తూర్పుగోదావరి జిల్లాలో ఇకపై ప్రతీనెలా 4వ తేదిన ఒకరోజు సెలవు దినంగా ప్రకటిస్తూ యూనియన్ లో తీర్మానం చేసినట్టు గోదావరి ఎలక్ట్రి కల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ తెలియజేశారు. ఈ మేరకు యూనియన్ సమావేశంలో రాజమండ్రిలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా యూనియన్ లోని పలు అంశాలను చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నెలలో ఒకరోజు కార్మికు లకు సెల వు ఇవ్వాలని.. కార్మికులకు కొత్త రేట్లు ఏర్పాటు చేయాలని, ఆపద సమయంలో ఒకరికి ఒకరు సహాయ సహకారాలు చేసుకోవా లనే తదితర ప్రధాన అంశాలను చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి పెంచిన కొత్తరేట్లను అమలు చేయాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా రాజమహేంద్ర లో ఉన్న బిల్డర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, షాపు యజమానులు, వినియోగదారులు ఇతర యూనియన్ల సభ్యులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం గౌరవ అధ్యక్షులు ఎడ్ల సూర్యచంద్రరావు, ఎంవిజివి ప్రసాద్ లు యూనియన్ కు నూతన ట్రెజరర్ గా సుదర్శన్ షణ్ముఖం నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదా రులు కాకి రవిబాబు , సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు , స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వ రరావు, కమిటీ సభ్యులు నిమ్మలపూడి రవివర్మ , గెడ్డం ప్రసన్నకుమార్ , ఉత్తరాల సోమేశ్వరరావు, పోలేపల్లి విజయ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.