ఏపీటిడిసి సిత్రాలు.. హరితపై మర్మమతుల బుర్ర కథ..?!


Ens Balu
33
visakhapatnam
2024-11-12 19:21:25

హరికథలు చెబుతామండి హరి కథలు.. కూటమి ప్రభుత్వంలో వినేవారుంటే హరిత రిసార్ట్స్(యాత్రినివాస్) పై మరమ్మతుల కోసం చేసిన ఖర్చులకు వైఎస్సార్సీపీలో చేపట్టిన పనులపై బుర్ర కథలు చెబుతామండి బుర్ర కథలు అంటున్నారు ఏపీడీసి అధికారులు.. ఏంటి ఇదేదో తేడాగా ఉన్నట్టుందే అనుకుంటున్నారు కదా.. నిజమే  పక్కా తేడా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 14 కోట్లుతో  ఒక ఫైవ్ స్టార్ హోటల్ నే నిర్మించేసే మొత్తంతో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి కోట్ల రూపాయలను గుత్తేదారుడికి దోచి పెట్డానికి ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ లోని రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా అధికారులవరకూ వేసిన మాష్టర్ ప్లాన్ ఇది.. అవును మీరు చదువుతున్నది నిజమే.. విశాఖలోని అప్పుఘర్ వద్ద ఉన్న ఏపీటిడిసి రిసార్ట్స్ లో మరమ్మతుల పేరిట జరుగుతున్న నిలువు దోపిడీ రుషికొండ ప్యాలస్ ని మించి వుందంటే నమ్ముతారా..? నమ్మకం లేకపోతే మీరూ కూడా రూ.8 కోట్ల టెండర్ ఎస్టిమేషన్ ని ఇష్టాను సారం రూ. 14 కోట్లకు పెంచేసి నిధులు లాగేస్తున్న అధికారుల అవినీతి ఫైల్స్ పై కాలేసినట్టే.. మరమ్మతుల పేరిట ఏకంగా ప్రభుత్వ ఆదాయానికి మరో రూ.8కోట్ల నష్టాన్ని మిగిలిన ఏపీటిడిసి పేరుతో బొక్కేస్తున్న అధికారులను కూటిమి ప్రభుత్వం కూడా ఏమీ చేయడం లేదంటే అతిశయోక్తి కాదు..?!

విశాఖజిల్లాలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ భవనాలను మరమ్మతుల చేయడానికి, రూపు రేఖలు మార్చడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 8 కోట్ల రూపాయలకు టెండర్లు దక్కించుకున్నారు గుత్తేదారులు. అయితే గుత్తేదారులకు లాభం చేకూర్చడానికి విశాఖ జిల్లా నుంచి అమరావతి వరకూ ఇదే ఏపీటిడిసిలోని అధికారులు చక్రం తిప్పి మరీ రూ.8 కోట్లను కాస్తా ఖర్చులు పెరిగిపోయాని చెప్పి వాటిని ఏకంగా రూ.14 కోట్ల ఎస్టిమేట్లను పెంచేసి నేరుగా పనులు చేయిస్తున్నారు. అసలు టెండరు ఖరారు అయిన తరువాత ప్రభుత్వం అనుమతి లేకుండా ఇచ్చిన టెండర్ మొత్తం కంటే అధనంగా రెండు ఏ విధంగా నిధులు డ్రా చేసి పనులు చేపడుతున్నారో అధికారులకే తెలియాలి. 

ప్రభుత్వం ఇప్పటి వరకూ విడుదల చేసి ఈ మొత్తం నిధులతో విశాఖలోని అప్పుఘర్ ప్రాంతంలోని హరిత రిసార్ట్స్ స్థానంలో ఏకంగా కొత్త భవంతినే నిర్మించేయవచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్న సాంకేతిక లోపాలను వినియోగించుకున్న ఏపీటిడిసి అధికారులు గుత్తేదారుడిని అడ్డం పెట్టుకొని పెరిగిన ఖర్చులను చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవల కాలంలో పర్యాటకశాఖ మంత్రి కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎవరిని అడిగి చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినా.. దానిని పట్టించుకోకుండా వారి పని వారు చేసుకు పోతున్నారు. గత ఏడాది డిసెంబరులో మొదలు పెట్టిన ఈ పనుల కారణంగా ఇప్పటి వరకూ ఏపీటిడిసి ఏకంగా సుమారు రూ.8కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. 

