పెండింగ్ పనులకు ప్రతిపాదనలు..


Ens Balu
3
MVP Colony
2020-09-30 18:54:17

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పెండింగ్ ఇంజనీరింగ్ పనులను సత్వరమే పూర్తిచేయాలని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు.  బుధవారం నగరంలోని పలు ప్రాంతాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎం.వి.పి కాలనీలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం వద్ద రూ.19.90 లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులకు సంబందించి ప్రతిపాదనలకు అంగీకారం తెలిపామన్నారు. 43వ వార్డులోని చాకలిగెడ్డ ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలు ఎంతవరకూ వచ్చాయనే విషయాన్ని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసు కున్నారు. అనంతరం, ఆమె బీచ్ రోడ్ లో ఉన్న ఆక్వా స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూల్ ను సందర్శించారు. అక్కడ పాడైన పవర్ ప్లాంట్ మరమ్మత్తునకు సంబందించి ప్రతిపాదనలను తయారు చేయాలని పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్ ను ఆదేశించారు. ఎం.వి.పి. కాలనీ లో నిర్మాణంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తంచేశారు.  ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజినీర్లు వేణుగోపాల్, శ్యాంసన్ రాజు, గణేష్ బాబు, కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీనివాస్, ఏడుకొండలు  తదితరులు పాల్గొన్నారు.