ఆర్డీడి పోస్టు మాత్రమే ఇష్టం.. డాక్టర్ విధులంటే చాలా కష్టం..?!


Ens Balu
60
visakhapatnam
2025-01-06 18:49:22

నాకు ఇచ్చార్జి ఆర్డీడి పోస్టు వచ్చేసింది.. నాకు అస్సలు ఖాళీ ఉండదు.. కేజిహెచ్ లో ఆయుర్వేద డిస్పెన్సరీ ఓపీ కూడా ఇన్చార్జి ఆర్డీడి అయినా కూడా నేనే చూడాలా.. అంతగా చూడాల్సి వస్తే కమిషనరేట్ లో నాకు తెలిసిన అధికారులను మేనేజ్ చేస్తాను.. ఇక్కడ అంతా నా ఇష్టప్రకారమే జరగాలి.. అవసరం అయితే ఓపీలో కాంపౌండర్ తో డిస్పెన్సరీ నడిపిస్తాను.. కానీ రెగ్యులర్ గా ఆర్డీడి పనులు మాత్రమే చేస్తాను.. ఆయుష్ కమిషనర్ కి నేను ఎంత చెబితే అంత... నా ఇష్టం వచ్చినట్టే జోన్-1లో ఆయుష్ డాక్టర్లు అంతా పనిచేయాలి.. లేదంటే అందరినీ కమిషనరేట్ కి సరెండర్ చేసేస్తాను.. ఏంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. ఆయుష్ కమిషనర్ ఏమీ పట్టించుకోకుండా వదిలేయడంతో విశాఖలోని ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి వైద్యాధికారులపై చేస్తున్న రుబాబు.. వైద్యాధికారుల ఫిర్యాదులను బుట్టదాఖల వుతుండటంతో ఆర్డీడి ఇష్టాను వ్యవహరిస్తున్న విషయం వైద్యఆరోగ్యశాఖలోని ఆయుష్ లో చర్చనీయాంశం అవుతున్నది.

కేజిహెచ్ లో ఆయుర్వేద డిస్పెన్సరీ ఓపీలో వైద్యులు లేక రోగులు నీరసంగా వెనుతిరుగుతున్నారు. రోగులు వెళ్లే సమయానికి అటెండరో..ఫార్మసిస్టో ఉంటే మాత్రం మందులు ఇస్తారు..వారూ లేకపోతే అక్కడ ఎవరినీ అడిగేందుకు కూడా ఎవరూ ఉండదరు. ఇక్కడి ఆయుర్వేద ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ విధులు నిర్వహించాల్సి వుంది. అయితే ఆమెకు ప్రభుత్వం వైద్యాధికారితోపాటు గత కమిషనర్ ఈమెను ఇన్చార్జి ఆర్డీడిగా నియమిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చారు. దానితో ఆమె పూర్తిస్థాయి ఆర్డీడిగా అవతారం ఎత్తారు. పూర్తిగా డిస్పెన్సరీని గాలికి వదిలేస్తున్నారు. ఎవరైనా వచ్చి అడిగితే డాక్టర్ ఇప్పటి వరకూ ఉన్నారు.. మీరొచ్చే ముందే బయటకు వెళ్లారు అనే డైలాగును మాత్రం అక్కడి సిబ్బంది చెబుతున్నారు. 

కెజిహెచ్ ఓపీకి నిత్యం రావడానికి తెగ ఇబ్బందులు పడిపోతున్న ఆర్డీడి రెగ్యులర్ ఆర్డీడిలా మధురవాడలోని కార్యాలయానికి, మూడు జిల్లాల్లో డిస్పెన్సరీలకు మాత్రం రెగ్యులర్ గా వెళుతున్నారు. అదేమంటే ఇన్చార్జి ఆర్డీడిలు ఎక్కడైనా ఓపీ చూస్తారా.. అలా ఎక్కడైనా రూలుందా.. అయినా నాకు కమిషనరేట్ లో అందరూ తెలుసు.. మొన్నటి వరకూ అక్కడే చేసొచ్చాను. అందుకే నాకు ఇన్చార్జి ఆర్డీడి కూడా ఇచ్చారంటూ ప్రశ్నించినవారందరిపైనా ఒంటికాలపై లేస్తున్నారు. అంతేకాదు జోన్-1 పరిధిలోని ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు అందరినీ టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు వైద్యులు దైర్యం చేసి కమిషనర్ కి ఫిర్యాదులు చేసినా.. అక్కడ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలవుతున్నాయి. 

