విశాఖలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పోరేషన్ లో దొంగలు పడి మొత్తం ప్రభుత్వ రికార్డులతో సహా.. పాత ఏసీలు, ఫర్నిచర్, భవనాలు తొల గించగా వచ్చిన సామాగ్రి మొత్తం దోచుకుపోయారు.. పోయింది ప్రభుత్వ ఆస్తి కదాని అధికారులు కూడా లైట్ తీసుకున్నారు.. విశేషం ఏంటం టే.. పోయిన సామాగ్రితోపాటు వాటి వివరాలు రాసిన రికార్డులను కూడా దొంగలించుకుపోయారట బహుసా పోయింది ఎంతో తెలయ కూడద నో ఏంటో... ఆ విషయమై విశాఖజిల్లాలోని ఏపీటీడీసీ అధికారులు గానీ, రాష్ట్రంలోని ఏపీటీడీసీ ఎండీ కానీ, జిల్లా కలెక్టర్ కానీ అస్సలు నోరు మెదపడం లేదు. కాకపోతే ప్రస్తుతం హరిత రిసార్ట్స్ ను అభివృద్జి చేస్తున్న విషయంలో అధనంగా పెరిగినట్టు చూపించాల నుకున్న ఖర్చుని మాత్రం ఏ విధంగా కాంట్రాక్టర్ కి ఇప్పించాలనే కోణంలో మాత్రం చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు అధికారులు. ఒక ప్రక్కనెలకి లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయం పోతున్నా.. రుషికొండ,అప్పుఘర్ ప్రాంతంలో పాత భవనాలు తొలగించేసమయంలో వేరుచేసిన సామాగ్రి పోయినా.. ఏ ఒక్క అధికారీ కనీసం ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు.. !
ఏపీ పర్యాటక కార్పోరేషన్ భవనాలను రెన్నోవేషన్(మార్పులు, చేర్పులు) చేస్తున్న సమయంలో ఇక్కడ హోటళ్లలో మంచాలు, బీరువాలు, కుర్చీలు, బెంచీలు, ఏసీలు, పరుపులు, భవనాలు తొలగించగా వచ్చిన తలుపులు, ఇతర శానిటరీ సామాన్లు మొత్తం దొంగలు పడి దోచుకు పోయారట. పాపం.. పోయింది ప్రభుత్వ సొమ్మే కదాని అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదంతా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని.. తాను చార్జ్ తీసుకున్న సమయంలో జరగలేదని ప్రస్తుత ఆర్డీ కూడా నాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరి స్తున్నారట. ఏపీటీడీసీలో దొంగలు పడి దోచుకుపోయిన పాత ఏసీలు, ఇతర సామాగ్రి విలువ సుమారు రూ.4.50 కోట్ల వరకూ వుంటుందని అంచనా.
గత ప్రభుత్వం విశాఖలోని అప్పుఘర్, రుషికొండ ప్రాంతాల్లోని హోటళ్లను తొలగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినపుడే ఇక్కడి సామాన్లన్నీ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేసేశారట. అలా చెబితే తమపైకి వస్తుందని.. భారీ వస్తు సామాగ్రితోపాటు, ఆ వివరాలు రాసిన రికార్డులు కూడా దొంగలెత్తుకెల్లిపోయారని.. పోయిన వాటిపై పోలీసులకు ఫిర్యాదు ఇస్తే మాత్రం వెనక్కి వస్తాయాని రాష్ట్ర కార్యాలయ అధికారులు, జిల్లా కార్య లయ అధికారులు లైట్ తీసుకొని ఎవరికీ చెప్పడం మానేశారట. కాకపోతే ప్రభుత్వ సొమ్ము పైసా అయినా లెక్కలు ప్రభుత్వానికి చెప్పాలి కనీ సం ఆ విషయంలో కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
ఎంతసేపూ.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భనాలు పూర్తికాలేదని మాత్రమే తెరమీదకు తీసుకు వస్తున్న ఏపీటీడీసీ రాష్ట్ర కార్యాలయ అధికా రులు.. అసలు మరమ్మతులకు ముందు ఏ హోటల్ లో ఏ సామాగ్రి ఉంది.. వాటిని తొలగించి ఏంచేశారు.. గంపగుత్తగా టెండర్లు వేసి ఆ సొమ్ముని ప్రభుత్వానికి అప్పగించారా..? లేదంటే ఇక్కడ పనిచేసే అధికారులే వాటిని సొంత అవసారాలకు వాడుకున్నారా..? అదీ కాదంటే అవేమీ పనిచేయవని.. వట్టి స్క్రాప్ మాత్రమేనని పనిచేసిన వారికి ఉచితంగా ఇచ్చేశారా అనే విషయాలు కూడా బయటకు రానీయ కుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. ప్రభుత్వ ఆస్తి అయితే దొంగలెత్తుకుపోయినా.. ఆ పేరుతో అధికారులే తీసేసుకున్నా.. లేదంటే వారికి వెన్ను ద న్నుగా ఉండే అధికారుల ఇళ్లకు బాగు చేయించి పంపినా లెక్కలోనికి రావనేది తేలిపోయింది. కోట్లాది రూపాయలతో ప్రస్తుతం ఏపీటూరిజం కార్పోరేషన్ వారి భవనాలను, హోటళ్లను మార్పులు చేర్పులు చేస్తున్నది.
దీనితో దొరికిందే తడవుగా ఇక్కడ సామాగ్రి మొత్తం ఎవరు మడత పెట్టాశారో గట్టిగానే పెట్టేశారు. ఇంత జరిగినా ఏపీటూరిజం కార్పోరేషన్ ఎండీ, డైనమిక్ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి సైతం ఈ విషయంపై విచారణ చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇక్కడ మాయమై పోయిన వస్తువులు ఏమయ్యాయో కనీసం జిల్లా కలెక్టర్ కి కూడా తెలియలేదంటే ఇక్కడ పనిచేసిన అధికారులు వాటిని ఏంచేశారనేది తేలాల్సి ఉంది. నిజంగా అవి ఉంటే ఎక్కడున్నాయి..? అన్నీ ఉన్నాయా..? కొన్ని మాయమయ్యాయా అనేది ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయాల్సి వుంది. లేదా..పోయిన కోట్లాది రూపాయల ఆస్తులపై పోలీసులకైనా ఫిర్యాదు చేయాలి.. ఈ రెండూ నేటివరకూ చేయ లేదంటే తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. చూడాలి ఎండీ ఆమ్రపాలీ ఏం చేస్తారనేది..?!