యాయి. జి. ఓ. ఎమ్.ఎస్.నెం. 75 ప్రకారం ఏజెన్సీ ఏరియాలో రెండేళ్లు పూర్తైన వ్యక్తిని వారి కోరిన చోట బదిలీ చేయమని జి.ఓ.లో ఉన్నది కాని అలా చేయకుండా ఇతనిని పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్ ఇచ్చారు. అది ఏ జీఓ ప్రకారంగా చేశారో పర్యవేక్షక అధికారులు జిల్లా కలెక్టర్ కు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శికి నివేదికలు సమర్పించాల్సి ఉన్నది. ఇక ఆర్.నాగరాజు సూపరింటెండెంటు, డి.పి.ఆర్.ఈ.ఓ ఆఫీస్ అనకాపల్లిలో పనిచేస్తున్న ఇతనని రెండేళ్లు నిండకపోయినా పి.ఆర్.ఐ. డివిజన్ టెక్కలికి బదిలీ చేశారు. ఇతని స్థానంలో సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారిని ఓ ఎమ్మెల్యే ఇచ్చిన శిఫారసు లేఖ ఆధారంగా చూపి అనకాపల్లికి బదిలీచేసేశారు. అంటే ఇక్కడ నిభందనలు ఏమీ పరిగణలోనికి తీసుకోలేదు..
ఈమెను బదిలీ చేయడానికి కానీ ఈమెకు అనుకూలంగా అనకాపల్లి జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా సిఫారసు లేఖా ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్టుగా అధికారులను మభ్య పెట్టి అమాయకులైన ఆర్. నాగరాజు ని ఆమె స్థానంలోనికి పంపేశారు. ఇక్కడ పెద్ద మొత్తంలో చేతులు మారిన కారంణంగానే లేని ఎమ్మెల్యే సిఫారసు లేఖను బూచిగా చూపించినట్టు తేటతెల్లం అయ్యింది. ఈయనను కె.ఎస్.కె.శోభా రాణి స్థానంలో బదిలీ చేశారు. ఈమె పై ఎ.సి.బి. కేసుతోపాటు శాఖాపరమైన కేసులు కూడా ఉండటం విశేషం. బదిలీ అయిన స్థానానికి వెళ్లకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామని కూడా సదరు అధికారిని బెదిరించడం కొసమెరుపు. ఎస్.రమేష్ ఈయన జూనియర్ అసిస్టెంట్ పాడేరు డివిజన్ లో ఏడేళ్లు సర్వీసు పూర్తిచేసుకొని బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే.. జీఓ ప్రకారం కోరిన ప్రదేశానికి బదిలీ చేయాల్సి ఉండగా ఇతనని కూడా పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్ చేసేశారు. ప్రభుత్వం బదిలీల జీఓ ఒక్క శాతం కూడా పరిగణలోనికి తీసుకోకుండా అంతా మా ఇష్టం అన్నరీతిలోనే బదిలీలను చేయి తడుపు వ్యవహారంలో చక్కబెట్టేశారు.
మరో విశేషం ఏంటంటే సదరు సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారి శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉండగా..విశాఖపట్నంలో కూడా ఓ.డి బేసిస్ మీద గత రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడే ఓడీలో పనిచేస్తున్న అధికారి బదిలీల్లో ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సి ఉంది. లేదా జీఓ ప్రకారం కోరుకున్న అధికారుల బదిలీలు జరగగా ఖాళీ ఉన్న ప్రదేశాల్లోకి బదిలీపై వెళ్లాలి. కానీ ఇక్కడకి దగ్గర్లోని అనకాపల్లికి చాలా చాకచక్యంగా బదిలీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం జీఓ ఈ అధికారిణి బదిలీ విషయంలో చేతి వ్యవహారం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. చక్రం తిప్పే నేర్పు ఉంటే ఏ విధంగా నైనా బదిలీలు చేయించుకోవచ్చునని.. దానికోసం బదిలీలు చేసే అధికారులు కూడా వారికి అనుకూలంగానే పనిచేస్తార విషయం పంచాయతీరాజ్ శాఖలోని బదిలీల్లో చాలా క్లియర్ గా కనిపించింది. జి.గంగారామ్ సూపరింటెండెంట్ మూడు నెలల సర్వీసు చేసిన వ్యక్తిని అడ్డగోలుగా విజయనగరానికి బదిలీచేసేశారు. ఇలా ఒకటి కాదు రెండు ఇష్టానుసారం బదిలీలు చేశారు అధికారులు. వీటన్నింటికీ బదిలీల ఉత్తర్వులే సాక్షిగా నిలుస్తున్నాయి. ఈ విషయాలను బయటకు రానీయకుండా ఉండేందుకుందు, ఒక వేళ తమపై మీడియాలో కథనాలు వచ్చినా వెనుక నుంచి రక్షించేందుకు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని.. ఎవరేం చేసుకున్నా పర్లేదంటూ హుకుం కూడా జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈమె విషయంలో బదిలీ అధికారులు ఏం చేశారో.. అవన్నీ ఇపుడు కలెక్టర్ నివేదికలో అక్షరం పొల్లుపోకుండా సమర్పించాల్సి వుంటుంది. అదే జరిగితే ఇక్కడ బదిలీ అధికారులైన ఎస్ఈలు జిఓనెంబరు 75కి పూర్తిగా విరుద్ధంగా చేసినట్టుగా కలెక్టర్ కోరిన నివేదికలో ఒప్పుకున్నట్టు అవుతుంది.
అపుడు ఖచ్చితంగా కలెక్టర్ కూడా ఇప్పటి వరకూ జరిగిన బదిలీల ప్రక్రియ నిలుపుదలచేసి.. అర్హులైన ఉద్యోగులకు బదిలీలు చేయాలని ఆదేశించాలి జీఓలో ఉన్న నిబంధనల ప్రకారం. కానీ ఇపుడు జోన్-1లోని ఎస్ఈలు కలెక్టర్ కోరిన నివేదికలో మళ్లీ సదరు జివి కనకవల్లీ కుమారి విషయాన్ని గానీ.. ఇద్దరు ఉద్యోగులకు రిటెన్షన్ ఇచ్చిన విషయాన్ని గాని పొందుపరచకపోతే అన్యాయం జరిగిన ఉద్యోగులంతా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారట. అదే జరిగితే అపుడు బదిలీల చేసిన ఎస్ఈలు, జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్ లతో సహా కోర్టుకి హాజరు అయ్యే అవకాశం వుంటుంది. కానీ ఒక సూపరింటెండెంట్ కోసం ఎస్ఈలు నివేదికలు మార్చి కలెక్టర్ బురిడీ కొట్టించే సాహసం చేస్తారా లేదా అన్నది ఇపుడుఆశక్తి కరంగా మారింది. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ బదిలీల కోసం పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడంతోనే కొందరు ఉద్యోగుల కోసం బదిలీలు చేసే అధికారులు నేటికీ వారిని వెనుకేసుకు వస్తూ..వారికి న్యాయం చేసి.. మిగిలిన వారికి అన్యాయం చేయాలని చూస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఈఎన్ఎస్-ఈరోజులు ఎప్పటికప్పుడు బయటపెట్టడంతో.. తొలుత లైట్ తీసుకున్న అధికారులు నేరుగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి నివేదికలు కోరడంలో ఎస్ఈలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికైనా ఎస్ఈలు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆమెను పక్కన పెట్టి.. అర్హులకు జిఓనెంబరు 75 ప్రకారం న్యాయం చేస్తారా..? లేదంటే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఉత్తర్వులు ఇస్తారా.. అసలు జిల్లా కలెక్టర్ నివేదిక తరువాత మొత్తం సీన్ మారుతుందా లేదా అనేది ఆశక్తి కరంగా మారింది...!