వార్డు సచివాలయాలకు స్టేషనరీ నిధులు..! ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలపై జివిఎంసీ కమిషనర్ స్పందన


Ens Balu
76
visakhapatnam
2024-12-20 16:00:51

మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ తన వార్డు అడ్మిన్ ఆర్డిక కష్టాలను తీర్చే విషయంలో ఉదారతను చాటు కున్నారు.. ఇప్పటి వరకూ జోనల్ కమిషనర్లు పట్టించుకోకుండా వదిలేసిన స్టేషనరీ బిల్లులు చెల్లించడానికి ముందుకి వచ్చారు. వార్డు అడ్మి న్ల స్టేషనరీ ఆర్దిక కష్టాలపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనితో వాస్తవ పరిస్థితి తెలుసుకున్న జివిఎంసీ కమిష నర్ వచ్చే తక్కువ జీతాలతో వార్డు కార్యదర్శిలు మోస్తున్న స్టేషనరీ భారాన్ని తగ్గించేందుకు నెలకు రూ.1000 స్టేషనరీకి ఇచ్చేందుకు చర్యలు చే పట్టారు. దానిపై జివిఎంసీ పరిధిలోని 574 వార్డు సచివాలయాలకు వర్తించేలా  ఒక సర్క్యులర్ ను జారీ చేశారు..! 

విశాఖతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్ లలో వార్డు అడ్మిన్లు సచివాలయాల్లో వార్మడు అడ్మిన్ లు వారి సొంత ఖర్చులు పెట్టి స్టేషనరీ కొనుగోలు చేస్తున్నా.. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు. పైగా ఆమాత్రం ప్రజల కోసం ఖర్చుచేయలేరా అన్నట్టుగా వ్యవహరించేవారు. ప్రభుత్వం ఆదేశించిన పనులను సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక విధులు అప్పగించి పని పూర్తయ్యేవరకూ అదిరించి, బెదిరించి, కనీసం ప్రభుత్వం మంజూరు చేసిన సెలవులను కూడా ఇవ్వకుండా పనులు చేయించే కమిషనర్లు, జోనల్ కమిషనర్లు వీరి ఆర్ధిక ఇబ్బందులను పక్కన పెట్టేసేవారు. ఆఖరికి వార్డుల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు పనిచేయకపోయినా.. సిబ్బందే వారి సొంత ఖర్చులు పెట్టుకొని బాగుచేయించుకుని వాడే పరిస్థితి. 

ఆ కారణంగా ప్రభుత్వం సేవలు అందించడంలో చాలా ఆలస్యం అయ్యేది. ఆ విషయాలను అధికారులకు తెలియజేస్తే.. చూద్దాం.. చేద్దాం అంటూ కాలం నెట్టుకుంటూ వచ్చారు తప్పితే.. సిబ్బంది ఇబ్బందులను జోనల్ కమిషనర్లు, కమిషనర్లు, కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి మాత్రం తీసుకెళ్లలేదు. కానీ విశాఖపట్నంలోని జివిఎంసి కమిషనర్ డా.సంపత్ కుమార్ మాత్రం ఒక్క అడుగు ముందుకి వేసి ప్రభుత్వ సేవలకు వార్డు అడ్మిన్ సొంత ఖర్చులు చేయించడం బావ్యం కాదని.. వారికి కనీస ఖర్చులు ఇవ్వాలని వారికి నెలకి రూ.1000 అందించడానికి చర్యలు చేపట్టారు.  ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కష్టాలు, ఇబ్బందులను ప్రత్యేక కథనాల రూపంలో అందిస్తున్న ఈరోజు-ఈఎన్ఎస్.. వీరి పరిస్థితిని ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు.

 విశాఖజివిఎంసీ కమిషనర్ జారీ చేసిన ఆ సర్క్యులర్ ఇపుడు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నది.  తమ కష్టాలు అధికారుల దృష్టికి ప్రత్యేక కథనాలుగా తీసుకెళుతున్నందుకు గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులు ఈరోజు-ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. వాస్తవానికి మహా విశాఖ నగరపాలక సంస్థకు డాక్టర్ పి.సంపత్ కుమార్ కమిషనర్ గా వచ్చిన దగ్గర నుంచి భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. క్లీన్ విశాఖ-గ్రీన్ విశాఖ కార్యక్రమం దగ్గర నుంచి ఉద్యోగుల సంక్షేమం కూడా చూడటంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జివిఎంసీ పరిధిలోని 574 వార్డు సచివాలయ కార్యదర్శిలకు కాస్త ఉపసమనం కలగనుంది. అయితే ఇప్పటి వరకూ చేసిన ఖర్చులతోపాటు, పాడైన కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా రిపేర్లు చేయించి, పౌర సేవలకు అవాంతరాలు లేకుండా చూడాలని వార్డు అడ్మిన్లు కోరుతున్నారు. చూడాలి ఈ విషయమై జివిఎంసీ కమిషనర్ ఏ తరహా చర్యలు తీసుకుంటారోననేది..?!