దానితో వైద్యాధికారులు ఫిర్యాదులేమీ కమిషనర్ వరకూ వెళ్లడం లేదుట. అలాగని విశాఖజిల్లాలోని జిల్లా కలెక్టర్ అయినా తెలుసా అంటే.. ఇన్చార్జి ఆర్డీడికి భయపడి ఎవరూ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేయడం లేదు. వాస్తవానికి యునానీ, హోమియో సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు రావాల్సిన ఆర్డీడి పదోన్నతి కాస్తా.. ఆయుర్వేద వైద్యాధికారికి దక్కింది. విశాఖలోని జోన్-1 మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్లలోనూ ఆయుర్వేద వైద్యులకు ఇన్చార్జి ఆర్డీడి పోస్టులు దక్కాయి.  విశేషం ఏంటంటే  రోస్టర్ విధానం, ఈమెకంటే సీనియర్లుగా ఉన్న హోమియో, యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ల  మాత్రం పదోన్నతి గానీ, ఇన్చార్జి పోస్టు గానీ రాలేదు. ఇన్చార్జి ఆర్డీడి పోస్టు వచ్చిందే తడవుగా ఆయుష్ సదరు అధికారి చేసే హడావిడి ఎక్కువ వైద్యసేవలు, పరిపాలన తక్కువ అన్నట్టుగా మారిపోయింది. 

సీనియర్ మెడికల్ ఆఫీసర్లను కూడా దూషిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మెడికల్ ఆఫీసర్లు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఉద్యోగ సంఘం ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన పోస్టుకి వైద్యాధికారులు సహకరించలేదనే నెపంతో కూడా పేరు పేరునా వైద్యాధికారులందరినీ బెదిరింపులకు గురిచేస్తూ.. కమిషనరేట్ కి సరెండర్ చేసేస్తానంటూ వేధిస్తున్నారి వైద్యాధికారులు వాపోతున్నారు. అంతేకాండా కమిషనరేట్ లోని ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా చేయని పనులకు కూడా తనకు అనుకూలంగా.. కాసులిచ్చి మీడియా పబ్లిసిటీ చేయించుకుంటూ.. తాను చాలా కష్టపడిపోతున్నానని.. ప్యాకేజీ వార్తలు రాయించుకుంటూ చలామణీ అయిపోతున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు.

 తాము ఎంత కష్టపడినా..డిస్పెన్సరీల్లో ఓపీలు చూస్తున్నా.. ఏదో ఒక కారణంతో దూషిస్తున్నారని వైద్యాధికారులు, క్రింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు-ఈఎన్ఎస్ కి కూడా పలువురు వైద్యులు, సిబ్బంది కూడా ఫిర్యాదులు చేశారు. ఈ విషయమై సదరు ఆర్డీడిని సంప్రదించగా ఆమె అందుబాటులో లేరు. ఇన్చార్జి ఆర్డీడీ పోస్టు అడ్డంపెట్టుకొని.. రెగ్యులర్ గా చేయాల్సి కెజిహెచ్ లోని డ్యూటీ డాక్టర్ పోస్టు ఎందుకు చేయడంలేదని.. అవసరం లేని వ్యవహారాల్లోకి వెళుతూ, వైద్యాధికారులను వేధిస్తున్న ఆర్డీడిపై విశాఖ జిల్లా కలెక్టర్ దృష్టిసారించి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం వుంది.

అదేవిధంగా రోస్టర్ విధానంలో పదోన్నతులు కల్పిస్తే.. అడ్డదారలో వచ్చిన ఆర్డీడి పోస్టు విషయంలో లంచాల వ్యవహారం కూడా బయటపడుతుందని వైద్యాధికారులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి ఆయుష్ కమిషనర్, జోన్ వన్ లోని ( ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లు జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఏం చేస్తారనేది..?!