ఆమె కోసం రాత్రికి రాత్రే నోట్ పైల్ పై సంతకం..!


Ens Balu
195
visakhapatnam
2024-09-04 15:50:15

కాదేదీ పంచాయతీ రాజ్ ఎస్ఈలకి  ఆఖరి రోజు కూడా అక్రమ ఆదాయానికి, అడ్డగోలు వ్యవహారానికి రాచమార్గం.. ఏంటి మీకు డౌట్ వస్తుంది కదూ ఇది పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల తేడా బదీలీల కోసమేనని.. నిజమేనండి అదే.. అర్హత లేని ఉద్యోగిని జివి.కనకవల్లీ కుమారిని శ్రీకాళుం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకు బదిలీచేసేస్తున్నట్టు రిటైర్ అవ్వడానికి ముందురోజు రాత్రి విశాఖపట్నం పిఆర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్  బిఎస్.రవీంధ్ర బదిలీలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసేశారు. అదీ ఎందుకంటే సూపరింటెం డెంట్ల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈఎన్ఎస్-ఈరోజు సంయుక్తంగా అడ్డగోలు వ్యవహారాన్ని బయటపెట్టాయి. దీనితో ఎక్కడ తన బదిలీ ఆగిపోతుందోనని భయ పడిన జివి.కనవల్లీ కుమారి ఎస్ఈ రిటైర్ మెంటుకి ముందురోజే నోట్ ఫైల్ పై సంతకం చేయించే సుకున్నారు.. దీనితో భారీ మొత్తంలో నగదు చేతులు మారిన కారణంగానే అసలు బదిలీకి అర్హత లేకపోయినా ఈమెకోసం సంతకాలు చేసినట్టుగా రుజువైంది. పక్కా పథకం ప్రకారం ముందుగానే సంతకాల వ్యవహారాన్ని చక్కబెట్టేశారన్నమాట. అంతేకాకుండా 31వ తేది నుంచి నేటి వరకూ బదిలీల విషయంలో జరుగుతున్న అక్రమాలపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నా.. ఇన్చార్జి ఎస్ఈగా ఉన్న కె.శ్రీనావాసరావు సైతం ఈ వ్యవహారంపై సదరు ఉద్యోగిని వివరణ కోరలేదు సరికదా.. రిటైర్ అయి వెళ్లిపోయిన ఎస్ఈ బిఎస్.రవీంధ్ర సంతకం చేసేసిన నోట్ ఫైల్ ను తాను తిరిగి మార్చలేనని భీష్మించుకు కూర్చుకున్నారు. 

వాస్తవానికి జీఓఎంఎస్ నెంబరు 75కి విరుద్ధంగా జరిగిన ఈ బదిలీలను జోన్-1 పరిధిలోని ఎస్ఈలు ఏ ఒక్కరైనా వ్యతిరేకించాల్సి వుంది. నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వుంది. లేదంటే ఈ విషయాన్న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఎవరూ వ్యతిరేకించకపోగా.. ఆమెకోసం మొత్తం వ్యవహారం మొత్తం సాఫీగానే సాగిపోయిందని.. బదిలీ ఉత్తర్వుల కోసం 13న రావాలని ఉద్యోగులకు అనధికార ఆదేశాలు కూడా జారీ చేశారు. వాస్తవానికి బదిలీలు చేసే సమయంలో ఉద్యోగులకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, శాసన సభ స్పీకర్ ఇలా ఎవరు సిఫారసు లేఖలు ఇచ్చినా సదరు నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగులకు మాత్రమే బదిలీలు చేసే అధికారులు పరిగణలోనికి తీసుకోవాల్సి వుంది. కానీ అప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ.. ఓడిపై రెండేళ్లు విశాఖలోనే పనిచేస్తూ.. మళ్లీ అనకాపల్లిజిల్లా బదిలీకోసం ప్రక్కనియోజవకర్గం ఎమ్మెల్యే లేఖతో ఈమె తన బదిలీని రిటైర్ అయిన ఎస్ఈ  బిఎస్.రవీంధ్ర సంతకాలు తీసేసుకోగలిగారు. జోన్-1 పరిధిలో బదిలీలు చేసే సమయంలో ముగ్గురు ఎస్ఈలు అనుకునే ముందుగానే సంతకాలు చేసేశారు. అయితే ఈ అక్రమ బదిలీలపై 30న ‘ఈఎన్ఎస్-ఈరోజు’ కథనాలు బయటపడటంతోపాటు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు వెళ్లినా.. మిగిలిన ఇద్దురు ఎస్ఈలు ఈమె బదిలీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. 

