ఏపీటీడీసీలో ఆర్డీ పోస్టు కోసం కలెక్టర్ ని అవమానించారు..!


Ens Balu
72
visakhapatnam
2024-11-16 16:40:20

ఏపీటీడీసీ అధికారులు విశాఖజిల్లా కలెక్టర్ ని ఘోరంగా అవమానించారు.. అవును మీరు చదువుతున్నది నిజమే.. సొంతశాఖ అధికారులను కాదని పొరుశాఖ ఇరిగేషన్ లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి ఆర్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.. ఒక జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ ఐఏఎస్ అధికారిని కాదని.. ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్టే అప్పగించి.. కార్పోరేషన్ లో తేడా వ్యవహారాలు ఎక్కడ బయటపడిపోతాయోనని ఆర్ఢర్ నే మార్చేశారు.. అదనపు బిల్లులు ప్రభుత్వానికి లెక్కలు చూపించి బురిడీలను చేయడానికి పక్కా మాష్టర్ ప్లాన్ వేసుకున్నారు..ఇదేకాదు అడ్డగోలుగా వచ్చిన ఒడిసా కాంట్రాక్ట గడువు ముగిసినా.. మళ్లీ వాళ్లకే మెయింటినెన్స్ కాంట్రాక్టు ఇచ్చేలా పథకం కూడా వేశారు.. విశాఖలో ఏపీటీడీసీ ఆర్డీ పోస్టు కోసం ఉన్నఅధికారులను కాదని ఎందుకు క్కశాఖ అధికారులను ఇన్చార్జిలుగా తేవాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే పరిపాలనా సౌలభ్యం కోసం తమకి నచ్చిన వాళ్లే నియమిస్తామని.. ఆ విషయంలో జిల్లా కలెక్టర్ అయినా ప్రక్కన పెట్టేస్తామని బీరాలు పోతున్నారు ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు. ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం తెచ్చి ప్రైవేటుకి మెయింటినెన్స్ కాంట్రాక్టు అంత రెండింతలు కట్టబెట్టడానికి ఇదే శాఖలో మాజీ ఎండీ అనుచరగణమే అంతా ఓపక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టు కనిస్తున్నది. కూటమి ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రి, కార్పోరేషన్ చైర్మన్లే ఈ విషయంలో చేతులెత్తేశారంటే ఏ స్థాయి లాభియింగ్ జరుగుతోంది అర్ధం చేసుకోవచ్చుననే ఆరోపణలున్నాయి.. ఏపీటీడీసీలో అడ్డగోలు వ్యవహారాలపై ఈరోజు-ఈఎన్ఎస్ క్షేత్రస్థాయి పరిశోధన అంశాలు హరికథలు పార్ట్-4గా అందిస్తున్నాం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లక్షలు కాదు.. రూ.కోట్లలో నష్టం వచ్చినా పర్లేదు.. అది మన సొమ్ముకాదు.. దానికి పరిపాలనరమైన కారణాలు చూపించవచ్చు..  కానీ మనకి మాత్రం విశాఖజిల్లాలో జరిగే అధికారిక వ్యవహారాల్లో అనుకున్నంత టార్గెట్ మొత్తం పూర్తికావాలి. దానికోసం మనవాళ్లే అక్కడుండాలి.. అలా కాకపోతే అక్కడ ఏం జరిగినా అధికారికంగా అవాంతరాలు, అదనపు ఖర్చులు, మెయింటినెన్సు కాంట్రాక్టు విషయంలో ఎదురువుతాయని ముందుగా ఊహించిన ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు పర్యాటకశాఖకు సంబంధం లేని ఇరిగేషన్ ఈఈని ఇన్చార్జి ఆర్డీగా నియమించారు. వాస్తవానికి ఇదేశాఖలో ఆర్డీ క్యాడర్ స్తాయి అధికారులు ఉన్నా వారికి ఇన్చార్జిలు ఇవ్వకుండా..జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు రాష్ట్ర ఏపీటీడీసీ అధికారులు. 

