విశాఖ అక్రమార్కుల గుండెల్లో సింహ స్వప్నం..!


Ens Balu
355
visakhapatnam
2024-11-02 08:20:18

‘ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్.. నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్.. అవతలి వాడు ఎంతటి వాడైనా బ్లండ్ గా ఎదురెళ్లిపోవడమే.. తొక్కపట్టి నార తీస్తా నా కొడకా’..ఏంటి ఈరోజు పేపర్, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వాళ్లు సినిమాహీరో బాలక్రిష్ణ డైలాగులు చెబుతు న్నారు అనుకుంటున్నారా..? బాలయ్య సినిమాల్లో ఈ డైలాగ్ చాలా పవర్ ఫుల్.. అదే డైలాగ్ ని.. దానిపై  రియల్ లైఫ్ యాక్షన్ లో చేసి చూపిస్తే.. అందునా ఒక ఐపీఎస్ ఆఫీస్ ఆ విధంగా వ్యవహరిస్తే.. తట్టుకోవడం ఎవరి తరం అవుతుంది..? ప్రస్తుత విశాఖలో అక్రమార్కుల పరిస్థితి కూడా అదే.. 7995098799 ఈ నెంబర్ మీ దగ్గరుంటే శ్రీరా రక్ష.. అర్ధరాత్రైనా మహిళలు దైర్యంగా నగరంలో తిరగొచ్చు.. నేను ఆపదలో ఉన్నానని ఒక్క ఫోన్ వెళ్లినా.. లేదా మెసేజ్ వెళ్లినా క్షణాల్లో రంగంలోకి దిగిపోతున్నారు.. అవతలి వాడి ఆటకట్టిస్తున్నారు ఆయన వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ ఐపీఎస్.  విశాఖ పోలీస్ శాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన మహానగర పోలీస్ బాస్ పై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనం..!

విశాఖలో ప్రజలు ఇపుడు జపం చేసే అధికారి పేరు శంఖబ్రత బాగ్జీ.. అదేంటీ ఒక పోలీసు అధికారి పేరు జపం చేయడం తప్పా మరేం లేదా అనుకుంటే ఎఫ్ఐఆర్ లో కాలు పెట్టినట్టే. అవును నిజం.. విశాఖకి ఎందరో పోలీస్ కమిషనర్లు వచ్చారు.. వెళ్లారు.. కానీ శంఖబ్రత బాగ్జీ మాత్రం మహావిశాఖపై చెరగతి సంతకం చేసేశారు. ఆపద అన్నవారికి తోడుగా నిలబడుతున్నారు. అక్కమార్కులను హడలెత్తిస్తున్నారు. సెటిల్ మెంట్లు చేసారికి సీన్ సితార్ చేస్తున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలను భయపెట్టే తేడా కాఖీలు సైతం ఈయన ముందుకి రావడానికి ఒంటేలు  పోసుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. అంతలా పోలీసుశాఖ ద్వారా ప్రజల కష్టాలను తీర్చడమే కాకుండా పోలీసుశాఖనే ప్రక్షాళన చేసే క్రమంలో ఎవరినీ ఉపేక్షించడం లేదు. తేడా పనులు చేస్తున్నట్టు తెలిసినా.. తన దృష్టికి వచ్చినా వెంటనే యాక్షన్ లోకి దిగిపోతున్నారు. 

తప్పుచేసిన  పోలీస్ అధికారులను సైతం ఇంటికి పంపిస్తున్నారు. అక్రమార్కులను గుడ్డలూడదీసి పరుగులు పెట్టిస్తూ.. ప్రజల మనిషిగా మారిపోయారు. విశాఖలో పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రోజునుంచే ఆయన ఫోన్ నెంబరుని ప్రజలకు చెప్పేశారు. మీకు పోలీసుశాఖ అండగా వుంటుంది. నాకు కష్టమొచ్చిందని ఎవరూ బాధపడకూడదు. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదని అసలే విచారించకూడదు. నాకు సమాచారం ఇవ్వండి.. నేను చూసుకుంటానంటూ ఇచ్చిన 7995098799 నెంబరుకి ప్రజల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందన వస్తున్నది. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతోపాటు వారికి న్యాయం చేయడంలో ప్రత్యేక భూమిక వహిస్తూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసు సేవలు సకాలంలో అందిస్తున్న సిటీ పోలీస్ కమిషనర్ పేరుని నెంబరు ఇపుడు మహావిశాఖ నగరరంలోని ప్రజలందరూ వారి సెల్ ఫోన్ లలో తమ కుటుంబాలు, స్నేహితులతోపాటు ఈ నెంబరుని కూడా ‘పవర్ ఫుల్ పోలీస్ ’ అనే పేరుతో సేవ్ చేసుకుంటున్నారు.

