రేయ్ మా మీదే వార్త రాస్తావా..? దానిని జిల్లా కలెక్టర్ కి పంపిస్తావా..?!


Ens Balu
50
visakhapatnam
2024-10-31 14:02:57

విశాఖజిల్లాని సమాచారశాఖ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి  ‘సీఎం చంద్రబాబు విశాఖ పర్యటననూ తప్పుదోవ పట్టించిన సమాచారశాఖ’ శీర్షికన ఈరోజు పేపర్ లో వచ్చిన ప్రత్యేకవార్త  బాగా మండిపోయేలా చేసింది..  చేసిన తప్పు ఆధారాలతో సహా పేపర్ రావడం.. అది కాస్తా జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ దృష్టికి వెళ్లడం, ఈరోజు పేపర్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అఫిషియల్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాలప్ లలో ప్రచురితం కావడం అది బాగా వైరల్ కావడంతో ఏం చేయాలలో తెలియని ప్రెస్టేషనల్ లో డివిజనల్ పీఆర్వో నాయారణరావు ఈరోజుప్రతినిధికి ఫోన్ చేసి మరీ అమ్మనా బూతులు తిట్టేశాడు. ఆఫీసుకి రారా నీ అంతు చూస్తాం.. నీపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తాం అంటూ ఏకవచన సంభోదానికి దిగాడు.. అలా మాట్లాడిన మాటలు కూడా విశాఖజిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వున్న సమాచారశాఖ అధికారులకి సదరు తిట్ల పురాణ దండకం చేరింది.  దానితో ఇంకా రెచ్చిపోయిన ఆయన విశాఖజిల్లా అధికారిక వాట్సప్ గ్రూపు నుంచి అక్రిడేటెడ్ జర్నలిస్టుగా ఉన్న తనని తొలగించేశాడు. కోపం నషాలానికి అంటిందేమో కోరి కొరివతో వీపు గోక్కుని సవాల్ కి దిగాడు..  డివిజనల్ పీఆర్వో సవాల్ ని ఈరోజు ప్రతినిధి కూడా స్వీకరించారు.. ఇకపై తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యారు..!

విశాఖజిల్లా సమాచారశాఖలోని అధికారులు, సిబ్బందికి రాష్ట్రప్రభుత్వంలో జర్నలిస్టులు, మీడియా కోసమే ఏర్పాటైన సమాచారశాఖ గౌరవం తెలిసి రాలేదు. అందకే జర్నలిస్టులమీదే చిందులు తొక్కుతున్నారు. గట్టిడి అడిగే బెదిరిపోతారనుకొని చేసిన తేడా పనులపై వార్తలు రాస్తే.. పనిగట్టుకొని మరీ ఫోన్లు చేసి తిట్లదండం మొదలు పెట్టారు. కానీ జర్నలిస్టులు.. అందునా ఈరోజు-ఈఎన్ఎస్ జర్నలిస్టులతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా వుంటుందో ఇప్పుడిప్పుడే సమారశాఖకు తెలిసొస్తున్నది. ఈ నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా చేసిన తప్పులపై ప్రత్యేక కథనాలు ప్రచురితం అవుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. జర్నలిస్టులకి ఫోన్లు చేసి బూతులు తిట్టడంతోపాటు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని కూడా బెదిరింపులకి దిగుతున్నారు. ఆ తాటాకు చప్పుళ్లకి ఈరోజు-ఈఎన్ఎస్  భయపడదని.. దైర్యంగా సమాచారశాఖ తేడా వ్యవహారాలు ప్రత్యేక కథనాలతో నిగ్గు తేల్చింది. ఇప్పుడే కాదు భవిష్యత్తలో కూడా తేడాలు వస్తే తాటతీసే వార్తలే రాయాలని కూడా నిర్ణయించుకుంది.  

