ఆంధ్రప్రదేశ్ లో పరిపాన చేస్తున్నది కూటమి ప్రభుత్వం కాదా..? అలా అయితే సీఎం చంద్రబాబు మార్కు ఎక్కడ..? సుపరిపాలన ఏది..? ప్రజలకు సేవకు సేవచేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత వరకూ అమలవుతున్నాయి.. నాలుగు నెలలకే ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేక ఎందుకు వచ్చింది.. కాదు కాదు వచ్చేలా ఎవరు చేస్తున్నారు.. ఆ రకమైన పాత పరిపాలననే మళ్లీ ఎందుకు చేపడుతున్నారు..? అసలు కూటమి పరిపాలనలో చంద్రబాబు మార్కు కనిపించకపోవడానికి పరిపాలనలో కోవర్టులుగా వ్యవహరిస్తున్నది ఎవరు..? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆదేశాలు ఎందుకు అమలు కావడంలేదు..?
విశాఖ ఏపీటీసీడిసీలో కోట్ల రూపాయల అవినీతి ఆధారాలతో సహా బయట పడితే దీని వెనుక ఉన్న గత ప్రభుత్వంలోని ఆ బుజ్జి కన్న ఐఏఎస్ ని ఎందుకు గుర్తించలేదు.. ఇంకా ఆయన ఆధ్వర్యంలో నడిచే గ్రూప్-1 అధికారులు ఎందుకు తమ ఇష్టాను సారం వహిస్తున్నారు..? ఇది ఒక్క ఏపీటీడీసీలోనే కాదు.. మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లోనే పరిస్థితి అలానే ఉంది..ఇదేదో మేము చెబుతున్న మాట కాదు కూటమి ప్రభుత్వానికి కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కొందరు ఐఏఎస్ లు, గ్రూప్-1 అధికారలు, ఏపీటీడీసీ లోని కొందరు అధికారులు తెరవెన చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే కారణమంటూ ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది..!
అవును మీరు చదువుతున్నది నిజమే కూటమి ప్రభుత్వంపై అతి కొద్ది నెలల్లోనే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడానికి ఇంకా పరిపాలనలో గత ప్రభుత్వ శేషం మిగిలిపోవడమే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు. అంతేకాదు బల్లగుద్ది మరీ వాదిస్తున్నాయి. వారి వాదనకు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి ప్రభుత్వం పరిపాలన అంశాలు కూడా. అసలు సీఎం చంద్రబాబు పరిపాలన అంటే ఒక విజన్, ఒక టెక్నాలజీ, ఒక సంపద, ఒక ముందు చూపు ఇవన్నీ ఉంటాయని ప్రభుత్వ అధికాకులు సిబ్బంది అనుకోవడం మానేస్తున్నట్టుగానే ఉంది. దానికి ఉదాహరణలుగా చాలా అంశాలనే ఉద్యోగులు అధికారులు నిర్భయంగా సామాజిక మాద్యమాల్లో చర్చకు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు పదోన్నతులు, కొత్తగా నియమాకాలు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరజైషన్, ప్రభుత్వశాఖల్లో దినసరి కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బంది నియామకం.
ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ఆదాయం పెంచుకునే మార్గాలు చూపించడం ఇవన్నీ సీఎం చంద్రబాబు పరిపాలనలో ఐఏఎస్ అధికారుల నుంచి గ్రూప్-1 అధికారులు ఆ క్రింది మినిస్టీరియల్ స్టాఫ్ వరకూ చూశారు. అయితే గత ప్రభుత్వంలో చాలా మంది ఐఏఎస్, గ్రూప్-1 అధికారులు, కార్పోరేషన్ లో పనిచేసే ఎండీలు, సిఈఓలు, డైరెక్టర్లు, కాంట్రాక్టర్లు, బినామీల అవతారం ఎత్తారు. ప్రైవేటు సంస్థల తెరవెనుక ఉండా చాలా గట్టిగానే సంపాదించారట. అదే విధానాలు ఇపుడు కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయని.. అసలెక్కడా చంద్రబాబు మార్కు పరిపాలన కనిపించడం లేదని ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నట్టు చెబుతున్న ఉద్యోగులు.. మరికొందరు ప్రజాప్రతినిధులు..
మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు.. ఆయన ముందుచూపు పరిపాలనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వారు తోడైతే దేశంలోనే ఆంధ్రప్రదశ్ నెంబర్-1 గా అవుతుందని అంతా భావించారు. వీళ్లు నిజంగా కన్నెర్ర చేస్తే మొత్తం పరిపాలనే గాడిన పడిపోతుందని అనుకున్నారు కూడా. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పోలీసు శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేయడం, రాష్ట్రంలో అత్యాచారాలు భారీగా పెరిగిపోవడం, నింధితులకు సరైన శిక్షలు పడకపోవడం కూడా చంద్రబాబు పరిపాలనపై ప్రభావం చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అంతేకాకుండా ఐదేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, అందునా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంతగానో ఆనందించారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరాగానే ఒక శాఖ పని కాకుండా అన్ని శాఖల పనులు సచివాలయ ఉద్యోగులతో చేయించడం,
రెండవ శనివారం, ఆదివారాల్లోనూ ఉద్యోగులను విధులకు రమ్మని చెప్పడం, పనిచేస్తున్నా మెమోలు, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేస్తామని ఉద్యోగులని బెదిరించడం వంటి అంశాలు కూడా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతున్నాయట. అంతేకాదు ఇటీవలన జరిగిన బదిలీల్లో కూడా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి కాకుండా గత ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్నవారికి ఆయాశాఖల్లో అధికారులు బదిలీలు అనుకున్న చోటుకి చేశారనే ప్రచారం భారీగా జరిగింది. కడుపు చింపుకుంటే కాళ్లపై పడుతుందని ఈ విషయాన్న కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు బయటకు చెప్పకపోయినా..వారి నుంచి సిఫారసు లేఖలు తీసుకొని అవి ప్రభుత్వశాఖల్లో చిత్తుకాగితాల్లా పక్కకి వెళ్లిపోవడంతో ఉద్యోగుల వారి సామాజిక మాద్యమాల్లో ఇదే అంశాలన్ని ప్రస్తావించుకోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది.
అంతేకాకుండా ఐఏఎస్ లకి ప్రభుత్వశాఖల కేటాయింపులు, గ్రూప్-1 అధికారులను ఏళ్లకు ఏళ్లు ఒకే చోట ఉంచేయడం, అవినీతి, తేడా వ్యవహారాలు బయటపడిన ఏపీటీడీసీ లాంటి కార్పోరేషన్లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వారికే పెద్ద హోదాలు కట్టబెట్టడం కూడా ఇపుడు హాట్ టాపిక్ అవుతున్నది. దీనితో కావాలనే కొందరు ఐఏఎస్ అధికారులు, గ్రూప్-1 అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పరిపాలన చేస్తున్నారని.. పనికొచ్చే సర్వేలు, ఉద్యోగులను వేళా పాలా లేకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ ఫీల్డులోనే ఉంచే కూడా సచివాలయ ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. ఈ సర్వేల కంటే ఒక్కో సచివాలయంలో పది మంది సిబ్బంది ఉన్నందుకు వారందరికీ కంప్యూటర్లు కేటాయించి, అన్ని రకాల సర్వీసులు సచివాలయాల నుంచి జరిగేలా ఆదేశిస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని చెబుతున్నారు.
అన్ని సర్వీసులు ఒకే చోట లభించడంతో ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి సేవలు పొందుతారని.. అలాకాకుండా సర్వేలు, జియో ట్యాగింగ్లు పేరిట ఇళ్లకు వెళుతుంటే అక్కడ సిబ్బందికి ఎదురయ్యే ఇబ్బందులు, చీత్కారాలతో ప్రభుత్వాన్ని, పరిపాలించే వారిని ఉద్యోగులు తిట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులవద్దే సిబ్బంది చెబుతున్నారు. విశాఖలో గత ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ.. రుషి కొండ ప్యాలస్ నిర్మించిన ఏపీటీడీసీ అధారులు ఇపుడు అదే స్థాయిలో హరిత మరమ్మత్తుల్లో పెద్ద ఎత్తున అవినీతి చేపడుతున్నా.. దీనిపై సాక్షాత్తూ టూరిజంశాఖ మంత్రి, కార్పోరేషన్ చైర్మన్ లు ఆగ్రహం వ్యక్తం చేసినా రాష్ట్రప్రభుత్వం ఇంకా ఈశాఖలో లాంగ్ స్టాండింగ్ కార్పోరేషన్ అధికారులపై చర్యలు తీసుకోకవడంపై మంత్రి కూడా గుర్రుగానే ఉన్నారట. ఇలా ఏ ప్రభుత్వశాఖలో చూసినా సీఎం చంద్రబాబు పారిపాలన కంటే గత ప్రభుత్వ శేషమే అధికంగా కేనిపిస్తుందంటూ.. అధికారులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ప్రజా పరిపాలన.. గత ప్రభుత్వ శేషాన్ని తొలగించి అందిస్తుందా..? లేదా అనేది వేచి చూడాలి..?!