ఆయుష్ లో దళిత ఉద్యోగిపై చేయి చేసుకున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్..!


Ens Balu
53
visakhapatnam
2025-02-18 15:20:32

నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. ఏం పీకలేరు.. నిన్ను కొట్టినా నా వర్గం మీడియా అంతా నేను చెప్పిందే రాస్తారు.. ఎవరేంచేసినా నేనే ఇక్కడే ఆర్డీడిగా కొనసాగుతాను.. నేను కమిషనరేట్ లో ఎవరికి ఏం చేయాలో అది చేశాను.. నా నెట్వర్క్ వినియోగించి ఇన్చార్జి ఆర్డీడిగా వచ్చానంటే మీకు ఈపాటికే అర్ధం అయిపోవాలి.. ఇంకా నా నెట్వర్క్ సంగతి మీకు తెలీదు.. నేను గీసిన గీత కార్యాలయం సిబ్బంది దగ్గర నుంచి నాకు అనుకూలంగా ఉన్న వైద్యులతో సహా ఎవరూ దాటరు.. నువ్వేం చేసుకుంటావో చేసుకో.. నిన్నుకొట్టిన విషయానికి రుజులేవి.. నువ్వూ నన్ను కొట్టావని కంప్లైంట్ చేస్తాను.. నేను అధికారిని నా మాటే చెల్లుతుంది.. నువ్వు ఆఫ్ట్రాల్ సబార్డినేట్ వి.. నన్నే మీడియాకి ఎక్కిస్తారా.. నాపై వార్తలు రాయిస్తారా.. ఏం నేను రాయించుకోలేనా.. నా చేతులో పేపర్లు లేవా..? విలేఖరులు లేరా.. ఏం చేసుకుంటావో చేసుకో.. ఎవర్ని ఏ పాయింట్ మీద ఇరికించాలో నాకు తెలుసు.. కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుల్లో నాపై కంప్లైంట్ పెట్టినా.. అక్కడంతా నావాళ్లే ఉన్నారు..నేను ఏం చేయాలో నేను చేయగలరు.. ఇదీ ఒక దళిత ఉద్యోగిపై చేయిచేసుకోవడంతోపాట.. కులం పేరుతో దూషించడంతోపాటు క్రిందిస్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నా  ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ తీరు..! 

విశాఖలో ఆయుష్ జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్  ఉద్యోగులపై వేధింపులు పరాకాక్షష్టకు చేరుకొని క్రిందిస్థాయి దళిత ఉద్యోగిపై చేయి చేసుకునే వారకూ వచ్చాయి. మంగళవారం విశాఖలోని మధురవాడ ఆయుష్ ఆర్డీడీ కార్యాలయంలో ఇన్చార్జి ఆర్డీడి కార్యాలయ  దళిత ఉద్యోగిని సుష్హపై కులందూషణ చేయడంతోపాటు చేయిచేసుకున్నారు. దీనితో ఈ విషయాన్ని సదరు దళిత ఉద్యోగిణి ఆయుష్ కమిషనర్ డి.మంజులకి ఫిర్యాదు చేశారు. ఆ వెనువెంటనే ఇన్చార్జి ఆర్డీడి కూడా కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.  అయితే తనపై కమిషనర్ కి ఫిర్యాదు చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ దూషించడంతో, అవమానభారం తట్టుకోలేక ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల ప్రతినిధులు కూడా ఆమెకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఇన్చార్జి ఆర్డీడి తనపై చేయిచేసుకున్న విషయమై బాధితులు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. 

సందట్లో సడేమియా అన్నట్టు ఇన్చార్జి ఆర్డీడి ఆయుష్ కార్యాలయాన్ని కూడా ఇదేరోజు విమ్స్ ఆసుపత్రికి ఆఘమేఘాలపై తరలించేశారు. అయితే ఈ విషయాలన్నీ బయటకు తెలియజేస్తున్నారని.. మీడియాలో వార్తలు ఎలా వస్తున్నాయని.. కార్యాలయ సిబ్బందే విషయాలన్నింటినీ మీడియాకి తెలియజేస్తున్నారంటూ కార్యాలయ సిబ్బందిపై ఇన్చార్జి ఆర్డీడి తిట్ల దండం మొదలు పెట్టారు. అయితే తొలుత కార్యాలయంలో సిబ్బందితో సమావేశం పెట్టి మాట్లాడి నట్టుగా మాట్లాడి.. ఉన్నతాధికారికి నమస్కారం కూడా లేచి ఒంగొని చెప్పలేదనే విషయమై గొడవకు దిగిన ఇన్చార్జి ఆర్డీడి గొడవ ముదిరేలా కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారు. అయితే అప్పటికే తన అనుకూల మీడియా కార్యాలయం బయట ఉండటం, గొడవ జరిగిన వెంటనే లోనికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఉద్యోగినిపై దాడి జరగడంతో పోలీసు బాధిత ఉద్యోగిని ఫోన్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల నుంచి స్టేట్ మెంట్లు స్వీకరించారు. కావాలనే తనపై ఒక వర్గం మీడియా వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ ఇన్చార్జి ఆర్డీడి ఒంటికాలపై లేచారు. తాను ఎవరికీ సమాధానం చెప్పనని.. ఏం కావాలన్నా కమిషనర్ నే అడుక్కోవాలంటూ కార్యాలయం నోనికి వెళ్లిపోయారు. గొడవ జరిగిన రోజున మధురవాడలోని సొంత స్థలంలో ఉన్న ఆయుష్ కార్యాలయాన్ని తరలించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీబాయ్, దళిత ఉద్యోగిని సుష్మపై చేయిచేసుకున్న విషయమై కమిషనర్ డి.మంజులను ఈరోజు-ఈఎన్ఎస్ వివరణ కోరగా.. విధి నిర్వహనలో ఉన్న ఉద్యోగులు గొడవలు పడటం నేరమని.. అందునా ఇన్చార్జి ఆర్డీడి క్రింది స్థాయి ఉద్యోగిపై చేయి చేసుకోవడం కూదా తప్పేనని హెచ్చరించామన్నారు.

 అంతేకాకుండా విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై వైద్యులు కూడా పలు ఫిర్యాదులు చేశారని..అన్నింటిపైనా విచారణ చేసి, వాస్తవాలు తేలితే చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ ని వివరణ కోరేందుకు చరవాణిలో ప్రయత్నించగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆయుష్ కార్యాలయంలో జరిగిన గొడవ, ఆందోళనకు దిగిన ఉద్యోగుల వీడియోలు, ఆయోడియో రికార్డింగ్ లు, ఇన్చార్జి ఆర్డీడికి అనుకూలంగా వ్యవహరించిన కొందరు అనుకూల మీడియా హాడావిడి సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. వీడియోలన్నీ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి క్రిష్ణబాబు, విశాఖజిల్లా కలెక్టర్ ఎం.హరేంధిరప్రసాద్ కు చేరడం ఆయన విచారణ చేస్తామని చెప్పడం విశేషం.

సిఫార్సు