టూరిజం అండ్ పీస్ పై విశాఖజిల్లా పర్యాటకశాఖ పోటీలు
Ens Balu
5
visakhapatnam
2024-09-24 15:58:33
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో "టూరిజం అండ్ పీస్" అనే అంశంతో యువ టూరిజం క్లబ్ ద్వారా స్కూల్స్ కాలేజీల్లోలో ఎస్సే రైటింగ్ ఆర్ట్ పెయింటింగ్ కాంపిటీషన్స్ ను నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెకలెక్టర్ హరేంధిరప్రసాద్ పేర్కొ న్నారు. ఈ మేరకు మంగళవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మూడు అంశాల మీద ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్, చైర్మన్ డిస్టిక్ టూరిజం కౌన్సిల్ ద సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో.. ఈ ఏడాది వరల్డ్ టూరిజం డే థీమ్ తో 26న ఉదయం ఆరు గంటలకు హెరిటేజ్ వాక్ కూడా నిర్వహి స్తున్నామన్నారు. అదేవిధంగా నగరంలోని ముఖ్య మైన కూడళ్ళలో విశాఖలోని అందమైన పర్యాటక ప్రాంతాలు, ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలతో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఫోటో గ్రఫీ పోటీలో ఎన్నికైన వారికి 27న వుడా చిల్డ్రన్స్ ఎరీనా లో జరగనున్న వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్లో బహుమతులు అందజేయనున్నట్టు చెప్పారు. ఈ పోటీల ద్వారా యువతకు టూరిజంపై అవగాహన, ఆశక్తి పెంపొందించాలనే లక్ష్యంతోనే చేపట్టే ఈ కార్యాక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. జిల్లా పర్యాటకశాఖ నిర్వహిం చే ఈ పోటీల్లో పాఠశాల, కళాశాల విద్యార్దులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. మరిన్ని వివరాల కోసం జిల్లా పర్యాటక అధికా రి జ్ఞానవేణి 9494918484 చరవాణిలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.