ఇక్కడ గతంలో ఇన్చార్జి ఆర్డీగా పనిచేసిన శ్రీనివాసరావు సమయంలో భారీఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. దానితో ఆయనను మాతృశాఖ గణాంక విభాగానికి పంపించేశారు. మళ్లీ ఆ పోస్టులోకి తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఇరిగేషన్ శాఖ నుంచి ఈఈ రమణను ఇన్చార్జి ఆర్డీగా ఏపీటీడీసీ నియమించింది. ఈఈ క్యాడర్ కి ఆర్డీ క్యాడర్ కి చాలా వ్యత్యాసం ఉంది. అలాంటి వ్యత్యాసం ఉన్నప్పుడు ఆ పోస్టు ఎవరికీ కేటాయించకుండా దానిని జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంచుతారు. లేదా కలెక్టర్ కే అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఇక్కడే ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. జిల్లా కలెక్టర్ ను కాదని.. తమ ఆర్డర్లు మాత్రమే కలెక్టర్ అమలు చేయాలనే హుకుం జారీచేస్తూ.. ఇరిగేషన్ ఈఈని ఇన్చార్జి ఆర్డీగా బాధ్యతలు అప్పగించింది.

ఇరిగేషన్ ఈఈని ఇన్చార్జిగా నియమించడం వెనుక రెండు ప్రధాన లాభదాయ వ్యవహారాలు దాగి ఉన్నాయి. స్వతహాగా ఇంజనీర్ అయిన అధికారిని నియమిస్తే.. ఇప్పటికే మరమ్మతు పనులను దగ్గరుండి చేయించవచ్చు. అదే సమయంలో సాంకేతికపరంగా ప్రభుత్వం నుంచి పొందిన టెండర్లు కంటే అధనంగా బిల్లులు పెట్టడానికి కూడా అవకాశం వుంటుంది. మరోవైపు విశాఖలోని బ్లూఫ్లాగ్ బీచ్ మెయింటినెన్స్ వ్యవహారంలో రూ.5లక్షలతో పోయే పనికి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీనెలా రూ.10 లక్షలు ఇచ్చేయొచ్చు. వాస్తవానికి ఇక్కడ కాంట్రాక్టు గత నెలతోనే ముగిసిపోయింది. అలా ముగిసిపోయిన కాంట్రాక్టు స్థానంలో టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్ ను ప్రభుత్వం నియమించాలి. లేదా ప్రభుత్వానికి నష్టం వస్తుందని దానిని సంస్థ ఆధ్వర్యంలోనే నడిపించాలి. 

ఇక్కడే ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు చాలా చక్యంగా వ్యవహరించారు. విశాఖలో ఉన్న ఇన్చార్జి ఆర్డీని వెనక్కి పంపేశారు గనుక.. మళ్లీ ఆ స్థానంలో మరొక అధికారికి ఇన్చార్జి ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ కైనా అప్పగించాలి. అలా ఇన్చార్జి ఇవ్వాలంటే అదేశాఖలోని అధికారులకు ఇవ్వాలి.. అలా ఇస్తే.. ఇప్పటి వరకూ జరగని పనులకు బిల్లులు చెల్లించిన ఏపీటీడీసీకి లెక్కలు చూపించాలి. అదే తమకు అనుకూలంగా ఉన్న అధికారిని నియమిస్తే.. నెల నెలా మెయింటినెన్స్ కాంట్రాక్టు గడుపు పెంచుకుంటూ పోవచ్చు. దానిని దృష్టిలో పెట్టుకునే ఏపీటీడీసీకి ఎలాంటి సంబంధం లేని ఇరిగేషన్ ఈఈకి ఆర్డీగా బాధ్యతలు అప్పగించి కలెక్టర్ ను కాదని ఆర్డర్ ఇచ్చేశారు. ఇలా ఆర్డర్ వేయడంతో మాజీ ఎండీ కోటరీ అధికారులే ఈ రకంగా వ్యవహరించారనే చెబుతున్నారు. 

