జర్నలిస్టుల మనసు గెలిచిన జిల్లా కలెక్టర్..!


Ens Balu
166
visakhapatnam
2024-10-02 15:02:35

బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రజలకు, ప్రభుత్వాలకి తెలియజేసేది మీడియా.. ప్రజ సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధిని చూపించేది జర్నలిస్టులు.. ఏం చేసినా మీడియానే చేయాలి.. అలాంటి మీడియాలో పనిచేసే జర్నలిస్టులకే కష్టకాలం వస్తే.. అలాంటి వారిని ఆదుకునేది, అక్కున చేర్చుకునేది ఒక్క జిల్లా కలెక్టర్ మాత్రమే..ఇపుడు విశాఖలో జర్నస్టులకు ఏం  కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకి వచ్చి అండగా నిలబడుతున్న విశాఖజిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ జర్నలిస్టుల మనసు గెలుచుకొని అందరివాడు అయ్యారు. ఎప్పుడో జిల్లా కలెక్టర్ గా జె.శ్యామలరావు, జెసిగా పోలాభాస్కర్  విశాఖలో పనిచేసిన కాలంలో అధికార యంత్రాంగానికి.. మీడియాకి ఉన్న స్నేహ పూర్వక వాతావరణాన్ని మళ్లీ ఇన్నేళ్ల తరువాత జిల్లా కలెక్టర్ గా హరేంధిర ప్రసాద్ వచ్చిన తరువాత చూస్తున్నారు జర్నలిస్టులు. అంతేకాదు ప్రజల సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తూ విశాఖ అభివృద్ధిలో చెరగని సంతకంలా కూడా మారిపోయారు. 

సమాజంలో నాల్గవ స్థంభంగా వున్న మీడియాకి సముచిత స్థానం కల్పించాలని.. అందులో పనిచేసే జర్నలిస్టులకు కనీస అవసరాలు తీర్చేందుకు ముందుకి వచ్చారు వైజాగ్ కలెక్టర్. విశాఖజిల్లాలో బాధత్యలు తీసుకున్న నాటి నుంచి ప్రజాసమస్యల పరిష్కరించడంతోపాటు, క్షేత్రస్థాయిలోనూ పర్యటనలు చేస్తూ ప్రజలకు కూడా అత్యంత చేరువ అయ్యారు. సాధారణంగా జిల్లా కలెక్టర్ అంటే ప్రోటోకాల్ అధికారి.. కానీ ఈయన అత్యంత సాధారణంగా ఉంటూ అటు అధికార యంత్రాంగానికి.. ఇటు ప్రజలకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు చేరువ అయ్యారు. అదే సమయంలో సమజంలో జరిగే అన్ని విషయాలను పత్రికలు మీడియా ద్వారా చూపించే మీడియా పట్ల కూడా ఎంతో గౌరవంతో మెలగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళితే పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించ గలిగారు.

మహావిశాఖనగర పాలక సంస్థకు కూడా ప్రత్యేక అధికారి కావడంతో దేశంలోనే జివిఎంసీని ప్రప్రధమ స్థానంలో ఉంచే క్రమంలో చేపడుతున్న అభివృద్ధిలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అంటే సుమారు 75 ప్రభుత్వ శాఖలకు ముఖ్య అధికారి.. రాష్ట్రప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పరిపాలనలో ఎంత కీలకమో.. జిల్లాలో కూడా కలెక్టర్ అంతే కీలకం. నిత్యం ఎన్నో బిజీ బిజీ పనులు ఉన్నప్పటికీ జర్నలిస్టులన్నా.. వారి సమస్యల పరిష్కరించంలోనూ ఒక అడుగు ముందుకేసి మరీ చక్కని సహాయ సహకారాలు అందిస్తున్నారు. జర్నలిస్టుల్లో చాలా మంది నిరుపేదలు ఉండటంతో వారికి కాస్త చేదోడుగా.. జిల్లా అధికార యంత్రాంగాన్ని చైతన్య పరిచి సేకరించిన సిఎస్ఎస్ నిధులతో జర్నలిస్టుల హెల్త్ కార్డు ప్రీమియం చెల్లించడంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. 

తద్వారా జిల్లాలోని వైట్ రేషన్ కార్డు కలిగిన అక్రిడేటెడ్ జర్నలిస్టులకు హెల్త్ కార్డ్ ప్రీమియం చెల్లిడానికి మార్గం సుగమం అయ్యింది. అంతేకాకుండా ఇపుడు మిగిలిన జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డుల ప్రీమియం సిఎస్ఎస్ నిధుల నుంచి చెల్లించాలనే ప్రతిపాదనలకు కూడా న్యాయం చేసేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా బాగా విస్తరించడంతో టెక్నాలజీని వినియోగించి పరిపాలన చేయడంలోనూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలోనూ అందరికీ  అవగాహనక కల్పించడంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.

విశాఖలో ఇటీవల  జర్నలిస్టు(లక్ష్మణ్) అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సమయంలో ఆయనకు ప్రెస్ అక్రిడిటేషన్ లేదు. అది ఉంటే తప్పా హెల్త్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. దానితో విశాఖలోని జర్నలిస్టులు ఆర్ధిక సహాయం చేసి మృతి చెందిన లక్ష్మణ పార్ధీవ శరీరాన్ని విశాఖ తీసుకువచ్చి.. జర్నలిస్టులే దహన సంస్కారాలు చేశారు. ఆ సమయంలో జర్నలిస్టుల పాలిన ఆత్మబంధవు, అందరివాడు, నిశ్వార్ధ సేవకుడు ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు ముందుకొచ్చి తన సొంత నిధులతో జర్నలిస్టు లక్ష్మణ్ దశదిన ఖర్మను కూడా చేసి జర్నలిస్టులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అత్యధిక మొత్తంలో ఆర్ధిక సహాయం కూడా చేశారు. ఆ తరువాత మరో జర్నలిస్టు తల్లి గుండె పోటుతో మృతిచెందడం, మరో జర్నలిస్టు సతీమణి చికిత్స పొందుతూ మృతిచెందడం, ఇలా ఏడాది కాలంలో పలువురు జర్నలిస్టుల కుటుంబాల్లో జరిగిన విషాద సంఘటలన్నీ కలెక్టర్ దృష్టికి జర్నలిస్టులు తీసుకెళ్లడంతో చలించిపోయారు.

 ఆఖరుగా అర్హత ఉండి ప్రెస్ అక్రిటిటేషన్ కార్డులు పొందలేని జర్నలిస్టుల కోసం ప్రత్యేక అక్రిడిటేషన్ కమిటీ సమావేశం పెట్టి మరీ జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసి.. తద్వారా హెల్త్ కార్డులు పొందడానికి అవకాశం కల్పించారు. మంచి మనసుతో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేసిన సహాయం పట్ల జర్నలిస్టులు, జర్నలిస్టులు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా జర్నలిస్టుల మనసు తెలుసుకున్న కలెక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉంటే అర్హత ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులు రావడంతోపాటు, హెల్త్ కార్డులు కూడా చక్కగా వచ్చే అవకాశం వుంటుంది. జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా అందే మేలు జరగడంతోపాటు.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి కూడా ఎంతో పేరు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!