నిన్న ఆసుపత్రులు మూయించి..నేడు వైద్యులతో బలవంతపు లేఖలు రాయించి..?!


Ens Balu
7
visakhapatnam
2025-02-01 19:36:50

కావాలని తప్పు చేయనేల.. చేసిన తప్పు ఆధారాలతో బయటపడి ఈరోజు-ఈఎన్ఎస్ లలో ప్రత్యేక కథనాలు రావడంతో ఎక్కడ క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారోనని మరో తప్పుచేయనేల.. ఏం రాసుకుంటారో రాసుకోండి.. ఎవరితో ఏం మాట్లాడాలో మాకు తెలుసునంటూ బీరాలు పోయి.. రాత్రికి రాత్రికి ఎంతో కొంత తీసుకొని వార్తలు రాయడం మానేయమని బేరసారాలు ఆడనేల.. వచ్చిన వైద్యులకి ఫోటోలు తీసి ముందు మీపై వార్తలు రాస్తామని చెప్పడంతో వచ్చిన తేడా డాక్టర్లు లగెత్తనేల.. ఇన్ని వ్యవహారాలు ఆయుష్ లో ఇన్చార్జి ఆర్డీడీ చేస్తున్నా రంటే.. నిజంగా సదరు అధికారిణి చెప్పినట్టుగానే ఆయుష్ కమిషనర్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు.. ఇతర కమిషనరేట్ సిబ్బంది వ్యవహరిస్తారేమో.. ఆధారాలతో సహా రెడ్ హేండెడ్ గా వైద్యులందరినీతో డిస్పెన్సీలన్నీ మూయించేసి.. రోగులు ఇబ్బందులకు కారణమైన జోన్-1 ఆర్డీడిపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి మరి..!

ఆయుష్ కమిషనర్.. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిలు నా చేతిలోనే ఉన్నారని.. నేను వారికి ఎంత చెబితే అంత అని బీరాలుపోయిన విశాఖజోన్ -1 ఆయుష్ ఆర్డీడీ ఇపుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే  ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనధికారికంగా వైద్యులను రిటైర్ మెంట్ ఫంక్షన్ కి వైద్యుల విధి నిర్వహణ సమయంలో విశాఖ రప్పించి వారితో సన్మానాలు చేయించుకున్న ఆయుష్ ఆర్డీడీ డా.ఝాన్సీలక్ష్మీభాయ్ వ్యవహారం ఈరోజు-ఈఎన్ఎస్ సంయుక్తంగా ఆధారాలతో సహాయ బయట పెట్టింది. దీనితో విధినిర్వహణ సమయంలో ఆసుపత్రులు మూసేసి ఎలా రిటైర్ మెంట్ ఫంక్షన్లు చేసుకుంటారని..ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆయుష్ కమిషనర్ మంజుల ఆదేశాలు జారీ చేయడంతో ఇపుడు చేసిన తప్పుని వైద్యుల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు విశాఖలోనీ ఆయుష్ ఆర్డీడి. అదీ ఎలా అంటే తమకు తెలియక యునానీ డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి వచ్చేశామని.. మొదటి తప్పుగా భావించి తమను క్షమించాలని.. కార్యక్రమానికి వచ్చిన వైద్యులందరితోనూ ముందస్తుగా లేఖలు రాయించుకుని కార్యాలయానికి తెప్పించుకున్నారు. 

దీనితో సదరు వైద్యులు ఈరోజు-ఈఎన్ఎస్ ని సంప్రదించి. తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా తమను బెదిరించి తమతో క్షమాప లేఖలు రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వైద్యుల డిస్పెన్సరీలు పేర్లు బయటపెట్టడం ఇష్టం లేక.. కాంక్రీట్ ప్రూఫ్ లు ఈరోజు-ఈఎన్ఎస్ చేతికి చిక్కాయి. అయితే ఈ విషయం కాస్తా బయటకు రావడం, ఆ తరువాత తమకు బాకా కొట్టే మీడియాలో జరిగిన సంఘటన రాకుండా వారికి ముడుపులు ఇవ్వడం అన్నీ చక చకా జరిగిపోయాయని వైద్యులే చెబుతున్నారు. తాము రామన్నా.. బలవంతంగా కార్యక్రమానికి పిలిపించి.. ఒక్కొక్కరి నుంచి రెండువేలు పార్టీకి వసూలు కూడా చేశారని ఇపుడు తీరా.. తామే తప్పు చేసినట్టుగా.. క్షమాణ లేఖలు ఆయుష్ ఆర్డీడికి, కమిషనర్ కి రాయమని చెప్పడం ఏంటని వైద్యులు మండి పడుతున్నారు.  ఒక వేళ తప్పు చేసినట్టు కమిషనర్ ఇపుడు తమపై చర్యలు తీసుకుంటారేమోనని భయంగా కూడా ఉందని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. సదరు ఆర్డీడి వచ్చిన దగ్గర నుంచి చేసే వ్యవహారాలకు తాము మధ్యలో బలైపోతున్నామని వైద్యులు గగ్గోలు పెడుతున్నారు. 

అయితే ఆర్డీడి విషయంలో మీడియాలో వెలుగుచూస్తున్న వాస్తవాలు, ఆమెపై విచారణ కు ఆదేశించిన విషయాలు అమరావతి నుంచే కొందరు తేడా అధికారులు, సిబ్బంది ఆర్డీడికి ఉప్పందించడంతోనే.. ముందస్తుగా క్రమశిక్షణా చర్యలు పడకుండా వైద్యులతో క్షమాపణ లేఖలు రాయిస్తున్నట్టు తెలిసింది. ఆ విధంగా చేస్తే మెమోకానీ, సస్పెన్షన్ గానీ పడకుండా కేవలం వార్నింగ్ సరిపోతుందని అపుడే కమిషనర్ కార్యాలయం నుంచి ఆర్డీడికి సమాచారం వచ్చిందట. అయితే సదరు విషయంపై ఆర్డీడికి భజనలు చేసే కొందరు వైద్యులు శనివారం రాత్రి ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధులను సంప్రదించి.. ఇకపై మా ఆర్డీడిపై ఎలాంటి వార్తలూ రాయకుండా ఉండాలంటే ఎంతకావాలని బేరసారాలు కూడా జరపడం విశేషం. 

వాస్తవాలను బయట పెట్టే సమయంలో మీకు నచ్చింది రాసుకోమని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పి ఆర్డీడి ఇపుడు ఏ మొహం పెట్టుకొని మిమ్మల్ని పంపించారని.. ముందు మీ ఫోటోలు, వివరాలతో న్యూస్ రాస్టే సరిపోతుందని చెప్పడంతో ఆగమేఘాలపై ఆ వైద్యులు బిచానా సర్దేశారు. ఇదే విషయాన్ని కమిషనర్ మంజుల దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు-ఈఎన్ఎస్  ప్రయత్నం చేసినా అమె అందుబాటులోకి రాలేదు. దీనిని బట్టి చూస్తుంటే ఇన్చార్జి ఆర్డీడిగా ఉన్నప్పుడే ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కేసి.. ఆ తప్పులను డిస్పెన్సీ వైద్యులకు మీదకి నెట్టేసి.. చల్లగా తప్పించుకోవాలని.. తాను చెప్పినట్టే అంతా జరగాలని చూసే ఆర్డీడిలు నిజంగా పదోన్నతిపై రెగ్యులర్ ఆర్డీడిలు అయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఆయుష్ కమిషనర్, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిలే ఆలోచించుకోవాల్సి వుంది..!