ఏపీటీడీసీలో ఒడిసా ఇల్లరికరపు అల్లుడు..!


Ens Balu
95
visakhapatnam
2024-11-15 16:54:44

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలెప్ మెంట్ కార్పోరేషన్ లో ఇల్లరికపు అల్లుడిని రాష్ట్ర ప్రభుత్వం ముప్పుద్దులా పందెంకోడిలా పెంచి పోషిస్తున్నది.. నెల నెలా ఖర్చులకి రూ.5 లక్షలు సరిపోవని మరో రూ.5లక్షలు కలిపి రూ.10లక్షలు లెక్కగట్టి మరీ ఇస్తున్నది.. పనీపాట లేకపోయినా అప్పనగంగా డబ్బులు వచ్చి పడుతున్నాయేయో..బీచ్ నిర్వహణలో దగ్గరుండి చేయించడం మానేసి ప్రభుత్వం ఇచ్చే కాసులతో కదల్లేక.. మెదల్లేక కూర్చుండి పోతున్నాడా ఇల్లిరకపు అల్లుడు.. ఫలితంగా విశాఖలో సర్వాంగం సుందరంగా ప్రభుత్వ అదీనంలో నడిచే బీచ్ లన్నీ ఇపుడు.. చెత్త కంపు కొడుతున్నాయి.. వచ్చే ఆ కొద్దో గొప్పో పర్యాటకులు కనీసం మెయింటినెన్సులు లేని బీచ్ ను చూసి డోక్కుంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు.. అసలు ఈరోజు-ఈఎన్ఎస్ మీడియా వారికి పనీపాటా లేదా..?ఇల్లరికపు అల్లుడేంటి..? ఏపీటీడీసీ మెయింటినెన్సు కోసం అప్పనంగా తినడం ఏంటనే కదా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం..  వైఎస్సార్సీపీ హయాంలో ఏపీటీడీసీకి ఇల్లరికానికి వచ్చిన ఒడిస్సాకి చెందిన మెయింటెన్సు కాంట్రాక్టర్ విశాఖలోని బీచ్ ని బ్రష్టు పట్టించాడు.. పేరుకి మెయింటినెన్సు కాంట్రాక్టర్ అయినా ఖర్చులన్నీ ఏపీటీడీసీతోనే పెట్టిస్తున్నాడు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాడు. అయినా ఇల్లరికానికి వచ్చిన అల్లుడిని ఎలా చూస్తారో.. అంతకు పది రెట్లు ఏపీటీడీసీ ఈ మెయింటినెన్సు కాంట్రాక్టర్ ని పెంచిపోషిస్తున్నది. ఈ తేడా మెయింటినెన్సు వ్యవహారానికి సంబంధించిన అంశాలను గ్రౌండ్ లెవల్ రిపోర్టు పార్టు-3 గా అందిస్తున్నాం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఓ ఐఏఎస్ అధికారి తన బినామీతో పనులు చేయించుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్ కి రాష్ట్రప్రభుత్వం ప్రతీనెలా రూ.5లక్షలతో పోయే పనికి రూ.10లక్షలు చెల్లించాల్సి వస్తున్నది అదీ ఎలాంటి మెయింటినెన్సు చేయకుండానే. అదేంటి మెయింటినెన్సు చేయకుండా బిల్లులు ఎలా చెల్లిస్తారని మీకు అనుమానం రావొచ్చు. ఆ అధికారి తనకు అనుకూలంగా రాష్ట్ర కార్యాలయం నుంచి విశాఖజిల్లా వరకూ ఓ కోటరీని నిర్మించుకున్నాడు. దీనితో ఆయన చెప్పింది వేదం.. చేయమన్నది బిల్లు.. ఎంత దారుణం అంటే.. ప్రైవేటు కాంట్రాక్టర్ తీసుకున్న మెయింటినెన్స్ కాంట్రాక్టర్ టెర్మ్ అయిపోయినా.. ఇంకా సదరు సంస్థకు ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నారంటే ఆ ఐఏఎస్ అధికారి, తన కోటరీ అధికారులు ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడిచే సమయంలో ఆదాయంతోపాటు చాలా చక్కగా వుండే బీచ్ లన్నీ ఒడిసా కాంట్రాక్టర్ కి మెయింటినెన్సుకి ఇచ్చిన తరువాత బీచ్ లన్నీ చెత్త చెత్తగా తయారయ్యాయి. ఈ విషయాన్నీ మీడియా కోడై కూసినా.. పర్యావరణ ప్రేమికులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా.. ప్రభుత్వం ఈ తేడా పనులపై కనీసం విచారణ కూడా చేపట్టలేదంటే విశాఖ జిల్లా నుంచి అమరావతి వరకూ ఏ స్థాయిలో ఆ అధికారి కాసులతో లాబీయింగ్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.విశాఖజిల్లాలో పనులన్నీ చేయడానికి హరేరామ్ అనే ఉద్యోగి ఉండి కదమొత్తం నడిపించేవాడని చెబుతారు. ఈయనకి తోడుగా ఏపీటీడీసీ సంబంధం లేని అధికారికి డిప్యూటేషన్ పై ఇక్కడికి వచ్చి ఆయనతో కలిసి కథమొత్తం నడిపించేవారు. దానితో జిల్లా కలెక్టర్ కలుగ చేసుకోవడంతో ఇన్చార్జిగా వచ్చిన ఆర్డీ క్యాడర్ అధికారి శ్రీనివాస్ ని మాతృశాఖకు పంపించేశారు. ఒడిసా కాంట్రాక్టర్ గడువు పూర్తయిపోవడంతో ముందుగానే ఇక్కడ జాయింట్ మేనేజర్ గా పనిచేసిన హరేరామ్ కూడా రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిపోయారు.