విశాఖజిల్లాలోని పర్యాటక ప్రదేశాలను తిలకించడానికి, ఈ రిసార్ట్స్ పర్యాటకులకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి నెలకి సుమారు రూ. 60 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. అయితే మరమ్మతుల కారణంగా గత డిసెంబరు నుంచి పూర్తిగా ఆదాయం పడిపోయింది. దీనిని పట్టించుకోని ఏపీటిడిసి జిల్లా, రాష్ట్ర అధికారులు కేవలం టెండరు దారుడితో పనులు సా..గ దీస్తూ.. ఎస్టిమేషన్లు పెంచేస్తూ.. ప్రభుత్వం నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసి మరీ పనులు చేయిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ టెండరు దారుడిని మరమ్మతులకు రూ.5 కోట్లు, ఫర్నిచర్ కి రూ.3 కోట్లు కోట్లకు టెండర్లు ఖరారు అయ్యాయి.

 అయితే ఖర్చులు పెరిగిపోయాయని చెప్పి గుత్తేదారుడు మధ్యలోనే పనులు ఆపివేశాడు.. కాదు కాదు.. నిధులు అధికంగా రాబట్టడానికే ఏపీటీడీసీలోని రాష్ట్ర కార్యాలయంలో ఓ అధికారి ద్వారా పనులు నిలుపుదల చేయించి.. దానికి అధనంగా నిధులు మంజూరు చేయించారనే ప్రచారం జరుగుతుంది.  వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలైన ఈ పనులు ఇంకా సా..తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా వచ్చే ఆదాయం పూర్తిగా పోయి నష్టాలు వస్తూనే ఉన్నాయి. 

వాస్తవానికి గత ప్రభుత్వం విశాఖలోని హరిత రిసార్ట్స్ (యాత్రినివాస్) కి మరమ్మతుల ప్రభుత్వం టెండరు లో కేటాయించిన రూ.8 కోట్లతో ఆ ప్రదేశంలో నేరుగా కొత్త భవంతినే ఓ మహల్ మాదిరిగా కట్టవచ్చుననేది తర్డ్ పార్టీ ఇంజనీరింగ్, ఇంటీరియర్ డెకరేషన్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నమాట. ఎంత తిప్పి తిపి కొట్టినా మరమ్మతులకు, అదనపు హంగులకు రూ.3 కోట్లకు మించి అవదని.. ఫర్నిచర్ కి రూ.1.50 కోట్లు దాటదని చెబుతున్నారు. అదీ పేరు మోసిన కంపెనీల నుంచి కొనుగోలు చేస్తేనే అంత అవుతుందని ఆర్కిటెక్చర్ నిపుణులు కూడా చెబుతున్నారు. 

ఇక్కడ కూడా రాష్ట్రంలో చాలా మంది ఆర్కిటెక్చర్ నిపుణులు ఉన్నప్పటికీ ఏపీటీడిసిలోని ఓ అధికారి కావాలని ఒకే ఆర్కిటెక్చర్ కి ఈ అదనపు హంగుల పని కల్పించినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నికార్సైన  ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సంస్థలతో లెక్కలు గట్టించినా.. కొనుగోలు బిల్లులపైనా, నిర్మాణాలపైనా విచారణ జరిపిస్తే విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం వుంది. చూడాలి ప్రజాధనం ఈ విధంగా మరమ్మతులు.. బయట హంగులు, ఫర్నిచర్ల కోసం కోటాను కోట్లు గుత్తేదారులకు దోచిపెడతారా..? వాస్తవాలను కూటమి ప్రభుత్వం వెలికి తీస్తుందా.. ఇంటిదొంగలపై చర్యలు తీసుకుంటుందా..  అనేది..?!