అనుకున్నదొక్కటి.. అయ్యింది ఇంకొక్కటి..?! గేట్లు మూసేసిన విమ్స్ సిబ్బంది


Ens Balu
99
Visakhapatnam
2025-02-19 20:15:38

డామిట్ కథ అడ్డం తిరిగింది.. మనం ఒకటి అనుకుంటే విమ్స్ ఆసుపత్రి అధికారులు ఇంకోలా చేశారు.. మధురవాడలోని సొంత కార్యాల యం బాగాలేదని కమిషనర్ ని ఒప్పించి మరీ  ఖాళీచేసేయాలనుకుంటే.. ఆదిలోనే విమ్స్ అధికారులు గాలి తీసేశారు... ఆయుష్ ఆర్డీడి కార్యాలయానికి గదులు ఇస్తామని చెప్పారని తట్టాబుట్టా సర్దేసుకొని వెళితే గేట్లు మూసేసి అవమానించారే.. చఛా అందరి ముందు పరువు పోయింది..నేనేదో దర్జాగా విమ్స్ ఆసుపత్రిలో ఆయుష్ ఆర్డీడి కార్యాలయం పెట్టాలనుకుంటే.. మొత్తానికి అంతా బెడిసి కొట్టింది.. విమ్స్ ఆసుపత్రిలో కార్యాలయం ఇప్పిస్తామని చెప్పిన ఓ మంత్రి కార్యాలయ సిబ్బంది కూడా ఆఖరి నిమిషంలో ప్లేటు తిప్పేయడంతో ఏం చేయాలో తెలీక.. విమ్స్ సిబ్బంది గేట్లు మూసేయడంతో ఇన్చార్జి ఆర్డీడి అనుచరగణం.. కార్యాలయం ప్రారంభ వార్తలు బాగా రాసేద్దామని వచ్చిన అనుకూలా మీడియా చిరాకుతో వెనుతిరగాల్సి వచ్చింది..! 

  
నన్ను ఎవరూ ఆపలేరు.. నేను ఖచ్చితంగా విమ్స్ ఆసుపత్రిలోకి  ఆయుష్ ఆర్డీడి కార్యాలయాన్ని తరలిస్తాను.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని బీరాలు పోయి తట్టబుట్టా సర్దేసుకొని విమ్స్ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్, కార్యాలయ సిబ్బంది చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సామాన్లతో విమ్స్ ఆసుపత్రిలోకి వెళ్లాలని ప్రయత్నం చేయడంతో అక్కడి సిబ్బంది ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఎవరినీ లోనికి పంపవద్దని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో వెంటతెచ్చుకున్న సామాన్లతో తిరిగి మళ్లీ మధురవాడ వెళ్లాల్సి వచ్చింది. మంగళవారం జోన్-1 ఆయుష్ ఆర్డీడి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సుష్మ అనే దళిత ఉద్యోగిపే చేయి చేసుకోవడం, కులం పేరుతో దూషించడం, ఆమె దళిత సంఘాల నేతలతో పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయం మీడియాలో వైరల్ అయ్యింది.

 ప్రభుత్వం ఆయుష్ కార్యాలయం ఏర్పాటుకి సొంత స్థలం ఇచ్చి అక్కడ భవనాలు ఏర్పాటుచేస్తే అక్కడ సిబ్బంది, వైద్యులతో గొడవలు పెట్టుకొని నారా రాద్దాం చేసిన ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి విషయం విమ్స్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఇన్చార్జి ఆర్డీడి ప్రయత్నం బెడిసి కొట్టింది.  ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక, లిఖత పూర్వక లేఖలు లేకుండా తానేమీ చేయలేనని.. అందునా ప్రశాంతంగా ఉన్న విమ్స్ ఆసుపత్రిని గొడవలకి వేదికలు చేయడానికి కాదని సామాన్లు తెచ్చిన సిబ్బందితోనే చెప్పించినట్టు తెలిసింది. అయితే విశాఖలోని మధురవాడ ఆర్డీడి కార్యాలయం తరలింపునకు సంబంధించి కమిషనర్ డి.మంజుల ఉత్తర్వులు ఇచ్చారని ఇన్చార్జి ఆర్డీడి కార్యాలయంలోని మొత్తం సామాన్లు.. కార్యాలయ సిబ్బందితో గొడవలు అనంతరం విమ్స్ ఆసుపత్రికి వెళ్లిపోయారు.  

తొలుత విమ్స్ లో రెండు గదులు కేటాయించడానికి అంగీకరించిన విమ్స్ అధికారులు ఆర్డీడి గొడవలు, పోలీసు కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, వైద్యులను తిట్టడం తదితర అంశాలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులు విమ్స్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రి గేట్లు మూసేసి సామాన్లను, ఆయుష్ ఆర్డీడి కార్యాలయ సిబ్బందిని వెనక్కి పంపేశారట. గత్యంతరం లేక మళ్లీ అదే మధురవాడలోని ఆర్డీడి కార్యాలయానికి సర్దేసిన సామాన్లతో వెళ్లాల్సి వచ్చింది. విమ్స్ లో రెండు గదుల కేటాయింపునకి ఒక మంత్రితో సిఫారసు చేయడం ద్వారా గదులు కేటాయించారని.. దానికి కూడా ప్రాపర్ ఛానల్ లో అధికారిక లేకలు లేకపోవడంతో విమ్స్ సిబ్బంది, అధికారులు ఆయుష్ ఆర్డీడి కార్యాలయాన్ని విమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదు. 

ప్రస్తుతం బాదితురాలు ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి ఝాన్సీలక్ష్మీభాయ్ పై కేసు పెట్టడంతో వివరణ ఇవ్వడానికి ఆయుష్ కమిషనర్ వస్తారని పోలీస్ స్టేషన్ లో చెప్పడంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా నిలిపి వేసినట్టు సమాచారం అందుతుంది. అయితే విధి నిర్వహణ సమయంలో క్రింది స్థాయి సిబ్బంది..అందునా దళిన సిబ్బందిపై చేయిచేసుకున్న వ్యవహారంలో తానెందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చి వాంగూల్మం ఇస్తానని ఆయుష్ కమిషనర్ చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఆయుష్ కార్యాలయంలోని దళిత ఉద్యోగిపై చేయిచేసుకున్న విషయంలో ఆయుష్ శాఖ ఇన్చార్జి ఆర్డీడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయితే డిపార్ట్ మెంట్ పరువు పోతుందని ఈ కేసును రాజీచేయాలని చూస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇదే విషయమై ఆయుష్ కమిషనర్ ను, విమ్స్ డైరెక్టర్ ను చరవాణిలో సంప్రదించాలని ప్రయత్నించినా వార అందుబాటులో లేరు..!

సిఫార్సు