ఆయుష్ లో జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి అనుకున్నదే జరగాలి..కమిషనర్ లేదు.. ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అసలే లేరు.. ఏదైనా సొంత నిర్ణయం తీసుకొని అమలు చేసేస్తారు.. చేసిన తప్పులన్నీ అధారాలతో సహా కనిపిస్తున్నా.. ఆయుష్ కమిషనరేట్ అధికారులు కనీసం సదరు ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ పై వెంట్రుకవాసి చర్యలు కూడా తీసుకోరు. అదేమంటే కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు నేను ఎంత చెబితే అంత.. అసలు ఆయుష్ నా సలహా లేకుండా ప్రభుత్వ జీఓ కూడా తయారు కాదు.. కమిషనరేట్ లో ఎవరీ ఏమీ రాదు.. అన్నీ నేనే చెప్పాలి తెలుసా అంటూ సిబ్బంది ముందే పదే పదే మాట్లాడతారు.. ఆ వాయిస్ రికార్డులన్నీ నేరుగా కమిషనర్ కి చేరినా.. ఫలితం శూన్యం.. ఇపుడు అదే దైర్యంలో తన సొంత నిర్ణయాలతో విశాఖలోని మధురవాడలో ఉన్న ఆయుష్ ఆర్డీడి ప్రాంతీయ కార్యాలయాన్ని విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోకి మార్చేయడానికి ప్లాన్ వేశారు ఆర్డీడి.
ఏ ప్రభుత్వశాఖ అయినా, అధికారులైనా తమకు సొంత కార్యాయాలు, ప్రదేశాలు ఉండాలని కోరుకుంటారు. కానీ ఆయుష్ శాఖలోని ఇన్చార్జి జోన్-1ఆర్డీడి మాత్రం. తన సొంత తెలివి వివియోగించి ఈ శాఖ సొంత ఆస్తులు వదించుకొని.. పొరుగింటి పుల్లకూర కూర రుచి అన్నట్టుగా విమ్స్ ఆసుపత్రిలో ఆర్డీడి కార్యాలయం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా విమ్స్ డైరెక్టర్ తో కూడా మంతనాలు జరిపేశారట. ఆయుష్ శాఖకు చెందిన ఆసుప్రతి బ్లాక్ విమ్స్ లో సిద్దమవుతుంది. అది పూర్తయ్యేలోగా ఆర్డీడి కార్యాలయాన్ని కూడా అదే విమ్స్ లోకి తరలించేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు ఆర్డీడీ. ఇంతకీ ఆయుష్ కమిషనర్ కి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ విషయం చెప్పారా అంటే అదేం అవసరం లేదు. నేను నిర్ణయం తీసుకుంటే చాలు అంటున్నారు.
రేపే..మాపో ఆయుష్ ఆర్డీడి కార్యాలయాన్ని కూడా అనుకున్నప్రదేశాన్ని తరలించేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిని వైద్యులు, కమిషనరేట్ అధికారులు విబేదిస్తున్నా ఎవరి మాట పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, తరలింపు ఇతర ఆసుపత్రుల్లో కార్యాలయాలు పెట్టాలంటే ఆయుష్ కమిషనర్ అనుమతి ఉండాలి. కానీ ఇక్కడి ఇన్చార్జి ఆర్డీడి మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇటీవలే యునానీ వైద్యుడి రిటైర్ మెంట్ ఫంక్షన్ కి ఆయుష్ డిస్పెన్సిరీలన్నీ డోర్ లాక్ వేయించి మరీ విశాఖలోని జిల్లా పరిషత్ డాక్టర్ తోపాటు.. ఈమె కూడా చక్కటి సన్మానం చేయించుకున్నారు. అ విషయం మీడియాలో రావడంతో తనపై ఎక్కడ కమిషనర్ కన్నెర్ర చేస్తారోనని ముందుగానే కమిషనరేట్ లోని తన అనుచరుల ద్వారా సమాచారం తెలుసుకొని వైద్యులను బెదిరించి మరీ క్షమాపణ లేఖలు రాయించారు. అదీ కూడా మీడియాలో వచ్చేసింది.
అయినా ఈమెపై కమిషనర్ మంజుల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలే ఇన్చార్జి ఆర్డీడి సీటులోకి కూడా రోస్టర్ పాయింట్, సీనియారిటీని పక్కనపెట్టి గత తేడా ఆయుష్ కమిషనర్ ద్వారా ఇన్చార్జి ఆర్డీడి పోస్టు కొట్టేశారని ఇప్పటికీ సీనియర్ వైద్యులు నెత్తీ నేరూ కొట్టుకుంటున్నారు. ఇపుడు అదే ఇన్చార్జి ఆర్డీడి పోస్టుని అడ్డం పెట్టుకొని ఇస్టానుసారం వ్యవహరిస్తున్న ఆయుష్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మధురవాడలోని సొంత కార్యాలయాన్ని విమ్స్ లోనికి తరలించడానికి ఏమైనా అనుమతులు ఇచ్చారానే అనేవిషయం తెలుసుకోవడానికి కమిషనర్ ను సంప్రదించినా ఎలాంటి సమాధానం రాలేదు. చూడాలి తప్పుల మీద తప్పులు చేస్తూ.. ఇష్టాను సారం వ్యవహరించే జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో ఆయుష్ కమిషనర్ లేదా.. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది..?!