అడ్డగోలు బదిలీలపై ఆర్టీఐ దాఖలు..!


Ens Balu
331
visakhapatnam
2024-09-05 07:42:38

పంచాయతీరాజ్ శాఖలోని జోన్-1(విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) సూపరింటెండెంట్ల బదిలీల్లో జరుగుతున్న అక్రమాలు ఆధా రాలతో సహా నిగ్గుతేల్చేందుకు.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జిల్లా ప్రభుత్వశాఖల చైర్మన్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తు దాఖలైంది. అర్హత లేకపోయినా కాసులకు కక్కుర్తి పడిన బదిలీ అధికారులు జిఓనెంబరు 75లోని ప్రధాన నిబంధ నలను పక్కన పెట్టి మరీ సూపరింటెండెండ్లను అడ్డగోలుగా బదిలీ చేయడానికి రంగం సిద్దం చేసేసుకున్నారు. ఈ విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు ఆధారాలతో సహా బయట పెట్టడంతో విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేది కలు ఇవ్వాలని ఇద్దరు ఎస్ఈలను వివరణ కోరిన సమయంలోనూ వారు అంతా సక్రమంగా జరిగిందంటూ జిల్లా కలెక్టర్ ను మాటలతోనే బురిడీ కొట్టించారు. ఈ బదిలీల్లో జివికనకవల్లీ కుమారి అనే సూపరింటెండెంట్ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ.. రెండేళ్లుగా ఓడీపై విశాఖలోనే పనిచేస్తున్నారు. 

శాస్తవానికి సదరు ఉద్యోగినికి బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత 2024 పంచాయతీరాజ్ శాఖలోని జిఓఎంఎస్ నెంబరు -75 ప్రకారం అర్హత లేదు. కానీ ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన విశాఖ పంచాయతీరాజ్ సర్కిల్ ఎస్ఈ బిఎస్.రవీంధ్ర తాను రిటైర్ కావడానికి ఒక్కరోజు ముందు గానే ఆమె బదిలీకి సంబంధించిన నోట్ పైలుపై సంతకం చేసేశారు. దీనితో మిగిలిర రెండు జిల్లాల ఎస్ఈలు కూడా తలూపారు. ఇదంతా అక్రమమని బదిలీల్లో తమకు అన్యాయం చేసి.. ఆమెకు మాత్రం అడ్డదారిలో న్యాయం చేశారని అర్హులైన ఉద్యోగులు డిప్యూటీ సీఎం కార్యాలయానికి మీడియాకి ఫిర్యాదులు చేశారు.  విషయం బయట పడటంతో విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంత జరిగినా పెద్ద ఎత్తున బదిలీలకు నగదు చేతులు మారడంతో రిటైర్ అయిన ఎస్ఈ సంతకాలు చేసిన ఫైలు, వ్యవహారం పై తానేమీ చేయలేనని ప్రస్తుత ఇన్చార్జి ఎస్ఈ కె.శ్రీనివాసరావు సదరు ఉద్యోగినికి న్యాయం అడ్డదారిలో అనకాపల్లి జిల్లాకి బదిలీ చేయడం కోసం చక చకా ఫైళ్లు కదిపేశారు. అయితే పంచాయతీరాజ్ లోని బదిలీలు చేపట్టే ఎస్ఈల అడ్డగోలు వ్యవహారాన్ని ఆధారాలతో బయటకు తీసేందుకు ఈ బదిలీ వ్యహారానికి సంబంధించిన 11 కీలకమైన అంశాలకు సంబంధించి సమాచారహక్కు చట్టం దరఖాస్తు జిల్లా ప్రభుత్వశాఖల చైర్మన్, విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయంలో దాఖలైంది. 

ఈ దరఖాస్తుకి సంబంధించి సమాచారం రావడానికి నెలరోజు సమయం పడుతుంది. అయితే ఈ 15లోగా బదిలీల ప్రక్రియ మొత్తం పూర్తయి పోతుంది. ఈ బదిలీల్లో అక్రమార్కులను బదిలీలు చేసేసినా.. సమాచార హక్కు చట్టం క్రింద దాఖలైన దరఖాస్తుకి సమాచారం లిఖిత పూర్వకంగా ఇస్తే.. అర్హులైన వారికి కావాలనే అన్యాయం చేస్తే.. రిటెన్షన్ ఇచ్చినట్టు.. బదిలీలు చేపట్టిన వివరాలతో కూడి సమాచారం ఇవ్వా ల్సి వస్తుంది. అలా ఇచ్చిన ఆధారాలతో బాధితులు కోర్టును ఆశ్రయిస్తే ఉద్దేశ్య పూర్వకంగానే బదిలీ చేసే అధికారులు వారికి కావాల్సిన ఉద్యోగులకు అర్హత లేకపోయినా బదిలీలు చేపట్టినట్టు ఆధారాలతో సహా రుజువవుతుంది. దానితో జిల్లాశాఖ చైర్మన్, జిల్లా కలెక్టర్ తో పాటు, బదిలీలు చేసే అధికారులు కూడా కోర్టుకి సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఖచ్చితంగా పరిపాలనా పరమైన అంశం కావడంతో ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్ఈలు కావాలని, జిఓనెంబరు-75 ఉల్లంఘించినట్టు తేలినా..ఎస్ఈలపై చర్యలు తీసుకోని అధికారిగా కూడా ముద్ర పడే అకకాశాలున్నాయి. అందులోనూ ఈ బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, అసెంబ్లీ స్పీకర్ఇచ్చిన సిఫారసు లేఖలకు కూడా వక్రీకరించి చేపట్టిన బదిలీల వ్యవహారం కావడంతో మొత్తం వ్యవహారం రచ్చ రచ్చ అయ్యే అవకాలున్నాయి.

 ఈ మొత్తం వ్యవహారం సూపరిటెండెంట్ జివి.కనకవల్లీ కుమారి కోసమే చేసినట్టుగా ఆర్టీఐలో కోరిన సమాచారంతోనే రుజువవుతుంది. ప్రస్తు తానికి బదిలీల ప్రక్రియ ఈనెల 15 వరకూ ఉన్నప్పటికీ.. 13నే నోట్ ఫైల్ పై సంతకాలు పూర్తయిన వారికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు ఇస్తామని ఇప్ప టికే కబుర్లు పెట్టేశారు ఎస్ఈ కార్యాలయం సిబ్బంది. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ ఈ అక్రమ బదిలీల వ్యవహారాన్ని పూర్దిగా రద్దు చేయా లంటే రీ-కౌన్సిలింగ్ తప్పా మరో మార్గం లేదు. రీ-కౌన్సిలింగ్ చేపడితే అర్హులకు న్యాయం జరిగి.. అనర్హులకు అసలు బదిలీలకు దరఖాస్తు చేసు కునే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇంకా పంచాయతీరాజ్ ఎస్ఈలు ఈ మొత్తం బదిలీల ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ కోరిన నివేదికలు ఇవ్వనందున.. కలెక్టర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది..!