ఆ.. ఆడ బిడ్డకి తండ్రి దూరమోపోయాడు.. ఆ అన్నకి తమ్ముడు కనిపించకుండాపోయాడు.. భార్య తాళి, సుమంగళి ఆత్మహత్య వ్యవహారంలో కొట్టుకుపోయాయి.. 150 కుటుంబాలు ఉపాది లేక రోడ్డున పడ్డాయి.. కుటుంబ సభ్యులందా గుండెలు అవిసేలా రోధిస్తున్నా.. మాకు అన్యా యం జరిగిందని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా.. స్పందించే మీడియా కనిపించలేదు. అసలు ఏం జరిగిందో లోతుగా పరిశీలన చేయాలనే ఆలోచన కూడా రాలేదు.. బహుసా వ్యాపార ప్రకటనలిచ్చే బడా వ్యక్తుల విషయంలో మీడియా నిబంధనలు, పరిశోధనలు, పరిశీలనలు పనిచేయవేమో.. అందుకే శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్ జోన్ సాయిగణేష్ ఆత్మహత్య సంఘటనను గాలికి వదిలేశాయి. నిజంగా విశాఖలో మానవత్వం మంటగలిసిపోయినట్టే.. వ్యాపార వర్గాలు ఇలాంటి ఆత్మ హత్యల కేసుల్లో ఇరుక్కున్నా.. వాళ్లే తన చావుకి కారణమని చెప్పినా పోలీసులు కూడా పట్టించుకోరేమో..ఆఖరికి ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్లినా నేటికీ న్యాయం జరగలేదంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి..? ప్రభుత్వంపై నమ్మకం ఉంటుందా..? ఒక బడా వ్యాపారి వాలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాననే మరణ వాంగ్మూలాన్ని నిజం చేయడానికి భారత న్యాయ సంహిత లో ఆర్టికల్స్, సెక్సన్స్ లేకుండా పోవడం అత్యంత దారుణం..!
విశాఖలో సోనో విజన్ ఎండీ వేమూరి భాస్కర మూర్తి వేధింపుల వలనే శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్ జోన్ అధినేత కొవ్వూరు సాయిగణేష్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్పీ వీడియో తీసుకొని మృతి చెందిన ఘటన రాష్ట్రంలో సంచనలం అయినా.. అది కేవలం సాధారణ మరణమేనని పోలీసుశాఖ ఎఫ్ఐఆర్ రాసింది. చిన్న బ్యాగు పోతే పోలీసులు దానిని వెతికి పట్టి బ్యాగ్ పోగొట్టుకున్నవారికి అప్పగించడానికి యావత్ యంత్రాగన్ని మొత్తం వినియోగిస్తారు. కానీ అందరికీ తెలిసేలా వివరాలన్నీ చెప్పి మరీ బలవంతంగా ఆత్మ హత్య చేసుకున్న సాయిగణేష్ విషయంలో పోలీసు అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్టు ఉండటడం అనుమానాలకు తావిస్తున్నది. సెల్ఫీ వీడియోపై సమాచారాన్ని బాహ్య ప్రపంచానికి చూపించని ఓ వర్గం మీడియా ఈ ఆత్మహత్యకు తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన మాటలను మాత్రం పదే పదే ప్రసార మాద్యమాల్లో చూపిస్తే.. పత్రికల్లోనూ భారీగానే అచ్చువేశారు.
అయితే ఇక్కడ మృతుడి మరణంపై ఎవరికీ అసలు అనుమానాలే రాలేదా..? లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ నుంచి వచ్చే భారీ ప్రకటనలు పోతాయని ఈ విషయాన్ని బయట పెట్టలేదా అంటే అవుననేనే అంటున్నాయి మీడియా వర్గాలు. మనకెందుకు వచ్చిన గొడవులు.. పోలీసులే ఈ సూసైడ్ ని నార్మల్ డెత్ గా ఎఫ్ఐఆర్ రాశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బడా వ్యక్తి ఆయనని ఎదిరిస్తే వచ్చే నాలుగు యాడ్స్ కూడా రావనుకున్నారో ఏమో తెలీదు గానీ ఈ సంఘటన అసలు ఏమీ కాదన్నట్టే తేడా మీడియా మిన్నకుండి పోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది.
తమ కుటుంబంలోని పెద్దనుకోల్పోయామని కుటుంబ సభ్యులు, తమ యజమానికి కల్పోయామని కార్మికులు చెబుతున్నా.. వారంతా రోడ్డున పడ్డా.. కనీసం వారి బాధను నివారించే నాధుడే కరువయ్యాడు విశాఖలో. ఎక్కడో సినిమాల్లో చూపించే కిల్లర్ సీన్ వ్యవహారాలు నిజ జీవితంలోనూ.. అందునా సెల్ఫీ వీడియోల్లో నేరుగా ఆధారాలుగా చూపించి బాధితులు మృత్యువాత పడినా అవి పోలీసులకు కనిపించవని.. మృతుడి కుమార్తె గుండెలు పగిలేలా ఏడ్చిన ఏడుపులు కూడా ఏ మీడియాని కదిలించలేకపోయాయి. వ్యాపార వర్గాల కబంద హస్తాల్లో నలిగిపోతున్న సంస్థలు చెప్పినట్టు చేయాల్సిన లక్ష్మణ రేఖ ఆంక్షలు ఈ ఆత్మ హత్యపై నిజంగా లోతుగా పరిశీలన చేయాలనుకున్నా వీలు పడలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఈరోజు-ఈఎన్ఎస్ రాసిన కథనాలు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లినా నేటికీ బాధితులకు న్యాయం జరగలేదంటే నిజంగా దారుణమనే చెప్పాలి. విశాఖలో సోనో విజన్ ఎండీ వేమూరి భాస్కర మూర్తి వేధింపుల వలనే శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్ జోన్ సాయిగణేష్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్పీ వీడియో తీసుకొని మృతి చెందిన ఘటన లో నిజమంగా మీడియా లోతుగా పరిశీలన, పరిశోదన చేస్తే అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఎవరూ ముందుకి రావడం లేదు. నిజంగా పోలీసుశాఖ, ప్రభుత్వం ఈ ఆత్మహత్య ఘటనలో మనసు పెట్టి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. లేదంటే నిజంగా కుటుంబ పెద్ద కోల్పోయిన ఆ ఆడబిడ్డల ఉసురు ఖచ్చితంగా వాస్తవాలను బయటపెట్టని సోకాల్డ్ మీడియాకి, పోలీసులకి, ప్రభుత్వానికి కూడా తగులుతాయన పెదవి విరుస్తున్నారు విశాఖ వాసులు..?!