సూపరింటెండెంట్ల అడ్డగోలు బదిలీలపై మీడియాలో వచ్చిన కథనాలపై విశాఖ జిల్లా కలెక్టర్ నివేధిక కోరిన తరువాత కూడా నేటికీ అక్రమాల వ్యవహారాన్ని మాత్రం జిల్లా కలెక్టర్ ముందు ఉంచలేదు. కలెక్టర్ వివరణ కోరినపుడు కూడా బదిలీలను అంతా జీఓ ప్రకారమే చేసుకొని మాత్రమే వచ్చామని జిల్లా కలెక్టర్ ను కూడా బురిడీ కొట్టించారంటే ఇక్కడ ఎస్ఈలు ఏ స్థాయిలో లాలూచీ పడ్డారో అర్ధం చేసుకోవచ్చు.  వాస్తవానికి అర్హత లేని ఉద్యోగులను బదిలీలకు పరిగణలోనికి తీసుకోవడమే తప్పు.. అందునా ఈ విషయం మీడియాలో బహిర్గతం అయిన తరువాత కూడా రిటైర్ కావడానికి ఒక్కరోజు ముందుగా ఈమె బదిలీ కోసం నోట్ పైల్ పై ముగ్గురు ఎస్ఈలు సంతకాలు చేయడం రెండో తప్పు.. ఈమె కోసం ఇతర జిల్లాల్లోని సూపరింటెండెంట్లకు బదిలీ అర్హత ఉన్నా కూడా జిఓలోని నిబంధనలను పక్కనపెట్ట  వారిని కూడా  రిటెన్షన్ చేయడం మూడో తప్పు.. ముగ్గురు ఎస్ఈలు చేసిన నోట్ ఫైల్ విషయం నేటికీ కలెక్టర్ ముందు ఉంచకపోవడం  నాల్గవ తప్పు. ఇవన్నీ ఆగస్టు 31 నుంచి నేటి వరకూ మీడియాలో కథనాలు వస్తున్నా వాటిని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం ఐదవ తప్పు ఇలా.. ఒక ఉద్యోగిని కోసం ఎస్ఈలు తప్పులు మీద తప్పులు చేస్తున్నారంటే.. ఏ స్థాయిలో ఆర్దిక లావాదేవీలు.. ప్రభుత్వ జీఓల ఉల్లంగన.. నియోజవర్గాల ఎమ్మెల్యేల లేఖలు అపహాస్యం అయ్యారో మూడు జిల్లాల కలెక్టర్లు గుర్తించాల్సి ఉంది. 

ఇంత పెద్దస్థాయిలో అక్రమాలు జరిగిన పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల బదిలీలపై విశాఖ జిల్లా కలెక్టర్ రీ-కౌన్సిలింగ్ ఆదేశిస్తే తప్పా అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి లేదు. ఇదే విషయమై ఈఎన్ఎస్-ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం జరిగిన బదిలీలపై ఎస్ఈలను వివరణ కోరామని.. నివేధికలు రావాల్సి ఉందని.. వారిచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోప్రక్క తమ నియోజవర్గంలోని ఉద్యోగుల బదిలీల కోసం ఇచ్చిన సిఫారసు లేఖలు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ సైతం గుర్రుగా ఉన్నారు. ఇదేనా జిల్లా జిల్లాలో ప్రజాప్రతినిధులకు జిల్లా యంత్రాంగం ఇచ్చే గౌరవం అంటూ మండి పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి రావాలన్నా.. బాధితులకు న్యాయం జరగాలన్నా రీ-కౌన్సిలింగ్ పెడితే న్యాయం జరగడంతోపాటు, ఎస్ఈలు చేసిన అడ్డగోలు వ్యవహారాలు బయట పడతాయని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా రేపో, మాపో డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా ఈ అక్రమ బదిలీలపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందనేది..!