విశాఖలో ఈరోజు-ఈఎన్ఎస్ బాలుకి ఫోన్ చేసి బూతులు తిట్టిన డివిజనల్ పీఆర్వో విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం అయ్యింది. చేసిన తప్పుకి పక్కాగా ఆధారాలున్నా.. తప్పుని సమర్ధించుకోవడానికి ఫోన్లు చేసి బెదిరింపులుకి దిగడాన్ని విశాఖలో నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. దినపత్రికకు మద్దకు పలికారు. ఈరోజు-ఈఎన్ఎస్ కి జర్నలిస్టుల సంఘీభావమే శ్రీరామ రక్ష. కొందరు తేడా జర్నలిస్టుల ఈ విషయంలో కలిసి రాకపోయినా ఒరిగిపోయేది ఏమీ లేదు. ఈరోజు-ఈఎన్ఎస్ సింగిల్ గానే పోరాటం చేస్తుంది. తాడో పేడో తేల్చుకుంటుంది. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు మంచి చేయాలని విశాఖ పర్యటకు వస్తుంటే..ఆ పర్యటన వివరాలను విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ పేరుతోనే తప్పుడు తేదీలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుందా..? దానిని మీడియా ప్రశ్నించకూడదా..? 

మీడియాకి సమాచారం పంపించే విషయంలో ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని వార్తల రూపంలో గుర్తు చేయకూడదా..? అంటే కూటమి ప్రభుత్వానికి మచ్చతెచ్చే విధంగా సమాచారశాఖ వ్యవహరిస్తుంటుంటే.. మీడియాకి అమిత గౌరవం, ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్న ప్రభుత్వ సమాచారం కరెక్టుగా మీడియాకి రావాలని చేసిన ప్రయత్నం తప్పా..? అదే తప్పు అనుకుంటే విశాఖజిల్లా ముఖ్య అధికారిగా జిల్లా కలెక్టర్ పరిపాలనను సమాచారశాఖ ఎద్దేవా చేసినట్టే. ఎందుకంటే నేరుగా జిల్లా కలెక్టర్ పేరుతోనే తప్పుడు సమాచారం ఇస్తే దానిని ఏమనుకోవాలి.. ఏ దైర్యంతో కనీసం మీడియాకి సమాచారం పంపే సమయంలో తేడా వ్యవహారాలను సరిచూసుకోదు.. ఏం.. ఆ తేడా తనాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనంలో రాస్తే మండిందా..? సమాచారశాఖ క్రింద జిల్లా కలెక్టర్ పనిచేయడం లేదు.. జిల్లా ముఖ్య అధికారి తప్పుడు సమాచారం చెప్పినట్టుగా సమాచారశాఖ ఎలా రాస్తుంది.. దానినే బయట పెట్టాం.. 

అలా తప్పులను వెతికినందుకు అక్రిడేటెడ్ జర్నలిస్టుని నెంబరుని సమాచారశాఖ అధికార మీడియా నుంచి తొలగించేస్తారా..? సమాచారశాఖ వ్యవహారాన్ని వర్కింగ్ జర్నలిస్టులంతా ముక్త కంఠంతో ఖండించాలి. అంతేకాదు.. ఈరోజు-ఈఎన్ఎస్ పై సమాచారశాఖ ఎంత కాలం ఇలాంటి వ్యక్తిగత దూషణలు, కక్షలు ప్రదర్శిస్తుందో తేలిపోతుంది.  ఇప్పటికే డివిజన్ పీఆర్వోపై విశాఖ నగర పోలీసు కమిషనర్ కి తిట్ల దండకం వాయిస్ రికార్డింగ్, ప్రత్యేక కథనాల క్లిప్పింగులు, సమాచారశాఖ మీడియాకి అందించిన తప్పుడు సమాచారం యొక్క స్క్రీన్ షాట్ లతో ఫిర్యాదు కూడా చేసింది. మళ్లీ మళ్లీ చెబుతున్నాం.. ఎవరు ఏమనుకున్నా కూటమి ప్రభుత్వానికి మచ్చతెచ్చే ప్రభుత్వశాఖల అధికారుల తీరు, వ్యవహారాలను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది.. ఇకపైనా  ప్రత్యేక కథనాలు రాస్తూనే వుంటుంది. ఈ విషయంలో కలిసొచ్చే నిజమైన జర్నలిస్టులకు భవిష్యత్తులో సంఘీబావంగా కూడా నిలబడుతుంది. సత్యమేవ జయతే..!