పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల బదిలీల విషయంలో జోన్-1 ఎస్ఈలు(విశాఖ ఎస్ఈ కె.శ్రీనివాసరావు) విశాఖ జిల్లా కలెక్టర్ నే బురిడీ కొట్టించారు. జిఓఎంఎస్ నెంబరు 75కి విరుద్ధంగా బదిలీలు జరుగుతున్నాయని.. ఈరోజు-ఈఎన్ఎస్ లు ఆధారాలతో సహా కథనాలు ప్రచురిం చాయి. దానిపై స్పందించిన విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జోన్-1 యూనిట్ ఆఫీసర్ ను వివరణ కోరగా.. అంతా బాగానే జరుగుతున్నా యని.. పత్రికల్లో వచ్చిన కథనాలు ఆధారాలు లేవని ఉమ్ముతడిగా సమాధానం ఇచ్చారు. అయితే ఇదే విషయాన్ని గురువారం ఈరోజు ప్రధాన ప్రతినిధి జిల్లా కలెక్టర్ వద్ద స్వయంగా ప్రస్తావించారు. అంతేకాకుండా సూపరింటెండెంట్ల బదిలీల్లో జోన్-1 ఎస్ఈలు ఏవిధంగా వ్యవహరిస్తు న్నారో కూడా పూసగుచ్చినట్టు కలెక్టర్ కు వివరించారు. మరీ ముఖ్యంగా సూపరింటెండెంట్ ల బదిలీల్లో ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వ ప్రయోజనాలను ఉపయోగించుకొని శ్రీకాకుళం జిల్లాలో సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తూ.. ఆరోగ్యసమస్యలు, మహిళా, హ్యుమారిటే యన్ తదితర కారణాలతో జివికనవల్లీ కుమారినే సూపరింటెండెంట్ ఓడిపై విధులు చేస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.
దానికి సంబంధించిన ఆధారాలను కూడా జిల్లా కలెక్టర్ ఓడీ ఆర్డర్లు కూడా చూపించడంతో అసలు తన దృష్టికి ఓడిపై విశాఖలో విధులు నిర్వ హిస్తున్న అంశం ఎస్ఈలు తన దృష్టికి తీసుకు రాలేదన్నారు. 2024లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకపోయినా.. దరఖా స్తు చేసుకున్నారని.. సదరు నోట్ ఫైల్ పై ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఈ బిఎస్.రవీంధ్ర సంతకం చేసిన వాటినే ఫైనల్ చేస్తూ నేడు( సెప్టెంబరు 13న) ఆర్డర్లు కూడా ఇవ్వడానికి సిద్దపడిపోతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో అసలు నోట్ ఫైల్ పై తన అప్రూవల్ లేకుండా ఏ విధంగా బదిలీ చేస్తారని కలెక్టర్ సమాధాన మిచ్చారు. ఈ విషయాన్ని తాను స్వయంగా జోన్-1 బదిలీల అధికారి అయిన ఎస్ఈ లని పిలిపించి మాట్లాడతానని కూడా చెప్పారు. బదిలీల విషయంలో తేడాలు జరుగుతున్నాయని ఎస్ఈని వివరణ ఇవ్వమంటే ఏదో ఇచ్చా రు కానీ పూర్తిస్థాయి సమాచారం ఇవ్వలేదని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. దానితో ఈరోజు ప్రతినిధి మాట్లాడుతూ.. జిఓఎంఎస్ నెంబరు-75కి విరుద్దంగా జరిగిన బదిలీల ప్రక్రియపై ఏవిధమై చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. తొలుత ఎస్ఈతో మాట్లాడతానని.. ఇప్పటికే ప్రభు త్వం బదిలీలకు గడువు పెంచిన నందున.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం బదిలీలు జరిగేలా చూస్తామని చెప్పారు.
ఒక ఉద్యోగి పదే పదే తనకు అనుకూలంగా ప్రభుత్వ ప్రయోజనాలను తన బదిలీల కోసం ఎలా వినియోగించుకుంటారని.. ఇలా చేయడం వలన మిగిలిన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని కూడా కలెక్టర్ కు వివరించడంతో ఈ మొత్తం వ్యవహరంపై విచారణ చేయిస్తామని కూడా చెప్పారు. దీనితో నేడు నేరుగా బదిలీల ఉత్తర్వులు తీసేసుకుంటానని.. ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నవారికి జిల్లా కలెక్టర్ ఆదేశం అడ్డుకట్ట పడినట్టు అయ్యింది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై సమాచారహక్కు చట్టం దరఖాస్తు కూడా దాఖలు కావడంతో దానికి కూడా పంచాయతీరాజ్ జోన్-1 అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఒక వేళ ఇప్పుడు సమాచారం ఇవ్వకుండా బదిలీలు జరిగిపోయిన తరువాత సమాచారం ఇచ్చినా.. వాస్తవాలు, చేసిన తప్పులు బయటపడినపుడు జిల్లా కలెక్టర్ ను కావాలనే పంచాయ తీరాజ్ ఎస్ఈలు సూపరింటెండెంట్ జివి. కనవల్లీ కుమారికి ప్రయోజనం చేకూర్చడానికి ప్రజాప్రతినిధిలు ఇచ్చిన సిఫారసు లేఖలు కూడా పక్కనపెట్టి నడిపించిన కథ మొత్తం బయటకు వస్తుంది.
