విశాఖజిల్లా జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై తప్పుడు సమాచారం ఇచ్చారు.. నేరుగా కలెక్టరే ఇస్తే పాపం జిల్లా సమచారాశాఖ అధికారులు మాత్రం ఏం చేస్తారు చెప్పండి.. జిల్లా కలెక్టర్ చెప్పింది చెప్పినట్టుగా.. అన్నది అన్నట్టుగా జిల్లా సమాచారశాఖ అధికారులు మీడియాకి వారి స్టైల్ లో సమీక్షా సమావేశంతో కూడిన సమాచారం పెట్టేశారు.. ఏంటి ఏదో తేడా కొడుతుంది కదూ.. పక్కాతేడానే.. తేడా కాదు.. అంతకంటే అత్యంత దారుణమైన నిర్లక్ష్యం.. సమాచారశాఖ చేసిన తప్పుకి జిల్లా కలెక్టర్ ని బాధ్యులను చేసేశారు. నవంబరు 2 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనకు బదులు అక్టోబర్ 2(గాంధీజయంతి రోజున) పర్యటన అని అక్టోబర్ 30న జిల్లా సమాచారశాఖ మీడియాకి కలెక్టర్ ఫోటోలు, వివరాలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మీడియాకి పంపే సమాచారాన్ని కనీసం ఒకసారి చెక్ చేసుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తున్నరడనికి సీఎం చంద్రబాబు సమాచారమే సాక్షి..!
ఏం మాట్లాడినా.. ఏం చేసి.. టెక్నికల్ ప్రాబ్లమ్ రాకుండా చేస్తామని చెప్పే జిల్లా సమాచారశాఖ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను సాక్షాత్తు జిల్లా కలెక్టరే తప్పుగా.. తప్పుడు తేదీలతో చెప్పినట్టు సమాచారం ఇవ్వడాన్ని బట్టి విశాఖ జిల్లా సమాచారశాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ సమాచారం ప్రెస్ నోట్ కూడా రాయడం రాకపోగా అత్యంత దారుణమైన నిర్లక్ష్యంగా సమాచారశాఖ అదికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు మీడియాని ఆలోచింపజేస్తుంటే.. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కి మాత్రం మోయలేని శిరోభారాన్ని తెప్పిస్తున్నది. అయినా తప్పు విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులది కాదులేండి.. క్యాడర్ ఉందనే ఒకే ఒక్క సాంకేతిక కారణంతో కనీసం ప్రభుత్వ సమాచారాన్ని ప్రెస్ నోటుగా రాయడంపైనా.. తయారు చేసిన సమాచారాన్ని మీడియాకి పంపే ముందు చెక్ చేయడం కూడా రాని అధికారులను జిల్లా అధికారులుగా నియమించిన రాష్ట్ర సమాచారశాఖది.
రాష్ట్రంలో జిల్లాలను విభజించిన సమయంలో కొత్త జిల్లాలకు డిపీఆర్వోలు కొరత ఏర్పడితే.. సాంతిక విభాగంలో ఏఈలు, డిఈలుగా పనిచేస్తున్నవారిని తీసుకొచ్చి రాష్ట్ర సమాచారశాఖ జిల్లా సమాచారశాఖ అధికారులుగా నియమించేసేంది. దానితో వచ్చీరాని పనులతో వీరంతా మీడియాని తప్పుదోవ పట్టించేస్తున్నారు. అందునా విశాఖజిల్లాలో అన్ని ప్రభుత్వశాఖలు, వ్యవహారం, ప్రోటోకాల్ పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న సిబ్బందిని ఇక్కడ నియమించాలి కారణం ఈ జిల్లా ఉత్తరాంధ్రకే ట్రాన్సిట్ హాల్ట్ జిల్లా కనుక. కానీ రాష్ట్ర సమాచారశాఖ అదేమీ పట్టించుకోకుండా.. ఖాళీలను భర్తీచేసే స్పీడులో సాంకేతిక విభాగంలో పనిచేసే అధికారులను జిల్లా సమాచారశాఖ అధికారులగా నియమించడంతో.. వారికి రాని, తెలయని పనులు చేయమనేసిరికి ఇష్టానుసారం తప్పులు తప్పులుగా చేస్తున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు మీడియా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు.
దీనితో కలెక్టరే తమ తప్పులను భరిస్తున్నారు.. కానీ మీడియా మాత్రం ప్రతీ చిన్న తప్పునీ ప్రత్చేక కథనంలో చూపిస్తుందని జిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బంది తెగ ఫీలైపోతున్నారు. అసలు చేసిన తప్పు మరోసారి చేయకుండా ఉండాలనే పశ్చాతాపం లేకుండా చేసిన తప్పే పదే పదే చేస్తుడంటం బహుసా విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులకు అలవాటైపోయినట్టుంది. విశేషం ఏంటంటే చాలా పత్రికలు అదే తప్పుడు సమాచారాన్ని వార్తలుగా పెట్టేశారు. సమాచారశాఖ చేసిన తప్పు..నిర్లక్ష్యం మీడియాతో కూడా తప్పుడు సమాచారం ఇచ్చేలా చేయగలిగారు.. కలెక్టర్ సారూ ఇదీ జిల్లాసమాచారశాఖ అధికారులు మీడియాకి సీఎం పర్యటన వివరాలు పంపిస్తున్న తీరు. సీఎం పర్యటనను తేదీలను తప్పుగా పంపించేసిన సమాచారశాఖ అధికారులు ఏదో ఒక రోజున భారీ తప్పులో మిమ్మల్నీ భాగస్వామ్యం చేసేస్తారు.. అప్పుడు కూడా ఇప్పటి మాదిరిగానే లైట్ తీసుకుంటారా ఏంటి..? పారాహుషార్..?!