ఆ.. సూపరింటెండెంట్ బదిలీ కోసం ఎస్ఈ అష్ట కష్టాలు


Ens Balu
45
visakhapatnam
2024-09-24 02:31:06

 విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం (జోన్-1) సూపరింటెండెంట్ల బదిలీల్లో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారంపై విశాఖ మీడియాలో వచ్చిన కథనాలు కూడా డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. ముఖ్యంగా శ్రీకాకుళం జాల్లాలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జి.కనవల్లీ కుమారి ప్రస్తుతం ఓడీపై విశాఖజిల్లాలోనే పనిచేస్తున్నారు. ఈమెకు 2024 పంచాయతీరాజ్ బదిలీల్లో జీఓఎంఎస్ నెంబరు -75 నిబంధనల ప్రకారం బదిలీకి దరఖాస్తుచేసుకునే అర్హత లేకపోయినా.. ఆమె బదిలీకి దరఖాస్తు చేసుకోవడంతో ఇటీవలే రిటైర్ అయిన ఎస్ఈ, ప్రస్తుత ఇన్చార్జి ఎస్ఈలు ఆమెను కోరుకున్న చోటుకి బదిలీలు చేయడానికి అన్ని దారులు వెతుకుతున్న విషయంపై వచ్చిన మీడియా కథనాలు కూడా డిప్యూటీ సీఎం కార్యాలయాలకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఇటు విశాఖజిల్లా కలెక్టర్ వద్ద ఆమె విశాఖలోనే  ఓడిపై విధులు నిర్వహిస్తున్న విషయాన్ని, సదురు ఆర్ఢర్ ను దాచిపెట్టి ప్రస్తుత ఎస్ఈ కనకవల్లీ కుమారిని బదిలీచేయడానికి రంగం సిద్దం చేయడంతో ఈ విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ లు స్వయంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఇఎన్సీ) బాలూనాయక్ దృష్టికి కూడా ఈఎన్ఎస్-ఈరోజు ప్రతినిధి స్వయంగా తీసుకెళ్లారు. 

దానితో స్పందించిన విశాఖ జిల్లా కలెక్టర్ ఆమె బదిలీపై ఎస్ఈల అత్యుత్సాహం, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారంపై విచారణ చేస్తామని ప్రకటించగా.. ఇఎన్సీ మాత్రం జీఓనెంబరు 75కి విరుద్ధంగా బదిలీలు చేపడితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇదే  విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు నేరుగా ప్రస్తుతం బదిలీలు చేపడుతున్న జోన్-1 ఇన్చార్జి ఎస్ఈ ఎం.శ్రీనివాసరావుని  ఇప్పటికే ఓడిపై పనిచేస్తూ.. మళ్లీ బదిలీలకు నిబంధనలకు విరుద్దుంగా దరఖాస్తు చేసుకున్న సూపరింటెండెంట్ ను బదిలీచేయడానికి నిబంధనలు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని, ఎవరి సహకారంతో ఆమెను ప్రభుత్వ జీఓకి వ్యతిరేకంగా బదిలీ చేస్తున్నారని.. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కోరగా..  ఈ విషయమై తాను తర్వాత మాట్లాడతానని జవాబు దాటవేశారు. అంతేకాకుండా ఈ బదిలీలపై జరుగుతున్న అక్రమాలకు సంబంధించి సమాచార హక్కుచట్టం దాఖలైన విషయాన్ని కూడా బయట పెట్టడానికి ఆయన అంగీకరించలేదు. 

ఈమె బదిలీ విషయంలో ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఈ, ప్రస్తుత ఇన్చార్జి ఎస్ఈలు పనిగట్టుకొని మరీ కష్టపడటం. ఇటీవలే రిటైర్ అయిన ఎస్ఈ, కొందరు డిఈల, ఈఈల సహకారంతో సిఫారసు లేఖల కోసం ప్రయత్నాలు చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది.  కాగా తనకు క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సదరు సూపరిటెండెంట్ కి సిఫారసు చేస్తూ ఇవే కారణాలతో బదిలీ చేయాలని చూస్తున్నారని కూడా తెలుస్తుంది. విశేషం ఏంటంటే ఈసారి బదిలీల్లో అనారోగ్య సమస్యలపై బదిలీలు చేసుకోవడానికి వీలు లేకుండా నిబంధనలు కఠినతరం చేసినా.. అదే కారణాలు చూపించడం.. బదిలీలు చేసే అధికారులు తనకు వత్తాసు పకడంతో తానే తన ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ను ముందుస్తుగానే తయారు చేసేసుకొని.. జిల్లా కలెక్టర్ నోట్ ఫైల్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే సూపరింటెండెంట్ల బదిలీల్లో జరుగుతున్న అక్రమాలపై సమాచారహక్కుచట్టం దరఖాస్తు దాఖలైనందును వచ్చే సమాచారం.. సదరు ఉద్యోగిని ఆరోగ్య సమస్యలపై నిజంగానే వైద్యాధికారులతో విచారణ చేపడితే దానికి కూడా ఈమెను ఎలాగైనా బదిలీ చేసేయాలని చూస్తున్న ఎస్ఈలు లిఖిత పూర్వకంగా చేసిన తప్పులను ఒప్పుకోవాల్సి వస్తుంది..!