జవహర్ నవోదయ విద్యాలయ కొమ్మాది,విశాఖపట్నం లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి మరియు 11వ తరగతి ప్రవేశ పరీక్షలకు నవోదయ విద్యాల సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.
9వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవటానికి ప్రస్తుతం2024-25 విద్యాసంవత్సరం లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
11వ తరగతి కొరకు దరఖాస్తు చేసుకోవటానికి ప్రస్తుతం 2024-25 విద్యాసంవత్సరం లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
దరఖాస్తు చేసుకొను విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జవహర్ నవోదయ విద్యాలయకు దరఖాస్తు చేసుకొను విద్యార్థినీ - విద్యార్థులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నివసిస్తునట్లు నివాస ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి..
9 మరియు 11 తరగతులకు దరఖాస్తు చేసుకొనుటకు గాను 2024 - 25 విద్యా సంవత్సరం నందు ప్రభుత్వ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9 మరియు 11 తరగతులు చదువుతున్న బాల బాలికలు అర్హులు.
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2010 మే 1 నుంచి 2012 జూలై 31 మధ్య జన్మించిన వారై ఉండాలి....
ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2008 జూన్ 1 నుండి 2010 జూలై 31 మధ్యన జన్మించిన వారై ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30/10/2024
పరీక్షా తేదీ : 08/02/2025
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్న్ వినియోగించుకోగలరు
9 వ తరగతికి: https://cbseitms.nic.in/2024/nvsix
11 వ తరగతి :
https://cbseitms.nic.in/2024/nvsxi_11
మరిన్ని వివరాల కోసం
ప్రిన్సిపల్
డా య.సా.శి. చంద్రశేఖర్
జవహర్ నవోదయవిద్యాలయ
విశాఖపట్నం జిల్లా