ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు నిర్మించే దర్శక నిర్మాతలకు విశాఖ పర్యాటకం ఒక స్వర్గదామమని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విభజన ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి విశాఖ ఎంతగానో ఉపయోగ పడుతు న్నదన్నారు. విశాఖమహానగరంతోపాటు ఉమ్మడి జిల్లాలో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు సినిమాలకు ఎంతో అనువుగా ఉంటాయ న్నారు. సినీ నిర్మాతలు, దర్శకులు, టివీ సీరియల్ నిర్వాహకులు తక్కువ ఖర్చుతో విశాఖలో తమ షూటింగ్స్ చేసుకోవచ్చు నన్నారు. సొంత రాష్ట్రం లోని సినిమాలు నిర్మించడం ద్వారా సదరు ఆదాయం రాష్ట్రప్రభుత్వానికి చేరడానికి ఆస్కారం వుంటుందన్నారు. అతేకాకుండా విశాఖ పర్యాక ప్రదేశాలను సినిమాల ద్వారా ప్రమోషన్ చేసే అవకాశం కూడా లభిస్తుందన్నారు.
నిర్మాతలు, దర్శకులు కథ, హీరో హీరోయిన్లతో విశాఖ వస్తే ఇక్కడే పూర్తి సినిమా తీసుకునేంతగా సదుపాయాలు ఉన్నాయన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమను విశాఖ తీసుకు వచ్చేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. విశాఖలోనే సినిమా ఇండస్ట్రీకి చెందిన అనుబంధ పరిశ్రమ లను కూడా ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాతలు సినిమా నిర్మించడంతోపాటో ఫస్ట్ కాపీ ఇక్కడి నుంచే తీసుకెళ్లే విధంగా అభివృద్ధి చేయడా నికి కార్యాచరణ సిద్దమవుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా విశాఖ లో ఏర్పాటు చేసేలా చేయడానికి రాష్ట్రప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళుతున్నామన్నారు. దేశంలోనే విశాఖలో ఉన్న పర్యాటక ప్రాంతాలు మరె క్కడా లేవన్నారు. అలాంటి అందమైన విశాఖను పర్యాటకంగా ప్రమోట్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్టు కంచర్ల చెప్పారు.