 24 గంటలూ 365 రోజులు ఈ నెంబరుపై విశాఖ పోలీస్ కమిషనరేట్ లో ఒక ప్రత్యేక విభాగమే పనిచేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒక్క ప్రజలకే కాదు పోలీసుశాఖను ప్రక్షాళన చేయడానికి కూడా ఇదే నెంబరుని వినియోగించి అక్రమార్కులను ఇంటికి పంపిస్తున్నారు సిటీ పోలీస్ కమిషనర్. దీనితో ఈయన ఇక్కడ ఉన్నంత కాలం మేము ఇక్కడ పనిచేయలేం బాబోయ్ అంటూ కొందరు పోలీసులు పెద్ద స్థాయిలో పైరవీలు చేయించుకొని వేరే ప్రతాంలకు తరలి వెళ్లిపోతున్నారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ నమ్మే సిద్దాంతం ఒక్కటే.. తప్పు చేస్తే..చట్టం ముందు ఎవరైనా సమానమే. ఇపుడు అదే పదం పోలీసులను సైతం హడలెత్తిస్తోంది. కమిషనర్ దృష్టిలో పడకుండా చట్టం చెప్పినట్టు పనిచేస్తున్నారు. దానితో మహావిశాఖనగరం ప్రశాంతంగా నిద్దుర పోతోంది. ఒకవేళ ఎవరైనా దొంగతనాలు, దోపీడిలు, హత్యలూ, మానభంగాలు అంటూ డిస్ట్రబ్ చేయాలని చూసినా వారి ఆటలు కూడా ఎంతో సమయం నిలవడం లేదు. గంటల వ్యవధిలోనే వారిని కోర్టు మెట్లెక్కెంచి కట కటాలపాలు చేస్తున్నారు ఈ డైనమిక్ పోలీస్ కమిషనర్.

 దానితో చేసిది లేక అంత్ రాష్ట్ర  సుపారీ బ్యాచ్ లతో పనిచేయించాలని చూసినా వారి పప్పులు కూడా ఇక్కడ వైజాగ్ లో ఉడకడం లేదు. ఒకప్పుడు కేవలం రాత్రి 10 గంట వరకే ఉండే షాపుల క్లోజింగ్ టైమ్ ఇపుడు రాత్రి 12 వరకూ పెంచారు ఈయన. చాలా మంది అది వ్యాపారస్తుల కోసం అనుకున్నారు. కానీ ఆ సమయం వరకూ షాపులు, జనసమ్మర్ధం వుంటే నేరాలు..ఘోరాలు తగ్గుతాయని చాలా లోతుగా ఆలోచించి విశాఖ ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందిస్తున్నారు. అడపా దడపా కొందరు పోలీసులు స్టేషన్ పరిధిలో తోక జాడించినా.. సస్పెన్షన్ అనే కత్తెరతో తోకలు కట్ చేస్తున్నారు. పోలీస్ అంటే ప్రజలకు సేవ చేసేవాడే కానీ ప్రజలను పట్టుకొని పీడించుకు తినేవాడని కాదని రుజువు చేస్తూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ కి విశాఖ ప్రజలకు చేరువ చేస్తున్నారు. 

వాస్తవానికి వైజాగ్ సిపీ అంటే ఒక పెద్ద అధికారి.. కానీ ఒక సాధారణ పోలీసు మాదిరిగా విశాఖ నగరాన్ని జల్లెడ పట్టడంలో ముందుంటున్నారంటే ఆయన వర్క్ సిన్సియారిటీ.. డెడికేషన్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం సివిల్ సర్వీస్ లకు, గ్రూప్-1 లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కూడా విశాఖ సీటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ ఒక మార్గదర్శి. పోలీస్ అంటే ఈయనలా పనిచేయాలనే లక్ష్యాన్ని పెట్టుకొని మరీ  సిద్దమవుతున్నారు. ఇటు మీడియాకి కూడా మంచి సమాచారాన్ని అందించడంతో పాటు.. మీడియాలో పనిచేసేవారికి, జర్నలిస్టులకి.. ఎవరికి ఆపద వచ్చినా 24 గంటల్లోనే స్పందించి పరిష్కారం చూపిస్తున్నారు. 

ఇలాంటి మంచి ఐపీఎస్ ఆఫీసర్లు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఉంటే పోలీస్ సేవలు ఏ విధంగా అందుతాయో ఒక్కసారి ఊహించుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వం కూడా ఏరి కోరి ఈ డేరింగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ని విశాఖ పంపినందుకు చిరస్థాయిగా నిలిచిపోయే పోలీసింగ్ ని విశాఖ చేరువ చేశారు. విశాఖపై చెరగని సంతకం చేశారు. ‘వైజాగ్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ సార్ మీరు సూపర్ సర్.. మామూలు కేక కాదు.. కెవ్వు కేక అంటూ విశాఖవాసులు కీర్తిస్తున్నారు’. వృత్తిని దైవంగా భావించే ఇలాంటి పోలీసు అధికారుల సేవలు విశాఖకు కలకాలం కావాలని ఆశిద్దాం..!