ఇప్పటికే పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల బదిలీల విషయంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాన్ని ఈఎన్ఎస్-ఈరోజు మొత్తం బయట పెట్టింది. అపుడు సమాచార హక్కు చట్టం ద్వారా సమాధానం వస్తే అధికారులే ఈ బదిలీల విషయంలో అర్హత లేనివారికి కూడా బదిలీలకు అవకాశం కల్పించారని రుజువు అవుతుంది. దానితో జిల్లా కలెక్టర్ ను ఒక ఉద్యోగిని కోసం బురిడీ కొట్టించి మరీ బదిలీలు చేశారని వారంతట వారే లిఖిత పూర్వకంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ నోట్ ఫైల్ అప్రూవల్ కూడా లేకుం డా మొత్తం వ్యవహారం తమ అనుకూలితల కోసం పాత ఎస్ఈ సంతకాన్ని బూచీగా చూపి కథ నడిపించేద్దామనుకున్న విశాఖపట్నం ఎస్ఈ కె.శ్రీవాసరావు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఆమెకోసం అనకాపల్లి ఎమ్మెల్యే కాళ్లావేళ్లా పట్టుకొనైనా సిఫారసు లేఖ తీసుకొస్తానని.. ఆమెకు అనకాపల్లి బదిలీ చేయడానికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ కూడా తయారు చేయాలని సిబ్బందికి సూచించారట. అయితే ఇక్కడ జోన్-1 యూనిట్ ఆఫీసర్, ఎస్ఈ మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాలు, ప్రభుత్వ నిబంధనల మేరకే బదిలీలు చేయడానికి సిద్దపడినట్టు సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో విశాఖ ఎస్ఈకి గొంతులో పచ్చి వెలక్కా య్ పడ్డట్టు అయ్యింది. మొన్నటి వరకూ నియోజకవర్గానికి సంబంధం లేని ప్రజా ప్రతినిధి సిఫారసు లేఖను అడ్డం పెట్టంకొని కొన్ని ఎలాగైనా బదిలీచేయాలని చూస్తే.. సదరు నియోజకవర్గం నుంచి లేఖలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు బదిలీ అధికారులకు ఫోన్లు చేయడంతో ఆ విషయా న్ని పక్కన పెట్టేశారు.
ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం బదిలీ చేయాలంటే వీలుపడదని.. మహిళా ఉద్యోగి, ఆరోగ్య సమస్యలు, మానవీయ కోణాన్ని బూచిగా చూపి బదిలీ చేయాలని చూస్తే.. ఆ ప్రయోజాన్ని కూడా సదరు సూపరింటెండెంట్ జివి.కనవల్లీ కుమారి ప్రస్తుతం వినియోగించేసుకొని శ్రీకాకుళం ఉద్యోగాన్ని విశాఖ పంచాయతీరాజ్ లో చేస్తున్నారు. ఇపుడు ఆ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి మీడియా తీసుకెళ్లడంతో ఒక ఉద్యోగిని ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నిసార్లు అధికారులు ఆమెకు అనుకూలంగా వ్యవహరిస్తారని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అంటే ఇక్కడ ఏ విధంగానైనా సదరు ఉద్యోగిని కోరుకున్న చోటుకి బదిలీ చేయాలన్నది జోన్-1 పంచాయతీరాజ్ ఎస్ఈలలో విశాఖపట్నం ఎస్ఈకి అత్యు త్సాహం ప్రదర్శిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఇంత మొండిగా ప్రభుత్వ జిఓని కూడా పక్కన పెట్టి వ్యవహరిస్తున్నారంటే ఏ స్థాయిలో మనీ లాభీయింగ్ జరిగిందనేది స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. పైగా ఎన్నికారణాలు, లోపాలు బయటపెట్టినా ఎలాగైనా బదిలీ చేయడానికే ఎస్ఈలు చూపించే అత్యత్సాహానికి జిల్లా కలెక్టర్ మలి విచారణ అడ్డుకట్ట వేయనున్నది. చూడాలి.. జోన్-1 లోని, విశాఖ ఎస్ఈ కె.శ్రీనివాస్ లు ఈమె కోసం మరోసారి విశాఖ జిల్లా కలెక్టర్ ను ఏ విధంగా ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తారో.. ఏ ప్రభుత్వ ప్రయోజనాన్ని ఆమె బదిలీకోసం విని యోగిస్తారనేది..!