ఒడిసా కాంట్రాక్టర్ కి మెయింటినెన్స్ కాంట్రాక్టు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ప్రతీనెలా రూ.5లక్షలు లాసు.. అటు రిసార్ట్ ల మర్మత్తు పనుల వలన మరో రూ.8 కోట్లు లాసు. ఈ వ్యవహారాలన్నింటికీ రికార్డులు చూపించాలంటే రాష్ట్ర కార్యాలయ అధికారులు చెప్పినట్టు చేసే వారే విశాఖలో ఆర్డీగా ఉండాలి. ఇపుడు అదే చేసి కథ నడిపిస్తున్నారు ఏపీటీడీసీ అధికారులు.ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పోరేషన్ లో కోట్లాది రూపాయల నష్టం వస్తున్న విషయమై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేసినా రాష్ట్ర కార్యాలయ అధికారులు లైట్ తీసుకున్నారు. కార్పోరేషన్ చైర్మన్ బాలజీ తేడా పనులు, అధనపు బిల్లలు విషయమై నివేదికలు, బిల్లులు కావాలని అడిగినా, విచారణ చేయమని ఆదేశించినా.. జరిపిన విచారణ నివేదిక ఎక్కడుందో రాష్ట్ర అధికారులు చెప్పడం లేదు. 

అలాగని జిల్లాకి ముఖ్య, ప్రధాన అధికారి జిల్లా కలెక్టర్ సైతం ఈ విషయంలో వాస్తవ నివేదిక రాష్ట్రప్రభుత్వానికి పంపలేదు. కానీ ఇన్చార్జి వచ్చిన ఇరిగేషన్ ఈఈ ఆర్డీ క్యాడర్ లో తనకంటే క్యాడర్ ఎక్కువైన అధికారులపై కూడా జులం ప్రదర్శిస్తున్నారట. దీనిని జీర్ణించుకోలేని అధికారులు మూకుమ్మడి సెలవు పెట్టే దిశగా సమాలోచనలు చేస్తున్నారని సమాచారం అందుతుంది. కాగా జిల్లా కలెక్టర్ ని, ఇదే శాఖలోని అధికారులను కాదని నన్నే ఇక్కడి తననిఎందుకు పంపారో మీకు అర్ధం కావడం లేదన్నట్టుగా సదరు అధికారి వ్యవహరిస్తున్నతీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయంలో పెద్ద పెద్ద వాళ్లు తెరవెనుక ఉన్నారని.. తేడా పనులను ప్రశ్నిస్తున్నవారికి వార్నింగ్ హింట్ కూడా ఇస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. 

ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొట్టి బినామీల పేరుతో మెయింటినెన్స్ కాంట్రాక్టు పనులు, టెండర్ కంటే అత్యధికంగా మరో రూ.5కోట్లు కావాలని బిల్లు పెట్టి చేపడుతున్న వ్యవహారాలపై నిగ్గు తేల్చే విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకనో కినుక వ్యవహిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఈ మొత్తం వ్యహారంలో రాష్ట్ర కార్యాలయంలో మహిళా అధికారిణి చక్రం తిప్పుతున్నట్టు చెతున్నారు. ఈ తేడా వ్యవహారంలో తమ ఆదేశాలు అమలు కాలేదని చేతులెత్తేసినట్టుగా ఇదేశాఖలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం రూ.8 కోట్ల నష్టం, మరమ్మతులలో అదనపు ఖర్చుల విషయంలో నేటికీ ఎంక్వైరీ కమిషన్ వేయకపోవడం చూస్తే ఏం జరుగుతుందో  మేం వేరేగా చెప్పాలా..? కానీ చెబుతాం హరికధలు పార్ట్-5 లో బీచ్ మెయింటినెన్స్ లెక్కలు.. వాటి వెను ప్రభుత్వానికి బొక్క పడి కనిపించిన చుక్కల విషయం..?!