కానీ కాంట్రాక్టు గడువు పూర్తయినా.. మళ్లీ టెండర్లు పిలిచి వర్క్ మెయింటినెన్స్ ఇవ్వాల్సిన ఏపీటీడీసీలోని రాష్ట్ర అధికారులు ఒడిసాకి చెందిన కాంట్రాక్టర్ నే పెంచి పోషిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు ఉద్యోగులు మెయింటినెన్సులు చేసినపుడే బీచ్ లన్నీ ఎంతో ఆహ్లాద కరంగా ఉండేవి. ఒడిసా సంస్ష చేతిలోకి వెళ్లాక మొత్తం బీచ్ లన్నీ వాటి స్వరూపాన్నే కోల్పోయాయి. పర్యాటకులు వచ్చినా కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకుండా చేసి బీచ్ లన్నింటిని సర్వనాశం చేసేశారు. గడువు దాటిపోయినా.. మళ్లీ ఈయనకే ఇప్పుడిచ్చే రూ.10 లక్షలకు మరో 5 లక్షలు కలిపి రూ.15 లక్షలతో మెయింటినెన్స్ కాంట్రాక్ట అప్పగిం చడానికి(ఖర్చులు పెరిగాయని చెప్పి)ఏపీడీసీలో ఆ ఐఏఎస్ అధికారి అనుచర వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బ్లాఫ్లాగ్ లెసెన్స్ రెవిన్యువల్ సమయంలో కూడా ఆ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిచింది.

లాబర్ నిబంధనలు ప్రక్కనపెట్టి ఉద్యోగులకు కనీసం పీఎఫ్ లు కూడా కట్టకుండా నెల నెలా టంచనుగా రూ.10 లక్షలు బిల్లులు లాగించేస్తున్నారంటే ఈ అధికార బృందానికి ఏపీటీడీసీలో ఎంతమంది సహకరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ ధనం కాంట్రాక్టర్ జేబులోకి.. కమిషన్లు ఆ ఐఏఎస్ అధికారివర్గానికి.. నిందలు, పనిష్మింట్లు పనిచేస్తున్నా సిబ్బందికీ దక్కుతున్నాయి. పర్యాటకం ముసుగులో భారీ ఎత్తున జరుతున్న ఈ అవినీతి వ్యవహారంపై పర్యాటక శాఖ మంత్రి కన్నెర్ర 
ప్రయోజనం లేకుండా పోయింది.. కార్పోరేషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆదేశాలు బుట్ట దాఖలయ్యాయి. ఇపుడు మిగిలింది విశాఖ జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగడమే.. ఇప్పటికైనా ఆ ఐఏఎస్ అధికారికి బినామీగా ఉన్న మెయింటెన్స్ కాంట్రాక్టర్ విషయంలో ప్రభుత్వం విచారణ జరిపించినా.. లేదా జిల్లా కలెక్టర్ చొరవ చూపినా ఆశక్తి కర అంశాలు వెలుగులోకి వస్తాయి.

చూడాలి ఆ దిశగా చర్యలు తీసుకుంటారా..? లేదంటే మీడియాని కాసుల కమిషన్లతో నోరు మూయించినట్టుగా  విశాఖ జిల్లా కలెక్టర్ ను కూడా దారి మళ్లిస్తారా అనేది.. ఏపీటీడీసీ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ ఎందుకు ప్రైవేటుకి ఇవ్వాల్సి వచ్చింది.. తరువాత ఇదే శాఖలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆ ఐఏఎస్ అధికారి అనుచరగణం ఏ స్థాయిలో ప్రభుత్వం నుంచి అడ్డగోలుగా మొత్తం మడత పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేసిందనే విషయాలు..ఏపీటీడీసీ చెప్పే హరికథలు పార్ట్-4లో గ్రౌండ్ లెవల్ రిపోర్టుతో మీ ముందుకి తీసుకు రాబోతున్నాం..?!