జోన్-1 ఆయుష్ వైద్యులపై ఇన్చార్జి ఆర్డీడి వేధింపుల పర్వం..! దళిత వైద్యులపై కులం పేరుతో దూషణలు


Ens Balu
46
visakhapatnam
2025-02-14 16:47:02

డ్యూటీ టైమ్ లో డిస్పెన్సరీలు మూయించి.. డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ పెట్టాను.. పేపర్ లో వచ్చింది ఏమైనా చేయగలిగారా.. ఆ తప్పు మీరే చేసినట్టుగా సంజాయిషీ లెటర్లు రాయించాను అదీ మీడియాలో వచ్చింది అపుడూ ఏమీ చేయలేకపోయారు కదా.. ఆర్డీడి కార్యాల యాన్ని విమ్స్ లోకి తరలిస్తున్న విషయాన్ని మీడియాకి లీక్ చేశారు.. అయినా కమిషనర్ మంజుల, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యద ర్శి ఎంటీ క్రిష్ణబాబు ఇద్దరూ ఏమీ చేయలేకపోయారంటే నా రేంజ్ ఏంటో మీకు ఇంకా అర్ధం కాలేదా.. మీరెన్నిసార్లు మీడియాలో రాయించినా నా టీమ్ కమిషనరేట్, సెక్రటేరియట్ లో పనిచేస్తుంది.. నాపై ఈగ కూడా వాలనివ్వరు.. అంతెందుకు రోస్టర్ పాయింట్స్ ని కాదని నేను ఇన్చార్జి ఆర్డీడిగా రాగలిగానంటే నా నెట్వర్క్ ఏ స్థాయంలో ఉందో మీకు ఇంకా అర్ధం కాలేదా..? నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. నేను మోనా ర్కురా లిని.. ఏంటి ఇవేవో సినిమాడైలాగులనుకుంటే.. తప్పులో కాలేసినట్టే.. అక్షరాలా ఆయుష్ లోని జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ వైద్యులను బెదిరించే తీరు..!

ఆయుష్ శాఖలో డబ్బున్నవారిదే రాజ్యం అనడానికి విశాఖ జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ ఇన్చార్జి ఆర్డీడీ పోస్టు ఒక ప్రధాన ఉదాహరణ అయితే దానిని అడ్డం పెట్టుకొని వైద్యులను వేధించే తీరు మరీ విడ్డూరంగా ఉంది. చేసిన తప్పులు ఆధారాలతో సహా మీడియాలో వచ్చేస్తే.. దానిని తట్టుకోలేకపోతున్న ఆర్డీడీ డిస్పెన్సరీ వైద్యులను టార్గెట్ చేశారట. ఆసుపత్రులకు వెళ్లి కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారట. అయిదే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఏమైనా అంటే ఈ విషయం బయటకు రాకపోయేది. ఆ కుల దూషణ జరిగింది దళిత వైద్యులపై దానితో ఈ విషయం కాస్తా గుప్పుమని బయటకు వచ్చేసింది. విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడిగా డా.ఝాన్సీ లక్ష్మీభా య్ విధుల్లో చేరిన దగ్గర నుంచి వైద్యులు, సిబ్బంది నరకం చూస్తున్నామని లబో దిబో మంటున్నారు. 

అదే సమయంలో ఈమె చేస్తున్న వ్యవహారాలన్నీ ఆధారాలతో సహా మీడియాలో వచ్చినా ఈమెపై కమిషనర్ మంజుల, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబులు సైతం చిన్న చర్య కూడా తీసుకోలేదంటే ఏ స్థాయిలో సదరు ఆర్డీడీ నెట్వర్క్ నడుపుతున్నారో అర్ధమ వుతున్నది. అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడి పోస్టులోకి వచ్చిందే మొదలు అంతా కలక్షన్ పైనే గురిపెట్టారని.. అడిగిన మొత్తం ఇవ్వకపోతే డ్యూటీ లు సక్రమంగా చేయడం లేదని రిమార్కులు రాస్తానని బెదిరిస్తున్నారని వైద్యులు వాపోతున్నారు. తాము విధినిర్వహణలో ఉన్నసమ యంలో కావాలని విశాఖలోని జిల్లా పరిషత్ లో డ్యూటీ టైమ్ లో యునానీ డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి రప్పించారని చెబుతున్నారు. ఆ విషయం పేపర్ లో ఆధారాలతో పాటు వచ్చిన తరువాత.. దాని నుంచి తప్పించుకోవడానికి మళ్లీ తమను బెదిరించి క్షమాపన లేఖలు కూడా రాయించా రని చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన వైద్యులను కూడా విధినిర్వహణ పేరుతో వేధిస్తున్నారనే ఆరోపణ లున్నాయి.

 కొత్తగా డ్యూటీలో చేరినపుడు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చే సమయంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10వేలు తీసుకున్నారని.. ఇపుడు మళ్లీ ఎస్ఆర్ లు ఓపెన్ చేయడానికి మరో రూ.5వేలు డిమాండ్ చేస్తున్నారని.. అవి ఇవ్వని కారణంగా విధినిర్వహణలో అలసత్వం అంటూ విశాఖ ఆర్డీడి కార్యాలయానికి రప్పించి మరీ అమ్మనా బూతులు తిట్టడంతోపాటు, కులం పేరుతోనూ, ఆచార వ్యవహారాల పేరుతోనూ దూషిస్తున్నారని ఆవేదన చెంతున్నారు. కాగా కులదూషణ ఎదుర్కొంటున్న వైద్యుల ఫిర్యాదులను కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రరటీలు పట్టించుకోకపోవడంతో వీరంతా లోకాయుక్తాను, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. నిజంగా అదే జరిగితే పరిపాలనా పరమైన నిర్లక్ష్యం పేరుతో ఆయుష్ కమిషనర్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబులు సమాధానం చెప్పాల్సి వుంటుంది. విశాఖ ఇన్చార్జి ఆర్డీడి డా.లక్ష్మీభాయి అడ్డగోలు ఇన్చార్జి అపాయింట్ లో లుక లుకలపై విచారణ చేసినా.. ఇటీవల కాలంలో ఆర్డీడి విధినిర్వహణ సమయంలో జిల్లా పరిషత్ లో ఏర్పాటు చేసిన ఉద్యోగవిరమణ కార్యక్రమంపై విచారణ చేసినా, ఉద్యోగులను కులం పేరుతో దూషిస్తున్న విషయమై విచారణ చేపట్టినా ఆధారాలతో సహా వాస్తవాలు వెలుగుచూసే అవకాశం వుంది. చూడాలి ఇప్పటికైనా కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రరటీలు ఏ విధంగా స్పందిస్తారనేది..?!

సిఫార్సు