మాల, మాదిగనా కొడుకుల్లారా.. మీ సంగతి చూస్తా..నేను చెప్పినట్టు చేయకపోతే మీరు ఏవిధంగా డ్యూటీలు చేస్తారో చూస్తాను.. మీకు జీతాలు ఎలా వస్తాయో చూస్తాను.. మీరు రాయిస్తే ఒకటి అరా పత్రికల్లో రాయించగలరు.. నేనుు తలచుకుంటే నా అనుకుల మీడియా ద్వారా ఏమైనా రాయించగలను.. నాతో పెట్టుకోవద్దు.. అయినా దళిత డాక్టర్లు, సిబ్బందీ మీకు కూడా అంత పౌరుషమా.. నాపైనే మీడియాలో నేను చేసినవన్నీ రాయిస్తారా..? మీ సంగతి చూస్తా..నేనే ఇక్కడ ఇన్చార్జి ఆర్డీడిగా ఉంటా..? ఎవరు ఏం చేస్తారో చూద్దాం.. ఏం పీకుతారో అదీ చూస్తాను.. నాకంటే సీనియర్లు ఎంతమంది ఉన్నా నేనే ఇన్చార్జి ఆర్డీడీగా రాగలిగానంటే నా రేంజ్ ఏంటో మీకు తెలియడం లేదు.. ఏంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. జిల్లా కార్యాలయంలో దళిత ఉద్యోగిణిపై చేయిచేసుకోవడంతోపాటు.. వైద్యులను కూడా కులం పేరుతో దూషిస్తున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ వైద్యులు, సిబ్బందిపై కురిపిస్తున్న తిట్ల దండకంపై వైద్యులు లిఖిత పూర్వకంగా చేసిన ఫిర్యాదు అంశాలు..!
విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఇన్చార్జి ఆర్డీడి డా. ఝాన్సీ లక్ష్మీభాయ్ పై దళిత వైద్యులు, కార్యాలయ సిబ్బంది, బిసి సామాజిక వైద్యులు ఆయుష్ కమిషనర్ డి.మంజుల కి తమను కులం పేరుతో దూషిస్తూ వేస్తున్నారంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరీ ముఖ్యంగా దళిత వైద్యులను, మాదిగనా కొడుకు, మాలనా కొడుకూ అంటూ సంభోదిస్తూ.. జిల్లా కార్యాలయంలోని సిబ్బంది ముందు అవహేళన చేస్తూ.. కించ పరుస్తూ మాట్లాడుతున్నారనే విషయాన్ని ఫిర్యాదులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలో దళిత ఉద్యోగిణి సుష్మపై చేయిచేసుకోవడంతోపాటు, కులం పేరుతో దూషించిన వ్యవహారంలో పీఎంపాలెం పోలీసు స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు వ్యవహారం నడుస్తుంది.
అదే సమయంలో వైద్యులు కూడా నేరుగా అమరావతిలోని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతోపాటు దానిని సీఎం కార్యాలయం, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయం, ఎస్సీ ఎస్టీ కమిషన్ కి పంపిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. ఇన్చార్జి ఆర్డీడి ఉంటూ సీనియర్ దళిత వైద్యులను కులం పేరుతో దూషించడాన్ని వైద్యులు, సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వశాఖల్లోనూ అందునా ప్రజలకు వైద్యసేవలు అందించే వైద్యులను అంటరాని వాళ్లగా ఇన్చార్జి ఆర్డీడి చూటడం, నోటికొచ్చినట్టు తిట్ల దండకాన్ని తట్టుకోలేకపోతున్నామని వాపోయారు. ఎంత దళిత వైద్యులం అయితే మాత్రం తమను ఈ విధంగా తిడతారా..? సంబోధిస్తారా..? మాకు న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దళితులుగా పుట్టడమే మేము చేసుకున్న పాపమా అని తమ ఆవేదనను కమిషనర్ ముందు ఉంచారు.
అంతేకాకుండా తాము లైంగిక పరమైన వేధింపులు చేస్తున్నామని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు ఒక జిల్లా అధికారిణిని క్రిందిస్థాయి వైద్యులు లైంగికంగా ఏ విధంగా వేధిస్తారనే విషయాన్ని కమిషనర్ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా తనకి నచ్చినట్టుగా వ్యవహరిస్తూ.. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని, తన అనుకూల మీడియాని వెంటపెట్టుకొని డిస్పెన్సరీలకు వచ్చి.. వారిముందే తమను దుర్భాషలాడుతున్నారని, నానా హడావిడీ చేస్తున్నారని కూడా ఫిర్యాదులో పొందు పరిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రాజకీయ నాయకులను, కలవడంతోపాటు ఎన్నికల విషయమై చర్చలు జరుపుతూ ఎన్నికల కోడ్ ని కూడా ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.
తమపై ఇన్చార్జి ఆర్డీడి చేస్తున్న వేధింపులు, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్న కార్యకలాపాలపైనా సమగ్ర విచారణ జరపడంతోపాటు ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని.. రానున్న రోజుల్లో దళిత వైద్యులు, సిబ్బందిని మానసిక ఇబ్బందులకు గురిచేయకుండా న్యాయం చేయాలని వైద్యులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్, లోకాయుక్తాకి కూడా ఫిర్యాదులు పంపినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే విశాఖలోని ఇన్చార్జి ఆర్డీడి దళిత ఉద్యోగిపై చేయి చేసుకోవడంపై దళిత సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి.
-దళిత వైద్యుల ఫిర్యాదు వాస్తవమే-ఆయుష్ కమిషనర్ మంజుల
విశాఖలోని జోన్-1 పరిధిలోని ఆయుష్ వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ కులం పేరుతో దూషించడంతోపాటు, టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నట్టు వైద్యులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారని ఆయుష్ కమిషనర్ డి.మంజుల ఈరోజు-ఈఎన్ఎస్ కి వివరణ ఇచ్చారు. గతంలోనూ ఈమె వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాయని, మొత్తం అన్ని వ్యవహారాలపైనా విచారణ చేస్తామని, వాస్తవాలు తేలితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వివరించారు. అదే సమయంలో దళిత ఉద్యోగిని పై చేయిచేసుకున్న వ్యవహారంలో విచారణ చేస్తామని.. విధి నిర్వహణలో ఉద్యోగులపై అధికారులు చేయి చేసుకోవడం సర్వీస్ రూల్స్, సిసిఎల్ఏ రూల్స్ కి విరుద్దమని పేర్కొన్నారు. గతంలో డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి వైద్యులందరితోనూ డిస్పెన్సిరీలకి తాళాలు వేయించి విశాఖలోని జిల్లా పరిషత్ హాలులో రోజంతా కార్యక్రమం చేపట్టిన విషయమై కూడా విచారణ జరుగుతుందన్నారు. అసలు విశాఖలోని జోన్-1 ఆర్డీడి కార్యాలయంలోనూ, ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ ఏం చేస్తున్నారనే విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు.